వి కాలాన్ని రికార్డు చేయాలంటారు. అప్పుడే వర్తమాన పరిస్థితులను భవిష్యత్ తరాలు తెలుసుకోవడానికి ఆధారం ఉంటుంది. సమకాలీన సమాజంలో కాల క్రమంలో జరిగే మార్పులు లేదా పరిణామాలు భవిష్యత్తు తరాలకు అవగతమవుతాయి. చరిత్రలో ముఖ్య సంఘటనలు, విపత్తులు, సామాజిక ఆర్థిక పరిణామాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని ఒక క్రమ పద్ధతిలో తెలుసుకోగలుగుతారు. చరిత్రలో జరిగిన సంఘటనలు అన్నీ ఈనాటి ప్రపంచానికి తెలుస్తున్నాయంటే రచనలే ముఖ్య సాక్ష్యం. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని కోవిడ్ గడగడలాడిస్తోంది. గతంలో విపత్తులు కొన్ని ప్రాంతాలకు, దేశాలకు పరిమితం అయ్యేవి. ఇప్పుడు కరోనా వైరస్ ప్రాంతీయ భేదం,
జాతివివక్ష, ధనిక బీద తారతమ్యం , లింగ వ్యత్యాసాలు చూపకుండా మొత్తం భూగోళాన్ని కమ్మేసింది. కవులు, రచయితలు కోవిడ్ గురించి అనేక రచనలు చేశారు. ప్రముఖ కవి ఎన్.గోపి కోవిడ్ వచ్చిన తొలినాళ్ళలోనే “ప్రపంచీకరోనా” పేరుతో కరోనాపై కవితా సంపుటి వెలువరించారు. అది కరోనపై తొలి కవితా సంపుటి. ఇప్పుడు చలపాక ప్రకాష్ “కరోనా నానీలు” పేరుతో నానీల ప్రక్రియలో కోవిడ్ విపత్తు గురించి పాఠకుల ముందుంచారు. ఇంతకుముందే వంగల హర్షవర్ధన్ “కోవిడ్ నానీలు” రాశారు.