అతని నెత్తిమీద ఏదో విస్పోటనం జరిగినట్టు పెద్ద శబ్దం విన్పించింది. వేల సంఖ్యలో గబ్బిలాలు ఆహారం కోసం గుహనుంచి బైటికి రావడంతో ఒక్కసారిగా చీకటి కమ్మేసినట్టయింది. అతను అసంకల్పితంగా తలెత్తి పైకి చూశాడు. క్షణకాలమే.. కానీ జరగాల్సిన నష్టమేదో జరిగిపోయింది. గబ్బిలాల విసర్జకం 'గ్వానో' తడితడిగా ముద్దలా అతని కంట్లో పడింది. భయంకరమైన రోగాల్ని కలగచేసే వైరస్లుండే గ్వానోతో అతని కంటి పొరలు సంపర్కంలోకి వచ్చిన క్షణమది. తర్వాత ఏం జరిగింది?
“కరోనా మాకు అంటుకుంటుందో లేదో తెలీదు. ఒకవేళ అంటుకున్నా దానివల్ల మేము చస్తామో లేక బతికి బట్టకడామో తెలీదు. కానీ వెనక్కెళ్తే మాత్రం ఆకలితో తప్పకుండా చచ్చిపోతాం సారూ” అంటూ పోలీసుల్తో మొర పెట్టుకున్న వలస కార్మికుడు రాములు తన కుటుంబంతో సహా కాలి నడకన మూడు వందల కిలోమీటర్లు నడిచి తన వూరు చేరుకోడానికి పడిన కష్టాల పరంపరను అక్షరబద్ధం చేసిన నవల.
ప్రపంచం మొత్తం యుద్ధభూమిలో నిలబడి, కంటికి కన్పించని భయంకరమైన శత్రువుతో చేసిన పోరాటంలో పోయిన ప్రాణాలెన్ని? అవన్నీ కేవలం అంకెలేనా? ఒక్కో పాజిటివ్ కేస్ వెనుక కుటుంబ సభ్యుల ఎన్ని కన్నీటి ప్రవాహాలో.. దేవుడికి ఎన్ని నివేదనలో.. ఎన్ని భయాలో.. ప్రైవేట్ ఆస్పత్రుల ధనదాహానికి ఎన్ని జీవితాలు బలైపోయాయో.. మరణించిన వ్యక్తి కుటుంబాలకు అదో పిడుగుపాటు.. గుండె కోత.. ఎప్పటికీ మానని గాయం .. ఆగని కన్నీటి ధార.. ఎన్నటికీ తీరని వ్యధ..
కరోనా వల్ల భౌతికంగా కన్పిస్తున్న విధ్వంసం గణాంకాల ద్వారా తెలుస్తోంది. కానీ మనిషి లోపల జరిగిన విధ్వంసం మాటేమిటి?
- పబ్లిషర్స్
అతని నెత్తిమీద ఏదో విస్పోటనం జరిగినట్టు పెద్ద శబ్దం విన్పించింది. వేల సంఖ్యలో గబ్బిలాలు ఆహారం కోసం గుహనుంచి బైటికి రావడంతో ఒక్కసారిగా చీకటి కమ్మేసినట్టయింది. అతను అసంకల్పితంగా తలెత్తి పైకి చూశాడు. క్షణకాలమే.. కానీ జరగాల్సిన నష్టమేదో జరిగిపోయింది. గబ్బిలాల విసర్జకం 'గ్వానో' తడితడిగా ముద్దలా అతని కంట్లో పడింది. భయంకరమైన రోగాల్ని కలగచేసే వైరస్లుండే గ్వానోతో అతని కంటి పొరలు సంపర్కంలోకి వచ్చిన క్షణమది. తర్వాత ఏం జరిగింది? “కరోనా మాకు అంటుకుంటుందో లేదో తెలీదు. ఒకవేళ అంటుకున్నా దానివల్ల మేము చస్తామో లేక బతికి బట్టకడామో తెలీదు. కానీ వెనక్కెళ్తే మాత్రం ఆకలితో తప్పకుండా చచ్చిపోతాం సారూ” అంటూ పోలీసుల్తో మొర పెట్టుకున్న వలస కార్మికుడు రాములు తన కుటుంబంతో సహా కాలి నడకన మూడు వందల కిలోమీటర్లు నడిచి తన వూరు చేరుకోడానికి పడిన కష్టాల పరంపరను అక్షరబద్ధం చేసిన నవల. ప్రపంచం మొత్తం యుద్ధభూమిలో నిలబడి, కంటికి కన్పించని భయంకరమైన శత్రువుతో చేసిన పోరాటంలో పోయిన ప్రాణాలెన్ని? అవన్నీ కేవలం అంకెలేనా? ఒక్కో పాజిటివ్ కేస్ వెనుక కుటుంబ సభ్యుల ఎన్ని కన్నీటి ప్రవాహాలో.. దేవుడికి ఎన్ని నివేదనలో.. ఎన్ని భయాలో.. ప్రైవేట్ ఆస్పత్రుల ధనదాహానికి ఎన్ని జీవితాలు బలైపోయాయో.. మరణించిన వ్యక్తి కుటుంబాలకు అదో పిడుగుపాటు.. గుండె కోత.. ఎప్పటికీ మానని గాయం .. ఆగని కన్నీటి ధార.. ఎన్నటికీ తీరని వ్యధ.. కరోనా వల్ల భౌతికంగా కన్పిస్తున్న విధ్వంసం గణాంకాల ద్వారా తెలుస్తోంది. కానీ మనిషి లోపల జరిగిన విధ్వంసం మాటేమిటి? - పబ్లిషర్స్© 2017,www.logili.com All Rights Reserved.