మోహనా... ఓ మోహనా..!
వీరభద్రప్ప
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
కొట్టూరు, కర్నాటక
కెంగార మోహన్ చాలా ఏళ్లుగా నాకు యువకవి మిత్రుడు. ఆయనకు సుప్రసిద్ధ కన్నడ రచయిత అనంతమూర్తితో పాటు, తెలుగు సాహిత్యదిగ్గజం అద్దేపల్లి రామ్మోహనరావు వరకు పరిచయాలున్న కవి. తను కన్నడ - తెలుగు ఈ రెండూభాషల సాహిత్యం గురించి, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలడు. ద్రావిడభాషల మధ్య వారధి అయిన ఆయన, నన్ను సాహిత్యప్రస్థానం పత్రికకు రెండుసార్లు ముఖాముఖికి పరిచయం చేశారు. దక్షిణాదిలోని ముఖ్యమైన జైనక్షేత్రమైన పెద్ద తుంబళం గ్రామంలో తెలుగు, కన్నడ వాతావరణంలో జన్మించాడు. తెలుగు వాతావరణంలో పెరిగాడు. అతనిప్పుడు ద్విభాషా వాతావరణంలో నివసిస్తున్నాడు. అతను కన్నడలోనూ వ్రాయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అయితే తెలుగులో ప్రధాన సాహిత్యప్రక్రియ అయిన కవితా రంగాన్ని తన కలంతో పండిస్తున్నాడు. ప్రగతిశీల సాహిత్యప్రతినిధిగా అనేక సెమినార్లలో ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రగతిశీల సాహిత్య సంఘమైన సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులుగా, సాహిత్య ప్రస్థానం అనే ప్రగతిశీల సాహిత్యమాస పత్రికలకు సంపాదకమండలి సభ్యులుగా రాష్ట్రమంతటా కలియదిరుగుతున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది రచయితలకు మిత్రుడయ్యాడు. కవిత్వం, కథ, విమర్శ రచనలు చేస్తూ వివిధ పత్రికలలో మోహన్ రచనలు ప్రచురింపబడుతున్న సందర్భంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాహిత్యలోకంలో నిలబెట్టుకోగలుగుతున్నారు. వివిధ పత్రికలకు దేశంలోని గొప్ప, వర్ధమాన రచయితల కథలు, వ్యాసాలు రాసి ప్రచురిస్తున్నారు. ప్రధానంగా వర్ధమాన రచయితలను ప్రోత్సహిస్తున్నారు. తనిలా చేయడం వల్ల వేలాది మంది పాఠకులకు, అవగాహనను విస్తృతం చేస్తుంది. ఈనేపథ్యంలోనే సాహితీస్రవంతి ద్వారా వెలువడుతున్న సాహిత్యప్రస్థానం పత్రికలో ఓవర్సీస్ కన్నడ రచయితగా నా పరిచయ ముఖాముఖి మాత్రమే కాకుండా, రెండు కథలు కూడా ప్రచురించబడటమే దీనికి ఉదాహరణ.
కెంగార మోహన్ కారల్ మార్క్స్, అంబేద్కర్, బుద్ధుడు వంటివారి భావజాలంతో ప్రభావితులయ్యారు. ఆయన వారి సిద్ధాంతాలను తమ జీవితంలో స్వీకరించాడు. ఈ కారణంగా, అతను సహజంగా వామపక్ష రచయితగా ఆవిష్కరింపబడ్డాడు. కర్నూలుజిల్లాకు...............
మోహనా... ఓ మోహనా..! వీరభద్రప్ప కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కొట్టూరు, కర్నాటక కెంగార మోహన్ చాలా ఏళ్లుగా నాకు యువకవి మిత్రుడు. ఆయనకు సుప్రసిద్ధ కన్నడ రచయిత అనంతమూర్తితో పాటు, తెలుగు సాహిత్యదిగ్గజం అద్దేపల్లి రామ్మోహనరావు వరకు పరిచయాలున్న కవి. తను కన్నడ - తెలుగు ఈ రెండూభాషల సాహిత్యం గురించి, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలడు. ద్రావిడభాషల మధ్య వారధి అయిన ఆయన, నన్ను సాహిత్యప్రస్థానం పత్రికకు రెండుసార్లు ముఖాముఖికి పరిచయం చేశారు. దక్షిణాదిలోని ముఖ్యమైన జైనక్షేత్రమైన పెద్ద తుంబళం గ్రామంలో తెలుగు, కన్నడ వాతావరణంలో జన్మించాడు. తెలుగు వాతావరణంలో పెరిగాడు. అతనిప్పుడు ద్విభాషా వాతావరణంలో నివసిస్తున్నాడు. అతను కన్నడలోనూ వ్రాయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అయితే తెలుగులో ప్రధాన సాహిత్యప్రక్రియ అయిన కవితా రంగాన్ని తన కలంతో పండిస్తున్నాడు. ప్రగతిశీల సాహిత్యప్రతినిధిగా అనేక సెమినార్లలో ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రగతిశీల సాహిత్య సంఘమైన సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులుగా, సాహిత్య ప్రస్థానం అనే ప్రగతిశీల సాహిత్యమాస పత్రికలకు సంపాదకమండలి సభ్యులుగా రాష్ట్రమంతటా కలియదిరుగుతున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది రచయితలకు మిత్రుడయ్యాడు. కవిత్వం, కథ, విమర్శ రచనలు చేస్తూ వివిధ పత్రికలలో మోహన్ రచనలు ప్రచురింపబడుతున్న సందర్భంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాహిత్యలోకంలో నిలబెట్టుకోగలుగుతున్నారు. వివిధ పత్రికలకు దేశంలోని గొప్ప, వర్ధమాన రచయితల కథలు, వ్యాసాలు రాసి ప్రచురిస్తున్నారు. ప్రధానంగా వర్ధమాన రచయితలను ప్రోత్సహిస్తున్నారు. తనిలా చేయడం వల్ల వేలాది మంది పాఠకులకు, అవగాహనను విస్తృతం చేస్తుంది. ఈనేపథ్యంలోనే సాహితీస్రవంతి ద్వారా వెలువడుతున్న సాహిత్యప్రస్థానం పత్రికలో ఓవర్సీస్ కన్నడ రచయితగా నా పరిచయ ముఖాముఖి మాత్రమే కాకుండా, రెండు కథలు కూడా ప్రచురించబడటమే దీనికి ఉదాహరణ. కెంగార మోహన్ కారల్ మార్క్స్, అంబేద్కర్, బుద్ధుడు వంటివారి భావజాలంతో ప్రభావితులయ్యారు. ఆయన వారి సిద్ధాంతాలను తమ జీవితంలో స్వీకరించాడు. ఈ కారణంగా, అతను సహజంగా వామపక్ష రచయితగా ఆవిష్కరింపబడ్డాడు. కర్నూలుజిల్లాకు...............© 2017,www.logili.com All Rights Reserved.