కె ఎ నీలకంఠ శాస్త్రి ప్రసిద్ధ భారతీయ చరిత్రకారుడు. దక్షిణ భారత చరిత్రపై ప్రామాణిక గ్రంథాలు రచించారు. దక్షిణ భారతదేశ చరిత్ర ఆధారాలపై ఆయనకు అపారమైన అధికారం ఉంది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత.
డా నేలటూరి వెంకటరమణయ్య తెలుగు జాతి గర్వించదగ్గ చరిత్రకారుల్లో ఒకరు. విజయనగర చరిత్రమీద ఐదు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా పరిశోధన జరిపి అనేక గ్రంథాలు రచించారు. తెలుగు దేశచరిత్ర మీదే కాదు సంస్కృతీ సాహిత్యాలపై కూడా ఎన్నో గ్రంథాలు, అసంఖ్యాకంగా పరిశోధన వ్యాసాలు రచించారు. ఇంగ్లీషులోను, తెలుగులోనూ, సరళ సుందరమైన, ప్రామాణిక శైలి వెంకటరమణయ్య గారిది. చరిత్ర పరిశోధకులూ, చరిత్రనధ్యయనం చేసే విద్యార్థులతోపాటు తెలుగు పాఠకలోకం ఆసక్తిగా పఠించే రచనలు వారివి.
'విజయనగర చరిత్ర - మరిన్ని ఆధారాలు' విజయనగర చరిత్ర నిర్మాణంలో అసామనమైన ఆధార గ్రంథం. దాదాపు 300 మౌలిక ఆధారాల సేకరణ ఇది. సంస్కృతం, పర్షియన్, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో లభించే ఆధారాలను అనువదించి చరిత్ర విద్యార్థులకు మహోపకారం చేసిన గ్రంథం.
కె ఎ నీలకంఠ శాస్త్రి ప్రసిద్ధ భారతీయ చరిత్రకారుడు. దక్షిణ భారత చరిత్రపై ప్రామాణిక గ్రంథాలు రచించారు. దక్షిణ భారతదేశ చరిత్ర ఆధారాలపై ఆయనకు అపారమైన అధికారం ఉంది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత. డా నేలటూరి వెంకటరమణయ్య తెలుగు జాతి గర్వించదగ్గ చరిత్రకారుల్లో ఒకరు. విజయనగర చరిత్రమీద ఐదు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా పరిశోధన జరిపి అనేక గ్రంథాలు రచించారు. తెలుగు దేశచరిత్ర మీదే కాదు సంస్కృతీ సాహిత్యాలపై కూడా ఎన్నో గ్రంథాలు, అసంఖ్యాకంగా పరిశోధన వ్యాసాలు రచించారు. ఇంగ్లీషులోను, తెలుగులోనూ, సరళ సుందరమైన, ప్రామాణిక శైలి వెంకటరమణయ్య గారిది. చరిత్ర పరిశోధకులూ, చరిత్రనధ్యయనం చేసే విద్యార్థులతోపాటు తెలుగు పాఠకలోకం ఆసక్తిగా పఠించే రచనలు వారివి. 'విజయనగర చరిత్ర - మరిన్ని ఆధారాలు' విజయనగర చరిత్ర నిర్మాణంలో అసామనమైన ఆధార గ్రంథం. దాదాపు 300 మౌలిక ఆధారాల సేకరణ ఇది. సంస్కృతం, పర్షియన్, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో లభించే ఆధారాలను అనువదించి చరిత్ర విద్యార్థులకు మహోపకారం చేసిన గ్రంథం.© 2017,www.logili.com All Rights Reserved.