'యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్' - ఇక్కడ ఉన్నదే మరొకచోట ఉండగలదు, ఇక్కడ లేనిది మరెక్కడా ఉండదు అని ప్రతిజ్ఞా పూర్వకంగా రచించబడిన గ్రంథం శ్రీమహాభారతం. భారతీయసంస్కృతిని తెలుసుకోవడానికి మూలభూతమైన విజ్ఞానసర్వస్వం. ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, కవి వృషభులు మహాకావ్యమనీ, రాజనీతిజ్ఞులు రాజనీతిశాస్త్రమనీ కొనియాడిన గ్రంథమని నన్నయ గారు వివరించారు.
వేదంలో చెప్పబడిన ధర్మాన్ని ఇతిహాసపురాణాలు ద్వారా జనసామాన్యానికి అందించడం, సమాజాన్ని ధార్మికమార్గంలో నడపడం ప్రాచీన ప్రణాళిక. వేదం ప్రభుసమ్మితంగా ఫలానా విధంగా చేయాలి అని శాసిస్తే, ఇతిహాస పురాణాలు మిత్రసమ్మితంగా అదే విషయాన్ని బోధిస్తాయి. పురాణాల్లో దేవీదేవతలు, దేవాసుర సంగ్రామాలు ముఖ్యమైన ఇతివృత్తంగా ఉంటాయి.
- పుల్లెల శ్రీరామచంద్రుడు