'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అన్నారు పెద్దలు. భగవత్ స్వరూపమైన అన్నం అంటే ఆహారం ఎలా సిద్దిస్తుందో గీతలో చెప్పారు. అన్నం సమకురాలంటే వర్షం ఉండాలి. కాని వర్షం లేని ఉష్ణ మండలాల్లో పంటలు పండించి ప్రజలకు ఆహారాన్ని అందించడానికి విశేష కృషి చేసిన ఓ వ్యవసాయ శాస్త్రవేత్త జీవిత కధ ఇది. ఎక్కడో ఫిలిప్పైన్స్ లో ఓ బీద రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా అనేకమైన ప్రపంచ స్థాయి పదవులు చేపట్టి, చివరగా ఇక్రిసాట్ డైరెక్టర్ జెనరల్ అయ్యారు. ఆ పదవిలో సుమారు పదిహేనేళ్ళ అవిశ్రాంతంగా శ్రమించి మానవాళి, ఆకలితో అలమటించకుండా రక్షించేందుకు అవసరమైన వ్యవసాయ పరిశోధన యాగాన్ని నిర్వహించిన అపర రుత్విజుడాయన. ఉష్ణ మండలాల్లోని మెట్టభూమిలో అంతరించిపోతున్న కొన్ని పంటలకు పునర్జివం కల్పిస్తున్న ఓ దార్శనిక వ్యవసాయ శాస్త్రవేత్త.
వ్యవసాయం అంటే కేవలం మనిషి ఆహారానికి సంబందించిన విషయం కాదు. అది అతని సమగ్ర జీవనానికి సంబందించినదని వ్యవసాయాన్ని సరికొత్త కోణంలో నిర్వచించిన మానవ జీవన వ్యాఖ్యాత. వర్షపాతం, నీటి వసతి అంతంత మాత్రంగా వున్న ప్రాంతాల్లో ప్రతి చినుకును ఒక మెతుకుగా మార్చిన మాంత్రికుడు. విజ్ఞాన శాస్త్రాన్ని పేదవారి పక్షాన నిలిపిన లక్ష్య సాధకుడు మహనీయ వ్యక్తి అయిన డా.విలియందర్ జీవితాన్ని వివరించి రాసిందే ఈ అమూల్యమైన పుస్తకం.
-డా. విజయభాస్కర్.
© 2017,www.logili.com All Rights Reserved.