Mana Haindava Rajyam

By Aakar Patel (Author)
Rs.300
Rs.300

Mana Haindava Rajyam
INR
MANIMN4719
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఆవేశ రహితంగా దేశ విభజన గురించి..

తెలుగు: జి. శ్రీరామమూర్తి (నిజం)

మన కథ దేశ విభజనతోనే ప్రారంభం కావాలి. కాంగ్రెస్ బలహీనత, ముస్లింల విద్రోహం వల్లనే 1947లో దేశ విభజన, పాకిస్తాన్ ఆవిర్భావం జరిగాయని హిందుత్వ శక్తులు అర్థం చేసుకున్నాయి. ఇటువంటి అతి టూకీ, కిట్టింపు అవగాహన వల్ల ముస్లింలు విభజనకు పట్టుబట్టారని, దానిని ససేమిరా కాదని దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి భీష్మించుకుని ఉంటే వారు నోరు మూసుకుని ఉండేవారనే అభిప్రాయం కలుగుతుంది. మరింత గట్టి వెన్నెముక గల వ్యక్తి అప్పుడు నిర్ణయాధికార పీఠం మీద ఉండి ఉంటే దేశం చీలిపోకుండా చూసి అవిభక్త భారత మాతను కాపాడేవాడనే ఆలోచన అది. ప్రజాప్రచార మాధ్యమాల్లో దీనిని నిలదీయకపోవడం వల్ల అది ఓటర్లలో తిష్ఠ వేసుకున్నది. తుకే తుకే గ్యాంగ్ (చీలికలు పేలికలు చేసే ముఠా) వంటి ఆకర్షణీయమైన పద ప్రయోగ చాతుర్యాల వల్ల అది వారిలో మరింతగా నాటుకుపోయింది. అటువంటి శక్తులు ఇండియాను కావాలని బద్దలు చేశారనే అభిప్రాయాన్ని కలుగజేసింది. అయితే, లాల్ బాల్ పాల్ అనే దేశ భక్త త్రయంలో ఒకరైన, పంజాబ్ కేసరి లాలాలజపతి రాయ్ కూడా ఈ తుకే తుకే గ్యాంగ్లో చేరిపోయారంటే వారు ఆశ్చర్యపోవచ్చు.

1947 నాటి పరిణామాల వాస్తవమేమిటంటే అవి కాంగ్రెస్ పార్టీ బలం నుంచి ఉత్పన్నమయ్యాయే గాని దాని బలహీనత నుంచి కాదు. దేశాధికారంలో ముస్లింలకు సహేతుకమైన వాటా, ముఖ్యంగా కేంద్రంలో ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించడమే అంతిమంగా దేశ విభజనకు దారి తీసింది. పరిణామ క్రమాన్ని మరింత నిర్మల దృష్టితో నిజాయితీగా చూడడం ద్వారానే 1947కు ముందరి దశాబ్దాలలో జరిగిన దానిని అర్థం చేసుకోగలం. బ్రిటిష్ పాలకులు ఏదో ఒక రకమైన స్వయం పాలనను ఇవ్వడానికి దారి చేసిన తర్వాతనే క్రమంగా స్వాతంత్య్రాన్ని మన హైందవ రాజ్యం....................

ఆవేశ రహితంగా దేశ విభజన గురించి.. తెలుగు: జి. శ్రీరామమూర్తి (నిజం) మన కథ దేశ విభజనతోనే ప్రారంభం కావాలి. కాంగ్రెస్ బలహీనత, ముస్లింల విద్రోహం వల్లనే 1947లో దేశ విభజన, పాకిస్తాన్ ఆవిర్భావం జరిగాయని హిందుత్వ శక్తులు అర్థం చేసుకున్నాయి. ఇటువంటి అతి టూకీ, కిట్టింపు అవగాహన వల్ల ముస్లింలు విభజనకు పట్టుబట్టారని, దానిని ససేమిరా కాదని దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి భీష్మించుకుని ఉంటే వారు నోరు మూసుకుని ఉండేవారనే అభిప్రాయం కలుగుతుంది. మరింత గట్టి వెన్నెముక గల వ్యక్తి అప్పుడు నిర్ణయాధికార పీఠం మీద ఉండి ఉంటే దేశం చీలిపోకుండా చూసి అవిభక్త భారత మాతను కాపాడేవాడనే ఆలోచన అది. ప్రజాప్రచార మాధ్యమాల్లో దీనిని నిలదీయకపోవడం వల్ల అది ఓటర్లలో తిష్ఠ వేసుకున్నది. తుకే తుకే గ్యాంగ్ (చీలికలు పేలికలు చేసే ముఠా) వంటి ఆకర్షణీయమైన పద ప్రయోగ చాతుర్యాల వల్ల అది వారిలో మరింతగా నాటుకుపోయింది. అటువంటి శక్తులు ఇండియాను కావాలని బద్దలు చేశారనే అభిప్రాయాన్ని కలుగజేసింది. అయితే, లాల్ బాల్ పాల్ అనే దేశ భక్త త్రయంలో ఒకరైన, పంజాబ్ కేసరి లాలాలజపతి రాయ్ కూడా ఈ తుకే తుకే గ్యాంగ్లో చేరిపోయారంటే వారు ఆశ్చర్యపోవచ్చు. 1947 నాటి పరిణామాల వాస్తవమేమిటంటే అవి కాంగ్రెస్ పార్టీ బలం నుంచి ఉత్పన్నమయ్యాయే గాని దాని బలహీనత నుంచి కాదు. దేశాధికారంలో ముస్లింలకు సహేతుకమైన వాటా, ముఖ్యంగా కేంద్రంలో ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించడమే అంతిమంగా దేశ విభజనకు దారి తీసింది. పరిణామ క్రమాన్ని మరింత నిర్మల దృష్టితో నిజాయితీగా చూడడం ద్వారానే 1947కు ముందరి దశాబ్దాలలో జరిగిన దానిని అర్థం చేసుకోగలం. బ్రిటిష్ పాలకులు ఏదో ఒక రకమైన స్వయం పాలనను ఇవ్వడానికి దారి చేసిన తర్వాతనే క్రమంగా స్వాతంత్య్రాన్ని మన హైందవ రాజ్యం....................

Features

  • : Mana Haindava Rajyam
  • : Aakar Patel
  • : Telangana Publications
  • : MANIMN4719
  • : paparback
  • : 2023
  • : 334
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mana Haindava Rajyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam