కెన్యాలోని కియాంబు జిల్లాలో కామిరితు అనే పల్లెటూళ్ళో ఒక రైతు కుటుంబంలో 1938 లో పుట్టిన గూగి వా తియాంగో కెన్యా, ఉగాండా, బ్రిటన్ లో చదువుకున్నారు. నవలారచయితగా, వ్యాసకర్తగా, నాటకరచయితగా, పత్రికా రచయితగా, సంపాదకుడిగా, విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా సుప్రసిద్ధుడైన గూగీ ఇంగ్లీష్ సాహిత్యంలో అధ్యాపకుడిగా నైరోబి విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ, గ్రామీణ ప్రజా నాటకరంగాన్ని అభివృద్ధి చేసినందుకు ప్రభుత్వ ఆగ్రహానికి గురై రెండు సంవత్సరాలకు పైగా జైలులో గడిపారు. విడుదలయ్యాక స్వదేశంలో జీవించలేని పరిస్థితుల్లో అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతూ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, అర్వైన్ లో ఇంగ్లీష్, తులనాత్మక సాహిత్యాల శాఖలో డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ గా ఉన్నారు.
ఇంగ్లీష్ సాహిత్యంలో సొంతంగా సాధించిన పి ఎచ్ డి తో పాటు డెన్మార్క్, జర్మనీ, బ్రిటన్, న్యూజీలాండ్, అమెరికా, ఆఫ్రికాలలోని పది విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. ఏడు నవలలు, ఐదు నాటక సంపుటాలు, ఒక కథా సంపుటం, ఎనిమిది వ్యాస సంపుటాలు, జైలు జ్ఞాపకాలు, రెండు బాల సాహిత్య పుస్తకాలు వంటి అనేక రచనలు చేశారు. 2010 లో ప్రారంభించి ఇప్పటికి ప్రచురించిన మూడు భాగాల ఆత్మకథలో ఇది మొదటి భాగం.
కెన్యాలోని కియాంబు జిల్లాలో కామిరితు అనే పల్లెటూళ్ళో ఒక రైతు కుటుంబంలో 1938 లో పుట్టిన గూగి వా తియాంగో కెన్యా, ఉగాండా, బ్రిటన్ లో చదువుకున్నారు. నవలారచయితగా, వ్యాసకర్తగా, నాటకరచయితగా, పత్రికా రచయితగా, సంపాదకుడిగా, విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా సుప్రసిద్ధుడైన గూగీ ఇంగ్లీష్ సాహిత్యంలో అధ్యాపకుడిగా నైరోబి విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ, గ్రామీణ ప్రజా నాటకరంగాన్ని అభివృద్ధి చేసినందుకు ప్రభుత్వ ఆగ్రహానికి గురై రెండు సంవత్సరాలకు పైగా జైలులో గడిపారు. విడుదలయ్యాక స్వదేశంలో జీవించలేని పరిస్థితుల్లో అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతూ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, అర్వైన్ లో ఇంగ్లీష్, తులనాత్మక సాహిత్యాల శాఖలో డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఇంగ్లీష్ సాహిత్యంలో సొంతంగా సాధించిన పి ఎచ్ డి తో పాటు డెన్మార్క్, జర్మనీ, బ్రిటన్, న్యూజీలాండ్, అమెరికా, ఆఫ్రికాలలోని పది విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. ఏడు నవలలు, ఐదు నాటక సంపుటాలు, ఒక కథా సంపుటం, ఎనిమిది వ్యాస సంపుటాలు, జైలు జ్ఞాపకాలు, రెండు బాల సాహిత్య పుస్తకాలు వంటి అనేక రచనలు చేశారు. 2010 లో ప్రారంభించి ఇప్పటికి ప్రచురించిన మూడు భాగాల ఆత్మకథలో ఇది మొదటి భాగం.© 2017,www.logili.com All Rights Reserved.