కదలనని మొరాయిస్తున్న శరీరాన్ని మెల్లగా ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు. శీను. నల్లగా, ఎత్తుగా ఉన్నాడు. జుట్టు వెనక్కి దువ్వి, ఎడంపక్కన కొప్పులా ముడివేసి ఉంది. మెడలో రంగురంగుల పూసల దండలు, రెండు ముంజేతుల మీద పచ్చబొట్లు, వక్షస్థలం అనాచ్చాదితంగా ఉంది. నడుముకి నీరుకాయ పట్టిన ధోతీ గోచీలా బిగించి ఉంది. ఎండ నిప్పుల కుంపటిలా మండుతోంది. కడుపులో ఆకలి ఎర్రగా మండుతోంది. నీరసం... నిస్సత్తువ...
మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ, తనకు ఎదురుపడ్తున్న మనుషుల్ని డేగ కళ్ళతో పరిశీలిస్తూ నడుస్తున్నాడు. అతని చూపు మగవాళ్ళ చొక్కా జేబులు మీద, ప్యాంట్ జేబుల మీదే కేంద్రీకృతమై ఉంది. అతనివి ఎక్సరే కళ్ళు. జేబుల్ని చూస్తే చాలు వాటిలోపల ఏముందో ఇట్టే పసికట్టేయగలడు. రెప్ప మూసి తెరిచే వ్యవధిలో జేబుల్ని లాఘవంగా కత్తిరించడంలో ఎన్నోయేళ్ళ అనుభవముంది. అతని పూర్తి పేరు కర్రెద్దుల శ్రీనివాసులు. తెల్సినవాళ్ళందరూ అతన్ని మట్టగిడిశ శీను అని పిలుస్తారు. దొంగతనం చేశాక ఎవ్వరికీ దొరక్కుండా, చేపలు పట్టేవాళ్ళకు చిక్కకుండా జారిపోయే మట్టగిడిశెలా తప్పించుకోవడంలో నేర్పరి కాబట్టి అతనికా పేరు స్థిరపడిపోయింది.
వయసులో పెద్ద వాళ్ళు లాల్చీలు తొడుక్కుంటే వాటికి పక్కనున్న జేబుల్లో డబ్బులు పెట్టుకుంటారు. అన్నిటికంటే సులభం ఆ జేబుల్ని కత్తిరించడం. శీను................
కదలనని మొరాయిస్తున్న శరీరాన్ని మెల్లగా ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు. శీను. నల్లగా, ఎత్తుగా ఉన్నాడు. జుట్టు వెనక్కి దువ్వి, ఎడంపక్కన కొప్పులా ముడివేసి ఉంది. మెడలో రంగురంగుల పూసల దండలు, రెండు ముంజేతుల మీద పచ్చబొట్లు, వక్షస్థలం అనాచ్చాదితంగా ఉంది. నడుముకి నీరుకాయ పట్టిన ధోతీ గోచీలా బిగించి ఉంది. ఎండ నిప్పుల కుంపటిలా మండుతోంది. కడుపులో ఆకలి ఎర్రగా మండుతోంది. నీరసం... నిస్సత్తువ... మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ, తనకు ఎదురుపడ్తున్న మనుషుల్ని డేగ కళ్ళతో పరిశీలిస్తూ నడుస్తున్నాడు. అతని చూపు మగవాళ్ళ చొక్కా జేబులు మీద, ప్యాంట్ జేబుల మీదే కేంద్రీకృతమై ఉంది. అతనివి ఎక్సరే కళ్ళు. జేబుల్ని చూస్తే చాలు వాటిలోపల ఏముందో ఇట్టే పసికట్టేయగలడు. రెప్ప మూసి తెరిచే వ్యవధిలో జేబుల్ని లాఘవంగా కత్తిరించడంలో ఎన్నోయేళ్ళ అనుభవముంది. అతని పూర్తి పేరు కర్రెద్దుల శ్రీనివాసులు. తెల్సినవాళ్ళందరూ అతన్ని మట్టగిడిశ శీను అని పిలుస్తారు. దొంగతనం చేశాక ఎవ్వరికీ దొరక్కుండా, చేపలు పట్టేవాళ్ళకు చిక్కకుండా జారిపోయే మట్టగిడిశెలా తప్పించుకోవడంలో నేర్పరి కాబట్టి అతనికా పేరు స్థిరపడిపోయింది. వయసులో పెద్ద వాళ్ళు లాల్చీలు తొడుక్కుంటే వాటికి పక్కనున్న జేబుల్లో డబ్బులు పెట్టుకుంటారు. అన్నిటికంటే సులభం ఆ జేబుల్ని కత్తిరించడం. శీను................© 2017,www.logili.com All Rights Reserved.