దాదాపు నాలుగు సంవత్సరములు క్రిందట మిత్రులందరము ఒకచోట కలసినాడు ఆచార్య నాగార్జునుని సుహృల్లేఖను గురించిన ప్రస్తావన వచ్చింది. అది నేడు అలభ్యము, టెబెటన్ భాషలో నుండి తెచ్చిన ఆంగ్లానువాదమే ఉన్నదిగాని సంస్కృత మూలము లేదనుకొనుచుంటిమి. ఆంగ్లానువాదమును చూచిన డా. వాలిలాల సుబ్బారావు గారు దీనిని తెలుగులోనికి అనువదించిన బాగా వుంటుందన్నారు. ఆనాడే ఆలోచన బీజప్రాయమై తరువాత కార్యరూపము దాల్చి నేడు ఫలించింది.
ఆచార్య నాగార్జునుడు ప్రాచీన భారతీయ దార్శనికులలో గణింపదగిన తత్త్వవేత్త. వేదవేదాంగ పారంగతుడు. సంస్కృతమును గొప్ప పండితుడును అయిన బౌద్దాచార్యుడు. బహు గ్రంథకర్త. ఇరువదికి పైగా తత్త్వ గ్రంథములు, వివరణములు, వ్యాఖ్యానములు, భక్తిస్తోత్రములు, యితర గ్రంథములు సంస్కృతమున వెలయించి, బౌద్ధ లోకమును ప్రకాశింపజేసిన భానుచతుష్టయములో ద్వితీయుడుగా అశ్వఘోషుని తర్వాత పరిగణింపబడినవాడు.
- వావిలాల సుబ్బారావు