పుట్టినూరు, కన్నతల్లి స్వర్గంతో సమానం అంటారు. పుట్టినూరు అమ్మ వడయితే, పుట్టినప్పటినుంచీ తన సాధక బాధకాలలో పాలుపంచుకున్న ఆ ఊరిజనం దేవతలతో సమానం. అట్లాంటి పుట్టినూరుని వదిలేసినవాడు అమ్మ ఒడికి దూరమైన పసికందు లాంటివాడు. అందుకే పుట్టినారు వదిలేసిన జీవితం తెగిన గాలిపటమైపోతుంది. ఆ తర్వాత వాడేవూర్లో వున్నా ఒకటే. ఊరు మారుతూనే వాడి ఉనికే కాదు, వాడి పేరూగీరు అన్నీ మారిపోతాయి.
నిత్యం కరువులతో, కక్షలతో కునారిల్లిపోతున్న రాయలసీమ రైతుకు అలాంటి వలస జీవితం అనివార్యమైపోతుంది. నిత్యదారిద్రంతో పరాయి ప్రదేశంలోనూ బతుకు బండి నడవక చిద్రమైపోతున్న జీవితాలెన్నో. తన ఊరిలో మరో దూరప్రాంతానికి వలసవెళ్లి, అక్కడ నానాకష్టాలు అనుభవించి, అక్కడా ఉండలేక మరో కొత్త ప్రదేశానికి వలస వెళ్లి, అక్కడా కష్టాల కాల సర్పాలు కాటేస్తే ఇంకో ప్రదేశానికి మకాం మార్చేస్తూ చివరికి, తాత్వికచింతనలోకి వెళ్ళిపోయిన ఓ బడుగు జీవితగాథ 'వలస'.
పుట్టినూరు, కన్నతల్లి స్వర్గంతో సమానం అంటారు. పుట్టినూరు అమ్మ వడయితే, పుట్టినప్పటినుంచీ తన సాధక బాధకాలలో పాలుపంచుకున్న ఆ ఊరిజనం దేవతలతో సమానం. అట్లాంటి పుట్టినూరుని వదిలేసినవాడు అమ్మ ఒడికి దూరమైన పసికందు లాంటివాడు. అందుకే పుట్టినారు వదిలేసిన జీవితం తెగిన గాలిపటమైపోతుంది. ఆ తర్వాత వాడేవూర్లో వున్నా ఒకటే. ఊరు మారుతూనే వాడి ఉనికే కాదు, వాడి పేరూగీరు అన్నీ మారిపోతాయి. నిత్యం కరువులతో, కక్షలతో కునారిల్లిపోతున్న రాయలసీమ రైతుకు అలాంటి వలస జీవితం అనివార్యమైపోతుంది. నిత్యదారిద్రంతో పరాయి ప్రదేశంలోనూ బతుకు బండి నడవక చిద్రమైపోతున్న జీవితాలెన్నో. తన ఊరిలో మరో దూరప్రాంతానికి వలసవెళ్లి, అక్కడ నానాకష్టాలు అనుభవించి, అక్కడా ఉండలేక మరో కొత్త ప్రదేశానికి వలస వెళ్లి, అక్కడా కష్టాల కాల సర్పాలు కాటేస్తే ఇంకో ప్రదేశానికి మకాం మార్చేస్తూ చివరికి, తాత్వికచింతనలోకి వెళ్ళిపోయిన ఓ బడుగు జీవితగాథ 'వలస'.© 2017,www.logili.com All Rights Reserved.