తెలుగు పాఠక లోకానికి సతీష్ చందర్ పత్రికా సంపాదకుడిగా, కవిగా, వ్యంగ్య రచయితగా, కథకుడిగా, విమర్శకుడిగా పరిచితులు. 'నిగ్రహ వాక్యం' విమర్శకు సంబంధించినది. గత మూడు దశాబ్దాల నుంచి వివిధ సాహిత్య ప్రక్రియల మీద వ్యాసం రూపంలోనో, సమీక్ష రోపంలోనో ఆయన విమర్శ చేస్తూనే ఉన్నారు. ఇంతవరకూ వెలువడిన గ్రంథాలలో విమర్శ పై ఒక్కటీ లేదు. ఈ ప్రక్రియలో ఇదే ప్రథమ గ్రంథం.
ఈ గ్రంథంలో మూడు భాగాలుంటాయి. విమర్శ, సమీక్ష, ప్రతివిమర్శ. మొదటి విభాగంలో శ్రీశ్రీ, శివసాగర్, అజంతా, నగ్నముని వంటి ప్రసిద్ధ కవుల కవిత్వం పైనా; చలం, ముళ్ళపూడి, చాసో వంటి వచన శిల్పుల వైచిత్రి పైనా; పలు సాహిత్య ధోరణులపైనా వ్యాసాలున్నాయి. రెండో భాగంలో రచయిత తాను ఎంచుకున్న గ్రంథాలపై చేసిన సమీక్షలు ఉన్నాయి. ఇక మూడు: ఇది విశిష్టమైన భాగం. సతీష్ చందర్ 'పంచమ వేదం' వెలువడినప్పుడు లేచిన దుమారం, ఆయన మీద వచ్చిన విమర్శలకు సతీష్ చందర్ చేసిన ప్రతి విమర్శా, సంబంధిత వ్యాసాలూ ఇందులో ఉంటాయి.
తెలుగు పాఠక లోకానికి సతీష్ చందర్ పత్రికా సంపాదకుడిగా, కవిగా, వ్యంగ్య రచయితగా, కథకుడిగా, విమర్శకుడిగా పరిచితులు. 'నిగ్రహ వాక్యం' విమర్శకు సంబంధించినది. గత మూడు దశాబ్దాల నుంచి వివిధ సాహిత్య ప్రక్రియల మీద వ్యాసం రూపంలోనో, సమీక్ష రోపంలోనో ఆయన విమర్శ చేస్తూనే ఉన్నారు. ఇంతవరకూ వెలువడిన గ్రంథాలలో విమర్శ పై ఒక్కటీ లేదు. ఈ ప్రక్రియలో ఇదే ప్రథమ గ్రంథం. ఈ గ్రంథంలో మూడు భాగాలుంటాయి. విమర్శ, సమీక్ష, ప్రతివిమర్శ. మొదటి విభాగంలో శ్రీశ్రీ, శివసాగర్, అజంతా, నగ్నముని వంటి ప్రసిద్ధ కవుల కవిత్వం పైనా; చలం, ముళ్ళపూడి, చాసో వంటి వచన శిల్పుల వైచిత్రి పైనా; పలు సాహిత్య ధోరణులపైనా వ్యాసాలున్నాయి. రెండో భాగంలో రచయిత తాను ఎంచుకున్న గ్రంథాలపై చేసిన సమీక్షలు ఉన్నాయి. ఇక మూడు: ఇది విశిష్టమైన భాగం. సతీష్ చందర్ 'పంచమ వేదం' వెలువడినప్పుడు లేచిన దుమారం, ఆయన మీద వచ్చిన విమర్శలకు సతీష్ చందర్ చేసిన ప్రతి విమర్శా, సంబంధిత వ్యాసాలూ ఇందులో ఉంటాయి.© 2017,www.logili.com All Rights Reserved.