విహారయాత్ర కాదు, శోధనాయాత్ర
--------- గబ్బిట కృష్ణమోహన్
సగటు ప్రయాణీకుడు థాయ్లాండ్ యాత్ర చేసేందుకు కండక్టెడ్ టూర్స్ ని ఎంచుకుని మొదటిరోజు బ్యాంకాక్, రెండోరోజు పట్టాయాలో గడిపి తిరిగి వచ్చేయడంతో యాత్ర ముగుస్తుంది. లేకపోతే మరో రెండురోజులు మలేషియా, ఇంకోరోజు సింగపూర్ సైట్ సీయింగ్తో ఆ విహారయాత్ర ముక్తాయింపు పాడతాడు.
నిత్యపథికుడైన దాసరి అమరేంద్ర చేసేది ఒట్టి విహారయాత్ర మాత్రమే కాదు, అది శోధనాయాత్ర... అన్వేషణ....
కొత్త ప్రదేశాల్లో భాష రాని చోట కూడా ఆయన ఎంచుకునేది, ఆయనకి అత్యంత యిష్టమైనది- అక్కడి ప్రజలతో మమేకమవడం, వారి జీవనశైలిని కొంతగానయినా అవగాహన చేసుకోవడం, అక్కడి సంస్కృతిని అర్థం చేసు కోవడం. వీటికోసం ఆయన కిలోమీటర్ల కొద్దీ, గంటలకొద్దీ నడకనే ఎంచు కుంటారు. అందుకే టూరిస్ట్ గా కాకుండా ట్రావెలర్ గా తిరగడం ఆయనకు యిష్టం. ఆ సంగతి ఆయనకు ఆతిథ్యం యిచ్చినవారికి కూడా బాగా తెలుసు. 'అనుభవాలను ఒకచోట రాసుకోవడం, వాటిల్ని నలుగురికీ వినిపించాలను కోవడం నా యాత్రాసరళి,' అన్న జపాన్ హైకూ కవి మత్సువొ బషో మాటల్ని యథాతథంగా పాటించే వ్యక్తి అమరేంద్ర.
'మే మొదటి వారంలో వచ్చేయండి' అన్న బ్యాంకాక్ అతిథేయుల ఆహ్వా నంతో ఆగకుండా వారం మొదట్లోనే, అంటే రెండో తారీఖునే ఆయన ఢిల్లీ నుంచి బయల్దేరడంలో ఏ వింతా లేదు. రాత్రంతా విమానాశ్రయంలో గడిపి, మర్నాటి ఉదయమంతా ప్రయాణం చేసి, మధ్యాహ్నం బ్యాంకాక్లో దిగినాక.............
విహారయాత్ర కాదు, శోధనాయాత్ర--------- గబ్బిట కృష్ణమోహన్ సగటు ప్రయాణీకుడు థాయ్లాండ్ యాత్ర చేసేందుకు కండక్టెడ్ టూర్స్ ని ఎంచుకుని మొదటిరోజు బ్యాంకాక్, రెండోరోజు పట్టాయాలో గడిపి తిరిగి వచ్చేయడంతో యాత్ర ముగుస్తుంది. లేకపోతే మరో రెండురోజులు మలేషియా, ఇంకోరోజు సింగపూర్ సైట్ సీయింగ్తో ఆ విహారయాత్ర ముక్తాయింపు పాడతాడు. నిత్యపథికుడైన దాసరి అమరేంద్ర చేసేది ఒట్టి విహారయాత్ర మాత్రమే కాదు, అది శోధనాయాత్ర... అన్వేషణ.... కొత్త ప్రదేశాల్లో భాష రాని చోట కూడా ఆయన ఎంచుకునేది, ఆయనకి అత్యంత యిష్టమైనది- అక్కడి ప్రజలతో మమేకమవడం, వారి జీవనశైలిని కొంతగానయినా అవగాహన చేసుకోవడం, అక్కడి సంస్కృతిని అర్థం చేసు కోవడం. వీటికోసం ఆయన కిలోమీటర్ల కొద్దీ, గంటలకొద్దీ నడకనే ఎంచు కుంటారు. అందుకే టూరిస్ట్ గా కాకుండా ట్రావెలర్ గా తిరగడం ఆయనకు యిష్టం. ఆ సంగతి ఆయనకు ఆతిథ్యం యిచ్చినవారికి కూడా బాగా తెలుసు. 'అనుభవాలను ఒకచోట రాసుకోవడం, వాటిల్ని నలుగురికీ వినిపించాలను కోవడం నా యాత్రాసరళి,' అన్న జపాన్ హైకూ కవి మత్సువొ బషో మాటల్ని యథాతథంగా పాటించే వ్యక్తి అమరేంద్ర. 'మే మొదటి వారంలో వచ్చేయండి' అన్న బ్యాంకాక్ అతిథేయుల ఆహ్వా నంతో ఆగకుండా వారం మొదట్లోనే, అంటే రెండో తారీఖునే ఆయన ఢిల్లీ నుంచి బయల్దేరడంలో ఏ వింతా లేదు. రాత్రంతా విమానాశ్రయంలో గడిపి, మర్నాటి ఉదయమంతా ప్రయాణం చేసి, మధ్యాహ్నం బ్యాంకాక్లో దిగినాక.............© 2017,www.logili.com All Rights Reserved.