అధ్యాయం-1
సంధిదశ
- ఆర్. సోమారెడ్డి
ఇటీవలి చరిత్ర రచనా వ్యాసంగం మానవ కార్యక్రమాల అన్ని రంగాలలోని క్రమాలు, మార్పు స్వభావం, ముఖ్యమైన పరిణామాలపై దృష్టి సారిస్తోంది. ఇదివరకటి చరిత్ర రచన ప్రబలంగా సాంప్రదాయిక పద్ధతిలో ఉండేది; భారతదేశ చరిత్రను, సంస్కృతిని అది మూడు కాలాలుగా విభజించేది: అవి ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలు. ప్రస్తుత చారిత్రక రచన ఆ విభాగాలను ప్రామాణికాలుగా భావించటం లేదు. కొత్త మార్గాన్ని ప్రతిబింబించేటట్లుగా చారిత్రకులు ఇవాళ చరిత్ర అధ్యయనాన్ని పూర్వ, మూల, ప్రాచీన, తొలి చారిత్రిక, తొలి మధ్యయుగ, మలిమధ్యయుగ, ఆధునిక, సమకాలీన చరిత్ర విభాగాలుగా విభజిస్తున్నారు.
ఈ క్రమంలో తొలి సంపుటాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రను తొలి మధ్యయుగం వరకు ప్రస్తావించాయి. ప్రస్తుత సంపుటం మలి మధ్యయుగ చరిత్రను చెప్తుంది; ఇది కాలక్రమచట్రంలో నాలుగు శతాబ్దాల కాలం, క్రీ.శ.1324 నుండి 1724 వరకు విస్తరించి ఉంటుంది. ఇది దక్కనులోని కొన్ని విభాగాలలోను, ద్వీపకల్ప భారతంలోను నెలకొని ఉంది; ఈ కాలంలో చోటు చేసుకున్న మార్పులు శక్తినీ, ఉత్సాహాన్నీ, క్రియాశీలతను, వైరుధ్యాలను ప్రతిబింబిస్తాయి; రాజ్యం, సమాజాలపై ఇవి ఎంతో ప్రభావాన్ని చూపాయి. తొలి మధ్యయుగంలోని లక్షణం వ్యాపక రాజకీయ ఆర్థికవ్యవస్థ, ప్రాంతీయ రాజ్యాల ప్రాదుర్భావం; ఈ రాజ్యాలు (రాజకీయ నిర్మాణం) కేంద్రీకృత, ఏకకేంద్రిక, అధికార పాలన లేక ఏకీకృత లేక భూస్వామిక లేక ఖండక లేక పైతృక లేక మాన్యరూపకమో అయిన రాజ్యతంత్రాన్ని కలిగి ఉండేవి. అయితే, మలి మధ్యయుగ కాలపు రాజ్యవ్యవస్థ నిర్మాణాన్ని ఎలాంటి నిశ్చిత నమూనాలకు సంబంధించినవిగా చెప్పలేము; వీటిని పాలకులు తమ అవసరాలకు, పరిస్థితులకు తగినట్లుగా మలుచుకున్నారు. రాజ్య శక్తి, సజీవత్వం, స్థిరత్వం, భద్రతలు, ప్రభువు వైయక్తిక లక్షణాలు, శక్తిసామర్ధ్యాలు, దీర్ఘదృష్టి గమ్యాలపై ఆధారపడ్డాయి........................
అధ్యాయం-1 సంధిదశ - ఆర్. సోమారెడ్డి ఇటీవలి చరిత్ర రచనా వ్యాసంగం మానవ కార్యక్రమాల అన్ని రంగాలలోని క్రమాలు, మార్పు స్వభావం, ముఖ్యమైన పరిణామాలపై దృష్టి సారిస్తోంది. ఇదివరకటి చరిత్ర రచన ప్రబలంగా సాంప్రదాయిక పద్ధతిలో ఉండేది; భారతదేశ చరిత్రను, సంస్కృతిని అది మూడు కాలాలుగా విభజించేది: అవి ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలు. ప్రస్తుత చారిత్రక రచన ఆ విభాగాలను ప్రామాణికాలుగా భావించటం లేదు. కొత్త మార్గాన్ని ప్రతిబింబించేటట్లుగా చారిత్రకులు ఇవాళ చరిత్ర అధ్యయనాన్ని పూర్వ, మూల, ప్రాచీన, తొలి చారిత్రిక, తొలి మధ్యయుగ, మలిమధ్యయుగ, ఆధునిక, సమకాలీన చరిత్ర విభాగాలుగా విభజిస్తున్నారు. ఈ క్రమంలో తొలి సంపుటాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రను తొలి మధ్యయుగం వరకు ప్రస్తావించాయి. ప్రస్తుత సంపుటం మలి మధ్యయుగ చరిత్రను చెప్తుంది; ఇది కాలక్రమచట్రంలో నాలుగు శతాబ్దాల కాలం, క్రీ.శ.1324 నుండి 1724 వరకు విస్తరించి ఉంటుంది. ఇది దక్కనులోని కొన్ని విభాగాలలోను, ద్వీపకల్ప భారతంలోను నెలకొని ఉంది; ఈ కాలంలో చోటు చేసుకున్న మార్పులు శక్తినీ, ఉత్సాహాన్నీ, క్రియాశీలతను, వైరుధ్యాలను ప్రతిబింబిస్తాయి; రాజ్యం, సమాజాలపై ఇవి ఎంతో ప్రభావాన్ని చూపాయి. తొలి మధ్యయుగంలోని లక్షణం వ్యాపక రాజకీయ ఆర్థికవ్యవస్థ, ప్రాంతీయ రాజ్యాల ప్రాదుర్భావం; ఈ రాజ్యాలు (రాజకీయ నిర్మాణం) కేంద్రీకృత, ఏకకేంద్రిక, అధికార పాలన లేక ఏకీకృత లేక భూస్వామిక లేక ఖండక లేక పైతృక లేక మాన్యరూపకమో అయిన రాజ్యతంత్రాన్ని కలిగి ఉండేవి. అయితే, మలి మధ్యయుగ కాలపు రాజ్యవ్యవస్థ నిర్మాణాన్ని ఎలాంటి నిశ్చిత నమూనాలకు సంబంధించినవిగా చెప్పలేము; వీటిని పాలకులు తమ అవసరాలకు, పరిస్థితులకు తగినట్లుగా మలుచుకున్నారు. రాజ్య శక్తి, సజీవత్వం, స్థిరత్వం, భద్రతలు, ప్రభువు వైయక్తిక లక్షణాలు, శక్తిసామర్ధ్యాలు, దీర్ఘదృష్టి గమ్యాలపై ఆధారపడ్డాయి........................© 2017,www.logili.com All Rights Reserved.