పోరాటం - అధ్యయనం
తెలంగాణ ఉద్యమం కేసీఆర్ వచ్చాకనే ప్రారంభమైందని కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారు. కేసీఆర్ దీక్ష మూలంగానే తెలంగాణ ఉద్యమం ఉధృతమైందని నమ్ముతున్న వాళ్లు అనేక మంది. కానీ చరిత్ర తెలియని వారు కొత్త చరిత్రను నిర్మించలేరు. కోస్తాంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర సాధన పోరాటంలో ప్రజల చరిత్రను దాని దృక్పథాన్ని సరిగ్గా అర్ధం చేసుకోకుండా కొత్త చరిత్రను నిర్మించలేం. మహా ఉధృతమైన తెలంగాణ రాష్ట్ర సాధన రెండవ దశ పోరాటాన్ని దానికి కర్త, కర్మ, క్రియగా నిలిచిన విద్యార్థి ఉద్యమాన్ని గురించి లోతుగా తెలుసుకోవడం అవసరం.
మీడియా, పత్రికలు, గులాబీ మేథావులు చిత్రీకరించినది వాస్తవ చరిత్ర కాదు. దీక్ష విరమించి నిమ్మరసం తాగిన కేసీఆర్ ద్రోహం నుండి పెల్లుబికిన విద్యార్థి ఉద్యమమే చరిత్ర మలుపుకు దారి తీసింది.
ఎం.ఫిల్. పరిశోధన పత్రం ఇది. ప్రజల ఆకాంక్షల దృక్పథం నుండి తెలంగాణా ఉద్యమాన్ని చూస్తుంది. ప్రభువు ఎక్కిన పల్లకిని కాకుండా పల్లకిని మోసే బోయీల గురించి ఆలోచించమని కవి చెప్పినట్లుగా ప్రత్యామ్నాయ దృష్టిలో చరిత్రను పరిశీలించాలని నా పరిశోధన పత్రం వివరిస్తుంది.
పోరాటం - అధ్యయనం తెలంగాణ ఉద్యమం కేసీఆర్ వచ్చాకనే ప్రారంభమైందని కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారు. కేసీఆర్ దీక్ష మూలంగానే తెలంగాణ ఉద్యమం ఉధృతమైందని నమ్ముతున్న వాళ్లు అనేక మంది. కానీ చరిత్ర తెలియని వారు కొత్త చరిత్రను నిర్మించలేరు. కోస్తాంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర సాధన పోరాటంలో ప్రజల చరిత్రను దాని దృక్పథాన్ని సరిగ్గా అర్ధం చేసుకోకుండా కొత్త చరిత్రను నిర్మించలేం. మహా ఉధృతమైన తెలంగాణ రాష్ట్ర సాధన రెండవ దశ పోరాటాన్ని దానికి కర్త, కర్మ, క్రియగా నిలిచిన విద్యార్థి ఉద్యమాన్ని గురించి లోతుగా తెలుసుకోవడం అవసరం. మీడియా, పత్రికలు, గులాబీ మేథావులు చిత్రీకరించినది వాస్తవ చరిత్ర కాదు. దీక్ష విరమించి నిమ్మరసం తాగిన కేసీఆర్ ద్రోహం నుండి పెల్లుబికిన విద్యార్థి ఉద్యమమే చరిత్ర మలుపుకు దారి తీసింది. ఎం.ఫిల్. పరిశోధన పత్రం ఇది. ప్రజల ఆకాంక్షల దృక్పథం నుండి తెలంగాణా ఉద్యమాన్ని చూస్తుంది. ప్రభువు ఎక్కిన పల్లకిని కాకుండా పల్లకిని మోసే బోయీల గురించి ఆలోచించమని కవి చెప్పినట్లుగా ప్రత్యామ్నాయ దృష్టిలో చరిత్రను పరిశీలించాలని నా పరిశోధన పత్రం వివరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.