నౌకాగమనము
తన దినమునకు తానే ఉదయమైన ఆలుష్టఫా! నిర్ణయింపబడిన ప్రేమపాత్రుడు! అర్పలీజ్ పట్టణమున పుష్కరవర్షములు (12 సం||) తనను తాను పుట్టిన దీవికి చేర్చు తిరిగి వచ్చెడు నౌకనై కాచుకొని వుండెను.
పండ్రెండవ సంవత్సరమున, కోతలు కోయు లియోల్ మాసపు ఏడో దినమున, పట్టణ ప్రహారీ గోడలేని పర్వతము నధిరోహించి సముద్రపు దిశగా తన చూపును మలిపెను. మంచులో వచ్చుచున్న నౌక అతనిచే చూడబడెను.
అంత ఆతని హృదయతల ద్వారము విసురుగా తెరువబడెను. సంతోషము పైకెగెరి సముద్రముపై సుదూరమున కెగసెను. అంత ఆతను (నిమీలినేత్రుడై మూసుకొని ఆత్మాంతరాళ నిశ్శబ్దములో ప్రార్థించెను.
కాని కొండ దిగుచుండగా వొక విచారవీచిక యాతనిపై కావహించెను. అతడు హృదయములోన ఇట్లు తలపోసెను.
ఎలా శాంతితో విచారము లేకుండా నేను పోగలను! లేదు, అంతర్గత గాయం లేకుండా ఈ నగరాన్ని వదిలిపోగలను.
ఈ గోడల మధ్య సుదీర్ఘ దినములను వ్యధతో గడిపాను, సుదీర్ఘ ఏకాంత రాత్రులు బాధలేకుండా ఎవరు తమ వ్యధ నుంచి, ఏకాంతంనుంచి వ్యాకులపాటు లేక (చింతలేక) విడిపోగలరు?
ఈ వీధులలో ఎన్నెన్నో చాలా చాలా) నా మానసిక తునకలను వెదజల్లాను, నేను చాలా (కోరుకునే) కావాలనుకునే పిల్లలెందరో దిగంబరులై ఈ కొండలలో చెరిస్తున్నారు, వారినుంచి బరువు బాధ లేకుండానే నేనెట్లా వుపసంహరించుకోగలను?
ఈరోజు నేనొక వస్త్రాలంకారాన్ని కాదు వొదిలేది, నా చర్మాన్ని నా చేతులతోనే చించిపారేస్తున్నాను.
నా స్మృతిని కాదు నా వెనుక వదిలేది క్షుత్పిపాసలతో మధురముగా.....................
నౌకాగమనము తన దినమునకు తానే ఉదయమైన ఆలుష్టఫా! నిర్ణయింపబడిన ప్రేమపాత్రుడు! అర్పలీజ్ పట్టణమున పుష్కరవర్షములు (12 సం||) తనను తాను పుట్టిన దీవికి చేర్చు తిరిగి వచ్చెడు నౌకనై కాచుకొని వుండెను. పండ్రెండవ సంవత్సరమున, కోతలు కోయు లియోల్ మాసపు ఏడో దినమున, పట్టణ ప్రహారీ గోడలేని పర్వతము నధిరోహించి సముద్రపు దిశగా తన చూపును మలిపెను. మంచులో వచ్చుచున్న నౌక అతనిచే చూడబడెను. అంత ఆతని హృదయతల ద్వారము విసురుగా తెరువబడెను. సంతోషము పైకెగెరి సముద్రముపై సుదూరమున కెగసెను. అంత ఆతను (నిమీలినేత్రుడై మూసుకొని ఆత్మాంతరాళ నిశ్శబ్దములో ప్రార్థించెను. కాని కొండ దిగుచుండగా వొక విచారవీచిక యాతనిపై కావహించెను. అతడు హృదయములోన ఇట్లు తలపోసెను. ఎలా శాంతితో విచారము లేకుండా నేను పోగలను! లేదు, అంతర్గత గాయం లేకుండా ఈ నగరాన్ని వదిలిపోగలను. ఈ గోడల మధ్య సుదీర్ఘ దినములను వ్యధతో గడిపాను, సుదీర్ఘ ఏకాంత రాత్రులు బాధలేకుండా ఎవరు తమ వ్యధ నుంచి, ఏకాంతంనుంచి వ్యాకులపాటు లేక (చింతలేక) విడిపోగలరు? ఈ వీధులలో ఎన్నెన్నో చాలా చాలా) నా మానసిక తునకలను వెదజల్లాను, నేను చాలా (కోరుకునే) కావాలనుకునే పిల్లలెందరో దిగంబరులై ఈ కొండలలో చెరిస్తున్నారు, వారినుంచి బరువు బాధ లేకుండానే నేనెట్లా వుపసంహరించుకోగలను? ఈరోజు నేనొక వస్త్రాలంకారాన్ని కాదు వొదిలేది, నా చర్మాన్ని నా చేతులతోనే చించిపారేస్తున్నాను. నా స్మృతిని కాదు నా వెనుక వదిలేది క్షుత్పిపాసలతో మధురముగా.....................© 2017,www.logili.com All Rights Reserved.