అమరేశ్వర వికాసం
అమరేశ్వర' ఆలయ ప్రాంగణాన్ని, పరిసరాలను “అమరీశ్వరం”అని “అమరేశ్వరం” అని కొన్ని శాసనాలు పేర్కొన్నాయి. అమరేశ్వర దేవస్థానం ఆన్న సమాసం కన్నా ఈ మాట స్వతంత్రంగ, సుందరంగ ఉంది. అందుకని ఆ పేరే వాడుతున్నాను.
“అమరేశ్వరం” - ప్రారంభవికాసాలను దశల వారీగా నిర్ధారణ చేయటానికి ఖచ్చితమైన ఆధారాలు తక్కువ. ఉన్నంతలోనే సమంజసమయిన విభజన చేయాలి.
చరిత్రకు పూర్వ చరిత్ర :
వివిధ జాతులు ఏదో విధంగా వైరుధ్యాలు మరచి సమన్వయం అవుతున్న కాలంలో, తారకుడు అనే ఒక రాక్షసుడు (తిరుగుబాటు నాయకుడు) అందుకు అంగీకరించక భీషణంగా ఎదురుతిరిగాడు. యుద్ధానికి దిగాడు. శివుని గౌరవించే జాతులన్నిటిని ఏకం చేసి నిలవాలనుకున్నాడు. మెడలో శివుణ్ణి ప్రాణలింగంగా ధరించాడు. శివుడు అనాదిగా ఆదిమజాతులకు ఆరాధ్యుడు. ఆర్యద్రావిడ (ఉ త్తర, దక్షిణ) సంస్కృతీ సమ్మేళనాన్ని ఇతడు ఇష్టపడలేదు. సమ్మేళనం అంగీకరించే వారందరు కలసి వేరొక ద్రావిడ నాయకుణ్ణి సహాయం (కుమారస్వామిని) కోరారు. అతడు సహకరించాడు. తారకుడు, కుమారస్వామి ఇద్దరు శివునికి కావలసినవారే. కుమారస్వామి తారకుని శివలింగాన్ని ఛేదించి గెలిచాడు. విశ్వామిత్రుని సంతతిలో భేదాలు వచ్చి చీలిపోయినట్లే శివుని పూజించే వర్గాలలో కలహాలు వచ్చాయి. యుద్ధాలు జరిగాయి. తారకాసుర యుద్ధం బహుశా ఆనాటి జాతుల కలహాన్ని ప్రతిబింబిస్తుంది. చివరకు తారకాసురుని ఆధిపత్యం ఐదు ప్రాంతాలకు పరిమితమయింది. అవ్వే పంచారామాలు.
బహుశా ఈ పోరాటం కృష్ణా తీరమయిన అమరావతి ప్రాంతంలో జరిగిందేమో. మొదటి ఆరామం అమరావతి అయింది....................
అమరేశ్వర వికాసం అమరేశ్వర' ఆలయ ప్రాంగణాన్ని, పరిసరాలను “అమరీశ్వరం”అని “అమరేశ్వరం” అని కొన్ని శాసనాలు పేర్కొన్నాయి. అమరేశ్వర దేవస్థానం ఆన్న సమాసం కన్నా ఈ మాట స్వతంత్రంగ, సుందరంగ ఉంది. అందుకని ఆ పేరే వాడుతున్నాను. “అమరేశ్వరం” - ప్రారంభవికాసాలను దశల వారీగా నిర్ధారణ చేయటానికి ఖచ్చితమైన ఆధారాలు తక్కువ. ఉన్నంతలోనే సమంజసమయిన విభజన చేయాలి. చరిత్రకు పూర్వ చరిత్ర : వివిధ జాతులు ఏదో విధంగా వైరుధ్యాలు మరచి సమన్వయం అవుతున్న కాలంలో, తారకుడు అనే ఒక రాక్షసుడు (తిరుగుబాటు నాయకుడు) అందుకు అంగీకరించక భీషణంగా ఎదురుతిరిగాడు. యుద్ధానికి దిగాడు. శివుని గౌరవించే జాతులన్నిటిని ఏకం చేసి నిలవాలనుకున్నాడు. మెడలో శివుణ్ణి ప్రాణలింగంగా ధరించాడు. శివుడు అనాదిగా ఆదిమజాతులకు ఆరాధ్యుడు. ఆర్యద్రావిడ (ఉ త్తర, దక్షిణ) సంస్కృతీ సమ్మేళనాన్ని ఇతడు ఇష్టపడలేదు. సమ్మేళనం అంగీకరించే వారందరు కలసి వేరొక ద్రావిడ నాయకుణ్ణి సహాయం (కుమారస్వామిని) కోరారు. అతడు సహకరించాడు. తారకుడు, కుమారస్వామి ఇద్దరు శివునికి కావలసినవారే. కుమారస్వామి తారకుని శివలింగాన్ని ఛేదించి గెలిచాడు. విశ్వామిత్రుని సంతతిలో భేదాలు వచ్చి చీలిపోయినట్లే శివుని పూజించే వర్గాలలో కలహాలు వచ్చాయి. యుద్ధాలు జరిగాయి. తారకాసుర యుద్ధం బహుశా ఆనాటి జాతుల కలహాన్ని ప్రతిబింబిస్తుంది. చివరకు తారకాసురుని ఆధిపత్యం ఐదు ప్రాంతాలకు పరిమితమయింది. అవ్వే పంచారామాలు. బహుశా ఈ పోరాటం కృష్ణా తీరమయిన అమరావతి ప్రాంతంలో జరిగిందేమో. మొదటి ఆరామం అమరావతి అయింది....................© 2017,www.logili.com All Rights Reserved.