భారతదేశంలో విదేశీయులైన ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీషువారు ఆధిపత్యం సాధించి అఖండ భారతావనిలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న రోజులు. దేశమంతటా వివిధ రాజ్యాలుగా విడిపోయివున్న భూభాగాలను స్వంతం చేసుకోవడానికి విదేశీయులు కుట్రలు పన్నుతున్న సమయం!
సువిశాల భారతదేశంలో ఎన్నోరాజ్యాలు... వాటి క్రింద మరెన్నో సామంతదేశాలు... సంస్థానాలు... అలా శాఖోపశాఖలుగా ఉన్న వారి మధ్య వైరుధ్యాలు... ఒకరినొకరు అణిచివేయాలన్న దుశ్చింత... ఒకరి భూభాగాన్ని ఒకరు ఆక్రమించుకోవాలనే దురాశ.
సామ్రాజ్య విస్తరణ ఒక ఆకాంక్ష అయితే, ప్రక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవాలన్నది దురాశ. రాజైన వాడికి సామ్రాజ్య విస్తరణాకాంక్ష లేకుంటే ఆ ప్రభువుకి చరిత్ర వుండదు. ప్రజల సంక్షేమం ఎంత ముఖ్యమో, రాజ్య విస్తరణాకాంక్ష కూడా అంతే అభిలషణీందం! అలాంటి వారే సమర్ధులయిన ప్రభువులుగా కొనియాడబడతారు. -
భారతదేశంలో విదేశీయులైన ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీషువారు ఆధిపత్యం సాధించి అఖండ భారతావనిలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న రోజులు. దేశమంతటా వివిధ రాజ్యాలుగా విడిపోయివున్న భూభాగాలను స్వంతం చేసుకోవడానికి విదేశీయులు కుట్రలు పన్నుతున్న సమయం! సువిశాల భారతదేశంలో ఎన్నోరాజ్యాలు... వాటి క్రింద మరెన్నో సామంతదేశాలు... సంస్థానాలు... అలా శాఖోపశాఖలుగా ఉన్న వారి మధ్య వైరుధ్యాలు... ఒకరినొకరు అణిచివేయాలన్న దుశ్చింత... ఒకరి భూభాగాన్ని ఒకరు ఆక్రమించుకోవాలనే దురాశ. సామ్రాజ్య విస్తరణ ఒక ఆకాంక్ష అయితే, ప్రక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవాలన్నది దురాశ. రాజైన వాడికి సామ్రాజ్య విస్తరణాకాంక్ష లేకుంటే ఆ ప్రభువుకి చరిత్ర వుండదు. ప్రజల సంక్షేమం ఎంత ముఖ్యమో, రాజ్య విస్తరణాకాంక్ష కూడా అంతే అభిలషణీందం! అలాంటి వారే సమర్ధులయిన ప్రభువులుగా కొనియాడబడతారు. -© 2017,www.logili.com All Rights Reserved.