ఈ పుస్తకం నేను మీ కోసం, మీ అవసరాలు తీర్చడంకోసం వ్రాయలేదు. అసలు నేను రచయిత అవ్వడం కోసం కూడా వ్రాయలేదు.
ఇది కొద్దిసేపు పక్కన వుంచండి.
అసలు మీ జీవితానికి పరిష్కారాలు చూపేముందు, నా జీవితంలో నా అన్నీ సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నానా? నేను చాలా అభివృద్ధి చెందానా? నేను ముందు చాలా సంతోషంగా వున్నాన్నా?
లేదనే చెప్పాలి...
2004వ సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసే సమయానికి నిండా కష్టాల్లో, కోపంలో, అయోమయంలో వున్నాను. అందువల్లే నేను ఇంటర్ తర్వాత కాలేజ్ లో చదవలేకపోయాను. ఆ తర్వాత అనేక కష్టాలు పడి distance Educationలో B.A పూర్తి చేశాను. నా పరిస్థితి రోజురోజుకీ అన్నీ కష్టాలే, అయినా రోజుకు కనీసం గంటైనా చదివేవాడిని. నేను చదవని రోజులు వెళ్ళమీద లెక్క పెట్టవచ్చు. ఈ ఏడు సంవత్సాలలో. అలా నా కృషికి దైవసహాయం లభించింది. నాలుగు నెలలు క్రియా యోగా రోజుకు రెండు గంటలు చేసాను. ఒత్తిడి పోయింది. క్లారిటి వచ్చింది. ఇక్కడ నుండి నా అభివృద్ధి రేటు కొంత పెరిగింది. ఇక మొదటి విషయానికి వస్తాను. ఈ పుస్తకంలోని విషయాలు నేను పొందుపరుస్తున్నాను. ఇదీ నా సమస్యల పరిష్కార పుస్తకం. అందుకే ఇవి మీకూ ఉపయోగపడగలదు అని ఆశిస్తున్నాను.
మంటలు ఎన్నో కానీ.....
అగ్గి ఒక్కటే...
మనసులు ఎన్నో.....
కానీ ఆనందం ఒక్కటే...
ప్రయాణాలు ఎన్నో.....
కానీ దారి ఒక్కటే...
పరిష్కారాలెన్నో కానీ.....
ప్రశ్న ఒక్కటే...
బాధలేన్నో కానీ.....
చీకటి ఒక్కటే...
దృక్పధాలెన్నో కానీ.....
సత్యం ఒక్కటే...
కొమ్మలెన్నో కానీ.....
చెట్టు ఒక్కటే...
ప్రేమికులు ఎందరో....
కానీ ప్రేమ ఒక్కటే...
ఇలాగే.
సమస్యలెన్నో......
కానీ జీవితం ఒక్కటే...
ఇలాంటి జీవితాన్ని ఆనందముగా గడపడానికి మార్గం చూపడమే ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశం.
- ప్రదీప్ జక్కా
ఈ పుస్తకం నేను మీ కోసం, మీ అవసరాలు తీర్చడంకోసం వ్రాయలేదు. అసలు నేను రచయిత అవ్వడం కోసం కూడా వ్రాయలేదు. ఇది కొద్దిసేపు పక్కన వుంచండి. అసలు మీ జీవితానికి పరిష్కారాలు చూపేముందు, నా జీవితంలో నా అన్నీ సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నానా? నేను చాలా అభివృద్ధి చెందానా? నేను ముందు చాలా సంతోషంగా వున్నాన్నా? లేదనే చెప్పాలి... 2004వ సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసే సమయానికి నిండా కష్టాల్లో, కోపంలో, అయోమయంలో వున్నాను. అందువల్లే నేను ఇంటర్ తర్వాత కాలేజ్ లో చదవలేకపోయాను. ఆ తర్వాత అనేక కష్టాలు పడి distance Educationలో B.A పూర్తి చేశాను. నా పరిస్థితి రోజురోజుకీ అన్నీ కష్టాలే, అయినా రోజుకు కనీసం గంటైనా చదివేవాడిని. నేను చదవని రోజులు వెళ్ళమీద లెక్క పెట్టవచ్చు. ఈ ఏడు సంవత్సాలలో. అలా నా కృషికి దైవసహాయం లభించింది. నాలుగు నెలలు క్రియా యోగా రోజుకు రెండు గంటలు చేసాను. ఒత్తిడి పోయింది. క్లారిటి వచ్చింది. ఇక్కడ నుండి నా అభివృద్ధి రేటు కొంత పెరిగింది. ఇక మొదటి విషయానికి వస్తాను. ఈ పుస్తకంలోని విషయాలు నేను పొందుపరుస్తున్నాను. ఇదీ నా సమస్యల పరిష్కార పుస్తకం. అందుకే ఇవి మీకూ ఉపయోగపడగలదు అని ఆశిస్తున్నాను. మంటలు ఎన్నో కానీ..... అగ్గి ఒక్కటే... మనసులు ఎన్నో..... కానీ ఆనందం ఒక్కటే... ప్రయాణాలు ఎన్నో..... కానీ దారి ఒక్కటే... పరిష్కారాలెన్నో కానీ..... ప్రశ్న ఒక్కటే... బాధలేన్నో కానీ..... చీకటి ఒక్కటే... దృక్పధాలెన్నో కానీ..... సత్యం ఒక్కటే... కొమ్మలెన్నో కానీ..... చెట్టు ఒక్కటే... ప్రేమికులు ఎందరో.... కానీ ప్రేమ ఒక్కటే... ఇలాగే. సమస్యలెన్నో...... కానీ జీవితం ఒక్కటే... ఇలాంటి జీవితాన్ని ఆనందముగా గడపడానికి మార్గం చూపడమే ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశం. - ప్రదీప్ జక్కా
© 2017,www.logili.com All Rights Reserved.