నా ఆలోచనల ఉషోజ్యంలో ఆజ్యం పోసిన తత్వపు తుఫాను
రామ్ గోపాల్ వర్మ గారి ఆలోచనలకి భావాలకి, అభిప్రాయాలకి, ప్రశ్నలకి, తర్కానికి, తత్వానికి చలించి స్పందించి ఆలోచించి చర్చించి "రాముయిజం” ఐడియాలజీ మీద పుస్తకం రాసేంతలా ప్రభావితమైన నేను ఒకప్పుడు నేను ఆయన్ని అభిమానించే వాడిని కాదు.
అది 2009-2010వ సంవత్సరం నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సాక్షి దిన పత్రికలో ప్రతి సండే వచ్చే 'ఫన్డే'లో ఆర్జీవి గారి ఇంటర్వ్యూ ఉన్న పేజీలను నేను ఏ మాత్రం ఆలోచించకుండా పక్కకు తిప్పేసేవాడిని. కారణం చిన్నప్పుడు ఆయన సినిమాలు నా మనసుకు నచ్చేవి కాదు. నా బుర్రకు ఎక్కేవి కాదు. అందునా ఇప్పటి నా మిత్రుడైన నా చిన్నప్పటి స్కూల్ టీచర్ తో విక్టరీ వెంకటేష్ నటించిన "క్షణక్షణం” మూవీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆర్జీవి అంటే డబ్బు, దెయ్యం, క్రైమ్లను ఇతివృత్తంగా చేసి సినిమాలు తీస్తాడని చర్చించుకోవడం వల్ల ఒక సదభిప్రాయం ఏర్పడలేదు. దెయ్యం, మనీ, రాత్రి, సత్య, అనగనగా ఒక రోజు లాంటి సినిమాలు నన్ను అంతగా ఆకర్షించలేదు. అయితే కాలక్రమంలో 2011వ సంవత్సరంలో ఒకరోజు టీవి 9 ఛానల్లో విజయవాడ నడి రోడ్డు మీద రౌడీలు కత్తులతో పరిగెత్తుతున్నారని వార్త ప్రసారం అయింది. తీరా అది అక్కినేని నాగచైతన్య నటించిన “బెజవాడ రౌడీలు" అనే సినిమా షూటింగులో భాగంగా పబ్లిసిటీ కోసం ఆర్జీవి చేయించాడని ప్రసారమయ్యింది. అదే సమయంలో విజయవాడలో కొంతమంది “బెజవాడ రౌడీలు” అనే టైటిల్పై అభ్యంతరం వెలిబుచ్చుతూ ఆర్జీవి గారితో డిబేట్ నడుస్తుంది. ఆ డిబేట్లో ఫోన్ కాల్ ద్వారా ఓ విజయవాడ ప్రేక్షకుడు ఆర్జీవితో మాట్లాడుతున్న సందర్భంలో - ఆర్జీవి తన లాజికల్ మైండ్ తో “బెజవాడ రౌడీలు” అనే టైటిల్ పెడితే బెజవాడ మొత్తం రౌడీలు ఉన్నారనే అర్థం వస్తుందని వాదిస్తున్నారే, మరి “అసెంబ్లీ రౌడీ” అనే సినిమా తీశారు అంటే అసెంబ్లీ మొత్తం రౌడీలు ఉన్నారని అంటారా? అని ప్రశ్నించాడు. అలా మొదటిసారి ఆర్జీవి తెలివికి, తర్కానికి ముచ్చట వేసింది. భలే లాజికల్గా ప్రశ్నించాడు అనిపించింది. తరువాత మరో సంవత్సరం వరకు ఆయన ఊహగాని, ఊసుగాని లేదు.........................
నా ఆలోచనల ఉషోజ్యంలో ఆజ్యం పోసిన తత్వపు తుఫాను రామ్ గోపాల్ వర్మ గారి ఆలోచనలకి భావాలకి, అభిప్రాయాలకి, ప్రశ్నలకి, తర్కానికి, తత్వానికి చలించి స్పందించి ఆలోచించి చర్చించి "రాముయిజం” ఐడియాలజీ మీద పుస్తకం రాసేంతలా ప్రభావితమైన నేను ఒకప్పుడు నేను ఆయన్ని అభిమానించే వాడిని కాదు. అది 2009-2010వ సంవత్సరం నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సాక్షి దిన పత్రికలో ప్రతి సండే వచ్చే 'ఫన్డే'లో ఆర్జీవి గారి ఇంటర్వ్యూ ఉన్న పేజీలను నేను ఏ మాత్రం ఆలోచించకుండా పక్కకు తిప్పేసేవాడిని. కారణం చిన్నప్పుడు ఆయన సినిమాలు నా మనసుకు నచ్చేవి కాదు. నా బుర్రకు ఎక్కేవి కాదు. అందునా ఇప్పటి నా మిత్రుడైన నా చిన్నప్పటి స్కూల్ టీచర్ తో విక్టరీ వెంకటేష్ నటించిన "క్షణక్షణం” మూవీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆర్జీవి అంటే డబ్బు, దెయ్యం, క్రైమ్లను ఇతివృత్తంగా చేసి సినిమాలు తీస్తాడని చర్చించుకోవడం వల్ల ఒక సదభిప్రాయం ఏర్పడలేదు. దెయ్యం, మనీ, రాత్రి, సత్య, అనగనగా ఒక రోజు లాంటి సినిమాలు నన్ను అంతగా ఆకర్షించలేదు. అయితే కాలక్రమంలో 2011వ సంవత్సరంలో ఒకరోజు టీవి 9 ఛానల్లో విజయవాడ నడి రోడ్డు మీద రౌడీలు కత్తులతో పరిగెత్తుతున్నారని వార్త ప్రసారం అయింది. తీరా అది అక్కినేని నాగచైతన్య నటించిన “బెజవాడ రౌడీలు" అనే సినిమా షూటింగులో భాగంగా పబ్లిసిటీ కోసం ఆర్జీవి చేయించాడని ప్రసారమయ్యింది. అదే సమయంలో విజయవాడలో కొంతమంది “బెజవాడ రౌడీలు” అనే టైటిల్పై అభ్యంతరం వెలిబుచ్చుతూ ఆర్జీవి గారితో డిబేట్ నడుస్తుంది. ఆ డిబేట్లో ఫోన్ కాల్ ద్వారా ఓ విజయవాడ ప్రేక్షకుడు ఆర్జీవితో మాట్లాడుతున్న సందర్భంలో - ఆర్జీవి తన లాజికల్ మైండ్ తో “బెజవాడ రౌడీలు” అనే టైటిల్ పెడితే బెజవాడ మొత్తం రౌడీలు ఉన్నారనే అర్థం వస్తుందని వాదిస్తున్నారే, మరి “అసెంబ్లీ రౌడీ” అనే సినిమా తీశారు అంటే అసెంబ్లీ మొత్తం రౌడీలు ఉన్నారని అంటారా? అని ప్రశ్నించాడు. అలా మొదటిసారి ఆర్జీవి తెలివికి, తర్కానికి ముచ్చట వేసింది. భలే లాజికల్గా ప్రశ్నించాడు అనిపించింది. తరువాత మరో సంవత్సరం వరకు ఆయన ఊహగాని, ఊసుగాని లేదు.........................© 2017,www.logili.com All Rights Reserved.