"మేము కలలుకనే రాజ్యంలో మరణశిక్షలుండవు! కరకు హంతకులకు, తీవ్రవాదులకు సైతం ఇతర శిక్షలుంటాయి తప్ప మరణశిక్షలంటూ ఉండవు!!" అన్నాడు ఉపోద్గాతంగా. "అనాగరికంగా, పరమపాశవికంగా తయారయిపోతున్న నేటి సమాజంలో - మరణశిక్ష లేకపోతే మనిషికి భయం ఎలా ఉంటుంది? సామాన్య నేరస్తుడు కూడా క్రమక్రమంగా హంతకుడుగా మారే ప్రమాదం ఉంటుంది కద?" అని ప్రశ్నించాను. నా ప్రశ్న విని పిచ్చి డాక్టరు నవ్వాడు. ఆయన నవ్వగలడని నాకప్పుడే తెలిసింది... ఎందుకంటే ఆయన నవ్వగా నేనెప్పుడు చూడలేదు! "అలా జరగదు. హత్య కాదుకదా, చిన్ననేరం చెయ్యడానికి కూడా ఏ మనిషీ సాహసించే అవకాశం ఉండదు. ఎందుకంటే మరణశిక్షలు తప్ప ఇతర శిక్షలన్నీ వుంటాయి. మామూలుగా ఉండడం కాదు చాలా కఠినంగా వుంటాయి!" అన్నాడు. "ఎలా?" అని ఆశ్చర్యంగా ప్రశ్నించాను. "అయితే చాల చెప్పాలి!" అంటూ ఆయన మొదలుపెట్టాడు.
పాఠకులను అమూల్య ప్రేమామృతం నుండీ అద్భుతమైన సాధారణ జీవనయానం మీదుగా ప్రస్తుత భయానక సామాజిక సమస్యలవైపుకు నడిపించి... సామాన్య మానవుడి నిశ్శబ్ద అంతరంగ ఆక్రన్దనలతో కూడిన అనేక ప్రశ్నలతో ఆలోచింపజేసే నవల 'కలలరాజ్యం'.
చదవండి... చదివించండి... ఆలోచించండి...!
"మేము కలలుకనే రాజ్యంలో మరణశిక్షలుండవు! కరకు హంతకులకు, తీవ్రవాదులకు సైతం ఇతర శిక్షలుంటాయి తప్ప మరణశిక్షలంటూ ఉండవు!!" అన్నాడు ఉపోద్గాతంగా. "అనాగరికంగా, పరమపాశవికంగా తయారయిపోతున్న నేటి సమాజంలో - మరణశిక్ష లేకపోతే మనిషికి భయం ఎలా ఉంటుంది? సామాన్య నేరస్తుడు కూడా క్రమక్రమంగా హంతకుడుగా మారే ప్రమాదం ఉంటుంది కద?" అని ప్రశ్నించాను. నా ప్రశ్న విని పిచ్చి డాక్టరు నవ్వాడు. ఆయన నవ్వగలడని నాకప్పుడే తెలిసింది... ఎందుకంటే ఆయన నవ్వగా నేనెప్పుడు చూడలేదు! "అలా జరగదు. హత్య కాదుకదా, చిన్ననేరం చెయ్యడానికి కూడా ఏ మనిషీ సాహసించే అవకాశం ఉండదు. ఎందుకంటే మరణశిక్షలు తప్ప ఇతర శిక్షలన్నీ వుంటాయి. మామూలుగా ఉండడం కాదు చాలా కఠినంగా వుంటాయి!" అన్నాడు. "ఎలా?" అని ఆశ్చర్యంగా ప్రశ్నించాను. "అయితే చాల చెప్పాలి!" అంటూ ఆయన మొదలుపెట్టాడు. పాఠకులను అమూల్య ప్రేమామృతం నుండీ అద్భుతమైన సాధారణ జీవనయానం మీదుగా ప్రస్తుత భయానక సామాజిక సమస్యలవైపుకు నడిపించి... సామాన్య మానవుడి నిశ్శబ్ద అంతరంగ ఆక్రన్దనలతో కూడిన అనేక ప్రశ్నలతో ఆలోచింపజేసే నవల 'కలలరాజ్యం'. చదవండి... చదివించండి... ఆలోచించండి...!© 2017,www.logili.com All Rights Reserved.