మాడిసన్లోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలోని ఆసియా భాషా సంస్కృతుల శాఖలో ఆచార్యవెల్చేరునారాయణరావుగారి పర్యవేక్షణలోపిహెచ్.డి పట్టాకోసం 2004 లో సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి తెలుగు సేత ఈ పుస్తకం. ఇందులోని కొన్నిఅధ్యాయాలను ఇంతకుముందుచరిత్ర పరిశోధనా జర్నల్స్ లో వ్యాసాలుగా ప్రచురించాను. ఈ సిద్ధాంత వ్యాసం రాసి పదిహేనేళ్లుదాటినప్పటికీస్వీయకథా సిద్ధాంతంలోగాని,భారతదేశ చరిత్ర విశ్లేషణా దృక్కోణంలో (perspective) గాని గణనీయమైన మార్పులేవీ రాలేదు కాబట్టిఈపుస్తకానికి కాలదోషంపట్టలేదని నా ప్రగాఢ విశ్వాసం.
అదేహం పంతొమ్మిది, ఇరవయ్యో శతాబ్దాలలో భారతీయ సమాజంలో పెను మార్పులు వచ్చాయి.సంప్రదాయ సమాజాన్నుండిఆధునిక సమాజానికి జరిగిన మార్పుగా దీనిని మనం ఒక కోణంలో అర్థం చేసుకోవచ్చు.మరో కోణంలోdynamicగాఉండి స్వీయచలనంకలిగిన సమాజపు గమనాన్ని, దిశను వలసపాలన వేరు దిశలో దారి మళ్లించిన మార్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు.ఇన్ని మార్పులు.
RajagopalVakulabharanam,SelfandSocietyinTransition:studyofModernAutobiographical
Practice in Telugu, PhD issertation, department Languages and cultures of Asia,Universityof Wisconsin-Madison,2004.
© 2017,www.logili.com All Rights Reserved.