ప్రకాశకుల విజ్ఞప్తి
'హిందూమతం' అనే పేరుతో విస్తృత ప్రచారంలో ఉన్న సనాతనధర్మం స్వరూపస్వభావాలపై స్పష్టమైన అవగాహన కలవారు అరుదుగా కనిపిస్తారు. ప్రపంచంలోని మతాలన్నింటిలోకీ అతిప్రాచీనమైన ఈ హిందూమతం పరిధి ఎంత విస్తృతమైనదో, ఇది ప్రతిపాదించిన విషయాలు ఎంత విశిష్టమైనవో, మానవజాతికి ఇది చూపు మహోన్నత లక్ష్యం ఏమిటో తెలిసికొనటం ప్రతిభారతీయునికీ కనీసధర్మం. అలాగే ప్రపంచప్రసిద్ధాలైన మతాలను గూర్చిన సమగ్రపరిచయం కూడా ఆధునికులకు అనివార్యమే. ఇలా వివిధమతాలను గూర్చిన అవగాహన, భారతీయుల్లో తమ ధర్మం పట్ల శ్రద్ధ, ఇతర ధర్మాలపట్ల సహనమూ కలుగజేసి సమాజంలో సుఖశాంతులనూ, ఆనందాన్ని ఇనుమడింపజేస్తుంది.
లక్ష్యంతో ఈ గ్రంథాన్ని ప్రామాణికంగా రచించిన 'మహామహోపాధ్యాయ' డా. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు జగమెరిగిన పండితులు. బహుభాషాకోవిదులు. ప్రాచ్యపాశ్చాత్య తత్త్వశాస్త్రనిష్ణాతులు. సార్ధశతాధిక గ్రంథకర్తలు. పరస్సహస్ర శిష్యజన మార్గదర్శకులు. ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృత విభాగ పూర్వాధ్యక్షులు. అలుపెరుగని సారస్వత నిత్యకృషీవలులు. వారీ గ్రంథాన్ని వివిధ మతాల సంగ్రహ స్వరూప ప్రతిపాదకంగా తెలుగులో సులభశైలిలో సమకూర్చి పాఠకలోకానికి మహోపకారం చేశారనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఈ గ్రంథాన్ని ప్రచురించే అవకాశం అర్థాపేక్ష ఏ మాత్రము లేకుండా మాకు కలుగ జేసినందులకు వారికి మా హార్దిక కృతజ్ఞతలు సమర్పించుకొంటున్నాము.....................
ప్రకాశకుల విజ్ఞప్తి 'హిందూమతం' అనే పేరుతో విస్తృత ప్రచారంలో ఉన్న సనాతనధర్మం స్వరూపస్వభావాలపై స్పష్టమైన అవగాహన కలవారు అరుదుగా కనిపిస్తారు. ప్రపంచంలోని మతాలన్నింటిలోకీ అతిప్రాచీనమైన ఈ హిందూమతం పరిధి ఎంత విస్తృతమైనదో, ఇది ప్రతిపాదించిన విషయాలు ఎంత విశిష్టమైనవో, మానవజాతికి ఇది చూపు మహోన్నత లక్ష్యం ఏమిటో తెలిసికొనటం ప్రతిభారతీయునికీ కనీసధర్మం. అలాగే ప్రపంచప్రసిద్ధాలైన మతాలను గూర్చిన సమగ్రపరిచయం కూడా ఆధునికులకు అనివార్యమే. ఇలా వివిధమతాలను గూర్చిన అవగాహన, భారతీయుల్లో తమ ధర్మం పట్ల శ్రద్ధ, ఇతర ధర్మాలపట్ల సహనమూ కలుగజేసి సమాజంలో సుఖశాంతులనూ, ఆనందాన్ని ఇనుమడింపజేస్తుంది. లక్ష్యంతో ఈ గ్రంథాన్ని ప్రామాణికంగా రచించిన 'మహామహోపాధ్యాయ' డా. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు జగమెరిగిన పండితులు. బహుభాషాకోవిదులు. ప్రాచ్యపాశ్చాత్య తత్త్వశాస్త్రనిష్ణాతులు. సార్ధశతాధిక గ్రంథకర్తలు. పరస్సహస్ర శిష్యజన మార్గదర్శకులు. ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృత విభాగ పూర్వాధ్యక్షులు. అలుపెరుగని సారస్వత నిత్యకృషీవలులు. వారీ గ్రంథాన్ని వివిధ మతాల సంగ్రహ స్వరూప ప్రతిపాదకంగా తెలుగులో సులభశైలిలో సమకూర్చి పాఠకలోకానికి మహోపకారం చేశారనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఈ గ్రంథాన్ని ప్రచురించే అవకాశం అర్థాపేక్ష ఏ మాత్రము లేకుండా మాకు కలుగ జేసినందులకు వారికి మా హార్దిక కృతజ్ఞతలు సమర్పించుకొంటున్నాము.....................© 2017,www.logili.com All Rights Reserved.