ఇది కన్నీటి కథ. కత్తుల కథ. వలసపాలనలో దుర్భరమైన దోపిడీ పీడనలు అనుభవించిన తూర్పు ఆఫ్రికాలో కేన్వాలోని గీకుయు జాతి కార్చిన కన్నీటి ప్రవాహాల కథ. వలస పాలనలో మగ్గుతున్న ఒక వెనుకబడిన సమాజంలో చదువే ఒక విముక్తి మార్గమని నమ్మిన తల్లి కొడుకుల కథ. చదువు కాక ఇతర విముక్తి మార్గాలు కూడ ఉన్నాయని అన్వేషించిన కుటుంబ సభ్యుల కథ. దుర్మార్గమైన ఆ వలస పాలనను కూలదోయడానికి స్వయంపాలన సాదించటానికి ప్రయత్నించిన గీకుయు వీరయోదుల మౌమౌ సాయుధ తిరుగుబాటు కథ. భిన్న ద్రువలలో జీవిస్తున్న యువతియువకులు అనురాగపు కథ. ఎన్నో విషాదాల కథ. మరెన్నో విజయాల కథ. అద్భుతమైన అనస్యసాధనమైన జీవన చిత్రణ కథ. ఒక నవలగా దానికదిగానే ఆకట్టుకునే పుస్తకం కావడం మాత్రమే దీని ఘనత కాదు. ఇది ఒక సంక్లిష్ట సామజిక చరిత్రకు దర్పణం. ఇది రచయిత ఆత్మకధాత్మక నవల. ఇది రచయిత రాజకీయ మేధో పరిణామాన్ని సూచించే కళాత్మక దస్తావేజు.
- ఎన్ వేణుగోపాల్