ఉపోద్ఘాతము
కంకార్జునగరానికి సమీపంలో వాల్డన్ చెరువు వొడ్డున అడవిలో స్వయంగా కట్టుకొన్న ఇంట్లో ఒంటరిగా జీవిస్తూ ఉన్న కాలంలో ఈ పుస్తకంలో చాలాభాగం వ్రాశాను. ఆ యింటికి దాపున ఇళ్ళు లేవు. ఇరుగుపొరుగులు అని చెప్పుకో దగ్గవారు మైలు దూరంలో కానీ లేరు. అలాగా ఒంటరిగా రెండు సంవత్సరాల రెండునెలలు స్వతంత్రంగా, స్వశక్తిపై ఆధారపడి వళ్ళువంచి పనిచేస్తూ జీవితం గడిపాను.
నా జీవితాన్ని గురించీ, నాగురించీ కొంత ఆసక్తి, ఆదరణగల మనుష్యులు తరచు అనేక ప్రశ్నలువేసి ఆ విషయాలు తెలుసుకోవాలని కుతూహలపడి ఉండకపోతే నే నీ సంగతులన్నీ వ్రాయకపోదును. నా సొదతో ఎవ్వరికాలాన్నీ వృధా చేయాలనే సంకల్పమూలేదు.
అక్కడ నా జీవితం చాలా సహజంగానూ, సౌమ్యంగానూ గడిచింది.
“అక్కడ ఉంటున్నప్పుడు నువ్వు ఏమితిని బ్రతికావయ్యా? అక్కడ నువ్వు ఒంటరిగా ఉంటూఉన్నందుకు బాధపడలేదూ?” అని కొందరూ, “నీ ఆస్తిలో ఎన్నోవంతు ఖర్చుపెట్టి దానధర్మాలు చేశావయ్యా? నువ్వు ఎంతమంది బీద విద్యార్థులను పోషించావేమిటి?” అని అంటూ మరికొందరు నన్ను ప్రశ్నించారు. ఇంకా అనేక ప్రశ్నలు వేశారు. ఈ పుస్తకంలో వాటికి కొన్నింటికి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాన
- హెన్రీ డేవిడ్ థొరియో
© 2017,www.logili.com All Rights Reserved.