'ద ప్రొఫెట్' కి తెలుగు అనువాదమే ఈ ప్రవక్త. 'ద ప్రొఫెట్' తో పాటు జిబ్రాన్ మరికొంత కవిత్వం కూడా రాసినప్పటికీ, ఆ రచనలేవీ ప్రొఫెట్ స్థాయిలో జనాదరణ పొందలేదు. ఇందుకు కారణమేమిటని ఆలోచిస్తే చాలా అంశాలే స్పురిస్తాయి. కాని, ప్రధానంగా మూడు అంశాల్ని మనవి చేస్తాను.
మొదటిది, ప్రవక్త లో దర్శనం మాత్రమే కాదు, దార్శనిక స్పష్టత కూడా ఉంది. ఆద్యంతాలు రెండు అధ్యాయాలు కాక, 26 అధ్యాయాలుగా నిర్మించిన ఈ కావ్యం కేవలం కవిత్వం మాత్రమే కాదు. సూటిగా, స్పష్టంగా మాట్లాడే ప్రవచనం కూడా. కొత్త నిబంధనలోని నాలుగు సువార్తల్లోనూ, కొరాన్ లోని కొన్ని అధ్యాయాల్లోనూ కనవచ్చే కారుణ్యంతోనూ, దమ్మపదం, గీత, తిరుక్కురళ్ వంటి పారాయణ గ్రంథాల్లోని వివేకంతోనూ, కన్ ఫ్యూషియస్ సుభాషితాలూ, లావో సేతావో తే చింగ్ లలో కనవచ్చే జీవనవైరుధ్యాల సమన్వయంతోనూ ఈ పుస్తకంలోని సంభాషణల్ని మనం పోల్చవచ్చు.
రెండవది, ఈ కావ్యాన్ని నిర్మించిన తీరు. దీన్ని ఆయన ప్లేటో సంభాషణల్లాగా, ఉపనిషత్తుల్లాగా సంభాషణాత్మక శైలిలో నిర్మించాడు. ఈ చిన్న కావ్యంలో మానవప్రపంచానికీ, రాగద్వేష భరితమైన జీవితానికీ సంబంధించిన ప్రతి ఒక్క పార్శ్వాన్నీ ఆయన స్పృశించాడు. పైపైన తడిమి చూడటం కాదు, లోతుల్లోకీ దూకి ముత్యాల్లాంటి మాటలు పట్టుకొచ్చాడు.
ఇక మూడవది, చాలా ముఖ్యమైన కారణం, ప్రవక్త దర్శనానికి సంబంధించిన అంశం. తన ప్రసంగం పూర్తయిన తర్వాత ప్రవక్త వాళ్ళనుంచి సెలవు తీసుకుంటూ ఇంతసేపూ "మాట్లాడింది నేనేనా నేను కూడా శ్రోతను కానా' అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నలో ఎంతో అంతరార్థముంది. ఒక శ్రోతనో, లేదా శ్రోత సమూహాన్నో ఉద్దేశించి మాట్లేడేవాడు వక్త మటుకే అవుతాడు. వక్త దృష్టి ఎంతసేపూ ఇతరుల్ని మెప్పించడం మీద, వారిని ప్రభావితం చెయ్యడం మీద మటుకే ఉంటుంది. కాని, ఎదుటివాళ్ళకి బోధించడం మీద కన్నా మాట్లాడటం ద్వారా తనను తాను తేటపరుచుకునేవాడే ప్రవక్త. ప్రవక్త కావ్యంలో మనకి కనిపించే గొప్ప విశేషం, ఆల్ ముస్తఫా, ఆర్ఫలీజ్ పౌరులతో మాట్లాడుతున్నట్టు పైకి కనిపించినా, నిజానికి జీవితం గురించీ, ప్రపంచం గురించీ, మృత్యువు గురించీ అతడు తనకి తాను స్పష్టం చేసుకుంటూ ఉన్నాడు.
