షట్చక్రవర్తి చరిత్ర
కం. శ్రీకారుణ్య కటాక్ష
లోకన వర్ధిత సమస్త లోకాధిప ! దే
హాకలిత ధవళకాంతి ని
రాకృత రజనీశ ! సిద్ధరామ మహేశా !!
1
అర్థం : ఆశ్వాసాదిలో కృతిపతికి సంబోధనలు, శ్రీ = మంగళప్రదమైన, = దయతో నిండిన, కటాక్ష = నీ కడకన్నుల, ఆలోకన = చూపులతో, వర్ధిత = సంరక్షింపబడిన, సమస్త లోక + అధిప = పదునాల్గు భువనాల అధిపతులూ కలవాడా! సమస్త లోకాధిపతులనూ కడకంటి చూపుల దయతో వృద్ధిపొందించే వాడా!! దేహ + ఆకలిత = నీ శరీరం మీద ఒప్పారిన, ధవళకాంతి = తెల్లని తేజస్సుతో = విభూతి ధవళిమతో, నిరాకృత తిరస్కరింపబడిన, రజనీశ = చంద్రుడు కలవాడా! శరీర ధవళిమతో చంద్రుణ్ని మించిన వాడా! సిద్ధరామ మహేశా!! (స్పష్టం).
తే.గీ. అవధరింపుము మునులు కిట్లనుచుఁ బలికె
సూతుడత్యంత వినయ సమేతుఁ డగుచు
మనియె సాగర సప్తక క్ష్మాతలేశ
చక్రనుతకీర్తి పురుకుత్స చక్రవర్తి.
అర్థం : సిద్దరామమహేశా! అవధరింపుము = ఆలకించుమా! సూతుఁడు, అత్యంత = మిక్కిలి, వినయసమేతుఁడు + అగుచు = వినయంతో కూడిన వాడవుతూ, మునులకున్ = శౌనకాది మహామునులకు, ఇట్లు + అనుచున్ = ఇలా అనుచు, పలికెన్ = చెప్పాడు
షట్చక్రవర్తి చరిత్ర పురుకుత కథ షష్ఠాశ్వాసము (పూర్వభాగము) కం. శ్రీకారుణ్య కటాక్ష లోకన వర్ధిత సమస్త లోకాధిప ! దే హాకలిత ధవళకాంతి ని రాకృత రజనీశ ! సిద్ధరామ మహేశా !! 1 అర్థం : ఆశ్వాసాదిలో కృతిపతికి సంబోధనలు, శ్రీ = మంగళప్రదమైన, = దయతో నిండిన, కటాక్ష = నీ కడకన్నుల, ఆలోకన = చూపులతో, వర్ధిత = సంరక్షింపబడిన, సమస్త లోక + అధిప = పదునాల్గు భువనాల అధిపతులూ కలవాడా! సమస్త లోకాధిపతులనూ కడకంటి చూపుల దయతో వృద్ధిపొందించే వాడా!! దేహ + ఆకలిత = నీ శరీరం మీద ఒప్పారిన, ధవళకాంతి = తెల్లని తేజస్సుతో = విభూతి ధవళిమతో, నిరాకృత తిరస్కరింపబడిన, రజనీశ = చంద్రుడు కలవాడా! శరీర ధవళిమతో చంద్రుణ్ని మించిన వాడా! సిద్ధరామ మహేశా!! (స్పష్టం). తే.గీ. అవధరింపుము మునులు కిట్లనుచుఁ బలికె సూతుడత్యంత వినయ సమేతుఁ డగుచు మనియె సాగర సప్తక క్ష్మాతలేశ చక్రనుతకీర్తి పురుకుత్స చక్రవర్తి. అర్థం : సిద్దరామమహేశా! అవధరింపుము = ఆలకించుమా! సూతుఁడు, అత్యంత = మిక్కిలి, వినయసమేతుఁడు + అగుచు = వినయంతో కూడిన వాడవుతూ, మునులకున్ = శౌనకాది మహామునులకు, ఇట్లు + అనుచున్ = ఇలా అనుచు, పలికెన్ = చెప్పాడు© 2017,www.logili.com All Rights Reserved.