హిందూమతంలో వేళ్లూనుకున్న అంటరానితనాన్ని భరించలేక దళిత కులస్థులు కొంతమంది బాబా ఫక్రుద్దీన్ బోధనలకు ప్రభావితులై ఇస్లాం మతాన్ని స్వీకరించారు. మతం మారినా ఉర్దూ మాట్లాడటం రాదనో, దేవుళ్ల పటాలను పూజిస్తారనో, హిందూ ఆచారాల్ని పాటిస్తారనో కారణాలు చూపి సోదర ముస్లింలు వాళ్ళని లద్ధాప్ లనీ, పింజారీలనీ అవమానిస్తున్నారు. ఆధాముసల్మానులని కించపరుస్తున్నారు. వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకోరు. వాళ్లని తమ ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలకు పిలవరు.
అల్లా దృష్టిలో అందరూ సమానమేనని, ముస్లింలలో కులవ్యవస్థ లేదని ఇస్లాం మౌలిక సూత్రాలు చెప్తున్నా దూదేకుల్ని పరాయివాళ్ళుగా, నిమ్న కులస్థులుగానే చూస్తారు. ఇస్లాం మతం స్వీకరించినా తమది ప్రత్యేక కులమన్న అవగాహనతో ప్రభుత్వంతో పోరాడి రిజర్వేషన్ సౌకర్యాన్ని దూదేకుల సాధించుకున్నారు. తమను దూదేకుల అనకుండా సూర్బాషీయులని గౌరవంగా పిలవాలని తీర్మానించారు.
- సలీం