నా పేరు డయానా. వయసు 32 సంవత్సరాలు. ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. నాకంటూ ఓ పేరు సంపాదించుకోవాలి. అదే నా ఆశ, ఆశయం. అందుకే ప్రేమా, పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోలేదు.
నా కథను మీతో పంచుకుంటాను.
అది 1980వ సంవత్సరం.
ఇంకొన్ని రోజుల్లో చలి మొదలవుతుంది.
లండన్లో, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రాంగణాలకు సరిగ్గా మధ్యలో ఉంటుంది నేనుంటున్న ప్రాంతం. దాని పేరు మిల్టన్. ప్రస్తుతం నా ఇంటి దగ్గరలో ఉన్న ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. పిల్లలతో ఆటలాడుతూ, పాటలు పాడుతూ, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూంటే అసలు సమయమే తెలియదు నాకు. నేనూ వాళ్ళల్లో ఒక దాని లాగా, చిన్న పిల్లనై పోతాను. అలాగని టీచరుగా నా బాధ్యతను ఎప్పుడూ మర్చిపోను.
నా చిన్నప్పుడే అమ్మ దూరమైంది. తను ఎలా ఉంటుందో కూడా నాకు గుర్తు లేదు. ఊహ తెలిసే సమయానికి నాన్న కూడా పోయారు. ఆయమ్మ మేరీ సంరక్షణలో పెరిగాను.
వీధుల్లో చిన్నగా మంచు కురుస్తోంది. అలాగని గడ్డ కట్టుకు పోయేంత చలేం లేదు...................
CHAPTER 1 నా పయనం - డయానా నా పేరు డయానా. వయసు 32 సంవత్సరాలు. ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. నాకంటూ ఓ పేరు సంపాదించుకోవాలి. అదే నా ఆశ, ఆశయం. అందుకే ప్రేమా, పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోలేదు. నా కథను మీతో పంచుకుంటాను. అది 1980వ సంవత్సరం. ఇంకొన్ని రోజుల్లో చలి మొదలవుతుంది. లండన్లో, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రాంగణాలకు సరిగ్గా మధ్యలో ఉంటుంది నేనుంటున్న ప్రాంతం. దాని పేరు మిల్టన్. ప్రస్తుతం నా ఇంటి దగ్గరలో ఉన్న ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. పిల్లలతో ఆటలాడుతూ, పాటలు పాడుతూ, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూంటే అసలు సమయమే తెలియదు నాకు. నేనూ వాళ్ళల్లో ఒక దాని లాగా, చిన్న పిల్లనై పోతాను. అలాగని టీచరుగా నా బాధ్యతను ఎప్పుడూ మర్చిపోను. నా చిన్నప్పుడే అమ్మ దూరమైంది. తను ఎలా ఉంటుందో కూడా నాకు గుర్తు లేదు. ఊహ తెలిసే సమయానికి నాన్న కూడా పోయారు. ఆయమ్మ మేరీ సంరక్షణలో పెరిగాను. వీధుల్లో చిన్నగా మంచు కురుస్తోంది. అలాగని గడ్డ కట్టుకు పోయేంత చలేం లేదు...................© 2017,www.logili.com All Rights Reserved.