ఇప్పుడు - అక్టోబర్ విప్లవం జరిగి వంద సంవత్సరాలయిన సందర్భంగా మలుపు ప్రచురణలు ఈ పుస్తకాన్ని పునర్ముద్రిస్తోంది. దానికి పరిచయ వాక్యాలు రాయటానికని ఇప్పటికి దీన్ని చదివాను. రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేసిన కొందరు సోవియెట్ మహిళలు, బిలో రష్యాకు చెందిన అలెక్సీయెవిచ్ స్వెత్లానా అనే రచయిత్రికి స్వయంగా వినిపించిన తమ అనుభవాల గాథలివి. ఆ స్త్రీల మాటల్ని చదివాక కూడా జెండర్ అవగాహనకు సంబంధించిన విషయాల్లో ఈ పుస్తకం పై నాకు కొన్ని అభ్యంతరాలు మిగిలే ఉన్నాయి. కానీ ఈ పుస్తకానికి దానివే అయిన కొన్ని ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా ఒక యుద్ధ చరిత్రను రికార్డు చెయ్యటంలో ఈ రచయిత్రి అనుసరించిన పద్ధతీ, ఈనాటికీ మన చుట్టూ అల్లుకుని ఉన్న కొన్ని భ్రమల తాలూకు భావనలను ఈ స్త్రీలు ఎంతో విభిన్నంగా, స్పష్టంగా నిర్వచించిన తీరూ అద్భుతమైనవి. అవి, ఈ పుస్తకానికి సమకాలీన ప్రాధాన్యాన్ని చేకూర్చుతున్నాయి.
ఇప్పుడు - అక్టోబర్ విప్లవం జరిగి వంద సంవత్సరాలయిన సందర్భంగా మలుపు ప్రచురణలు ఈ పుస్తకాన్ని పునర్ముద్రిస్తోంది. దానికి పరిచయ వాక్యాలు రాయటానికని ఇప్పటికి దీన్ని చదివాను. రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేసిన కొందరు సోవియెట్ మహిళలు, బిలో రష్యాకు చెందిన అలెక్సీయెవిచ్ స్వెత్లానా అనే రచయిత్రికి స్వయంగా వినిపించిన తమ అనుభవాల గాథలివి. ఆ స్త్రీల మాటల్ని చదివాక కూడా జెండర్ అవగాహనకు సంబంధించిన విషయాల్లో ఈ పుస్తకం పై నాకు కొన్ని అభ్యంతరాలు మిగిలే ఉన్నాయి. కానీ ఈ పుస్తకానికి దానివే అయిన కొన్ని ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా ఒక యుద్ధ చరిత్రను రికార్డు చెయ్యటంలో ఈ రచయిత్రి అనుసరించిన పద్ధతీ, ఈనాటికీ మన చుట్టూ అల్లుకుని ఉన్న కొన్ని భ్రమల తాలూకు భావనలను ఈ స్త్రీలు ఎంతో విభిన్నంగా, స్పష్టంగా నిర్వచించిన తీరూ అద్భుతమైనవి. అవి, ఈ పుస్తకానికి సమకాలీన ప్రాధాన్యాన్ని చేకూర్చుతున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.