ఐదు దశాబ్దాలకు పైబడిన సాహిత్య జీవితంలో సోమయాజులు గారు చేసిన అసంఖ్యాక రచనల్లో ఎన్నో అలభ్యంగా ఉండిపోయాయి. కొన్ని అముద్రితాలుగా ఉండిపోయాయి. లభించిన రచనల్లో ముద్రితా ముద్రితాలన్నింటిని కలిపి ఇప్పుడు ఆయన లభ్యరచనల సమగ్ర సంపుటాలను ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాం.
ఈ సంపుటులలో కవిత్వం మొదటిది.
ఈ సంపుటంలో ‘శివాలోకనము’ 1990 లో పింగళి కాటూరి సాహిత్య పీఠం వారి ప్రచురణ. ఇందులో 9 కవితా ఖండికలున్నాయి. ఖండకావ్యాలు కొన్ని వివిధ పత్రికల్లో ప్రచురితాలు, మరికొన్ని ఆకాశవాణి కేంద్రాల నుండి ప్రసారితాలు. కొన్ని ఆముద్రితాలు. ‘భరతరస ప్రకరణం’ శ్రీమాన్ నీడామంగలం తిరువెంకటాచార్యుల వారి రచనకు గేయానువాదం. ‘ఉపాయనలు’ హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు గారి ప్రశస్తిని కీర్తించే గేయరచన.
నాటకాలు రెండవది.
నాటకం సమాహారకళ. సాహిత్యం, సంగీతం, నృత్యం ఈ మూడింటి సమ్మేళనమిది. వాస్తవానికి ఈ దృశ్యకావ్య ప్రక్రియకు శిల్ప చిత్రకళలతోనూ సంబంధం ఉంది. ఆ విధంగా లలితకళా సమాహారం అది. అందువల్లే ‘కావ్యషు నాటకం రమ్యం’ అనే సూక్తి ఏర్పడింది. శ్రవ్యకావ్యరచన కంటే దృశ్యకావ్య రచనకు కావలసిన సామర్థ్యాలెక్కువ. సోమయాజులు గారు చేయి తిరిగిన నాటక కర్త. విశ్వవిఖ్యాత నాటక కర్త షేక్స్పియర్ నాటకాలను అనువదించడమేకాక స్వయంగా అనేక నాటక రచనలు చేశారు.
అనువాదాలు, బాలసాహిత్యం మూడవది.
19వ శతాబ్దం ద్వితీయార్ధంలోనే తెలుగులో నాటకరచన ప్రారంభమైనది. స్వతంత్ర నాటకాలు తక్కువగానూ, అనువాద నాటకాలు ఎక్కవగానూ మొదట్లో వచ్చేవి. అనువాదాల్లో ఎక్కువ భాగం సంస్కృత నాటకాలకు అనువాదాలు. తెలుగువారి ఆంగ్ల సాహిత్యంతో పరిచయం ఏర్పడడంతో షేక్స్పియర్ వంటి నాటకకర్తల నాటకాలను తెలుగులోకి తేవాలన్న కాంక్ష ఏర్పడింది.
వ్యాసాలు నాల్గవది.
© 2017,www.logili.com All Rights Reserved.