Title | Price | |
Gora Sastri | Rs.50 | In Stock |
అది ఆయన ఎంచుకున్న వృత్తి కాదు. ఖాసా పిలిస్తే నాలుగు 'గీతం' డబ్బులు చేతిలో ఆడే రైల్వే ఉద్యోగానికి తిలోదకాలిచ్చి మద్రాసు చేరారు. ఉద్యోగం ఇంగ్లిషు స్వతంత్రలో, జర్నలిజంలో ఓనమాలు కూడా నేర్వని మనిషి ప్రవృత్తిని సరైన వృత్తి లభించాక పత్రికారంగంలో అత్యున్నత శిఖరాలు అందుకున్నారు. ఆయన రాసే సంపాదకీయాల కోసమే ఆంధ్రభూమి, దక్కన్ క్రానికల్ ప్రజలు చదివారు. ఆనాడు ఆయన రేడియో నాటికలకు ఒరవడిదిద్ది తెలుగు శ్రవ్య నాటికను సుసంపన్నం చేశారు. లౌకికతనూ, రాజకీయాన్నీ ఒక చేత్తోనూ, సృజనాత్మక రచనలను మరో చేత్తోనూ పండించిన సవ్యసాచి. గురజాడ, శ్రీపాద, మల్లాది, చలం లాంటివారి రచనల్లో తెలుగువచనం కదం తొక్కింది. ఆ పారీణుల కోవకు చెందినవాడే నాలుగు దశాబ్దాలపాటు ప్రసిద్ధ పత్రికారచయితగా, సాహితీవేత్తగా, శ్రవ్యనాటికాకర్తగా భాసించిన గోవిందు రామశాస్త్రి (గోరా).
తెలుగు జర్నలిజం మూడు దశాబ్దాల అనుభవం. తెలుగు పత్రికల పరిమాణంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. మీరూ జర్నలిస్టు కావొచ్చు, జర్నలిస్టుల కోసం, అనువదించడం ఎలా?, ప్రచారం పొందటం ఎలా? వంటి పుస్తకాలు రచించారు. వయోజనుల కోసం రాసిన సుఖజీవనం పుస్తకానికి జాతీయ అవార్డు లభించింది. ప్రచురణ రంగంలో కూడా కృషి చేస్తున్నారు.
అది ఆయన ఎంచుకున్న వృత్తి కాదు. ఖాసా పిలిస్తే నాలుగు 'గీతం' డబ్బులు చేతిలో ఆడే రైల్వే ఉద్యోగానికి తిలోదకాలిచ్చి మద్రాసు చేరారు. ఉద్యోగం ఇంగ్లిషు స్వతంత్రలో, జర్నలిజంలో ఓనమాలు కూడా నేర్వని మనిషి ప్రవృత్తిని సరైన వృత్తి లభించాక పత్రికారంగంలో అత్యున్నత శిఖరాలు అందుకున్నారు. ఆయన రాసే సంపాదకీయాల కోసమే ఆంధ్రభూమి, దక్కన్ క్రానికల్ ప్రజలు చదివారు. ఆనాడు ఆయన రేడియో నాటికలకు ఒరవడిదిద్ది తెలుగు శ్రవ్య నాటికను సుసంపన్నం చేశారు. లౌకికతనూ, రాజకీయాన్నీ ఒక చేత్తోనూ, సృజనాత్మక రచనలను మరో చేత్తోనూ పండించిన సవ్యసాచి. గురజాడ, శ్రీపాద, మల్లాది, చలం లాంటివారి రచనల్లో తెలుగువచనం కదం తొక్కింది. ఆ పారీణుల కోవకు చెందినవాడే నాలుగు దశాబ్దాలపాటు ప్రసిద్ధ పత్రికారచయితగా, సాహితీవేత్తగా, శ్రవ్యనాటికాకర్తగా భాసించిన గోవిందు రామశాస్త్రి (గోరా). తెలుగు జర్నలిజం మూడు దశాబ్దాల అనుభవం. తెలుగు పత్రికల పరిమాణంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. మీరూ జర్నలిస్టు కావొచ్చు, జర్నలిస్టుల కోసం, అనువదించడం ఎలా?, ప్రచారం పొందటం ఎలా? వంటి పుస్తకాలు రచించారు. వయోజనుల కోసం రాసిన సుఖజీవనం పుస్తకానికి జాతీయ అవార్డు లభించింది. ప్రచురణ రంగంలో కూడా కృషి చేస్తున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.