'ద ప్రొఫెట్' కి తెలుగు అనువాదమే ఈ ప్రవక్త. 'ద ప్రొఫెట్' తో పాటు జిబ్రాన్ మరికొంత కవిత్వం కూడా రాసినప్పటికీ, ఆ రచనలేవీ ప్రొఫెట్ స్థాయిలో జనాదరణ పొందలేదు. ఇందుకు కారణమేమిటని ఆలోచిస్తే చాలా అంశాలే స్పురిస్తాయి. కాని, ప్రధానంగా మూడు అంశాల్ని మనవి చేస్తాను. మొదటిది, ప్రవక్త లో దర్శనం మాత్రమే కాదు, దార్శనిక స్పష్టత కూడా ఉంది. ఆద్యంతాలు రెండు అధ్యాయాలు కాక, 26 అధ్యాయాలుగా నిర్మించిన ఈ కావ్యం కేవలం కవిత్వం మాత్రమే కాదు. సూటిగా, స్పష్టంగా మాట్లాడే ప్రవచనం కూడా. కొత్త నిబంధనలోని నాలుగు సువార్తల్లోనూ, కొరాన్ లోని కొన్ని అధ్యాయాల్లోనూ కనవచ్చే కారుణ్యంతోనూ, దమ్మపదం, గీత, తిరుక్కురళ్ వంటి పారాయణ గ్రంథాల్లోని వివేకంతోనూ, కన్ ఫ్యూషియస్ సుభాషితాలూ, లావో సేతావో తే చింగ్ లలో కనవచ్చే జీవనవైరుధ్యాల సమన్వయంతోనూ ఈ పుస్తకంలోని సంభాషణల్ని మనం పోల్చవచ్చు. రెండవది, ఈ కావ్యాన్ని నిర్మించిన తీరు. దీన్ని ఆయన ప్లేటో సంభాషణల్లాగా, ఉపనిషత్తుల్లాగా సంభాషణాత్మక శైలిలో నిర్మించాడు. ఈ చిన్న కావ్యంలో మానవప్రపంచానికీ, రాగద్వేష భరితమైన జీవితానికీ సంబంధించిన ప్రతి ఒక్క పార్శ్వాన్నీ ఆయన స్పృశించాడు. పైపైన తడిమి చూడటం కాదు, లోతుల్లోకీ దూకి ముత్యాల్లాంటి మాటలు పట్టుకొచ్చాడు. ఇక మూడవది, చాలా ముఖ్యమైన కారణం, ప్రవక్త దర్శనానికి సంబంధించిన అంశం. తన ప్రసంగం పూర్తయిన తర్వాత ప్రవక్త వాళ్ళనుంచి సెలవు తీసుకుంటూ ఇంతసేపూ "మాట్లాడింది నేనేనా నేను కూడా శ్రోతను కానా' అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నలో ఎంతో అంతరార్థముంది. ఒక శ్రోతనో, లేదా శ్రోత సమూహాన్నో ఉద్దేశించి మాట్లేడేవాడు వక్త మటుకే అవుతాడు. వక్త దృష్టి ఎంతసేపూ ఇతరుల్ని మెప్పించడం మీద, వారిని ప్రభావితం చెయ్యడం మీద మటుకే ఉంటుంది. కాని, ఎదుటివాళ్ళకి బోధించడం మీద కన్నా మాట్లాడటం ద్వారా తనను తాను తేటపరుచుకునేవాడే ప్రవక్త. ప్రవక్త కావ్యంలో మనకి కనిపించే గొప్ప విశేషం, ఆల్ ముస్తఫా, ఆర్ఫలీజ్ పౌరులతో మాట్లాడుతున్నట్టు పైకి కనిపించినా, నిజానికి జీవితం గురించీ, ప్రపంచం గురించీ, మృత్యువు గురించీ అతడు తనకి తాను స్పష్టం చేసుకుంటూ ఉన్నాడు.© 2017,www.logili.com All Rights Reserved.