చరణ్ రాసిన కథల మీద కన్నా అతను ఆ కథలు రాయడానికి ప్రేరేపించిన అంశాల చుట్టే నా మనసు పోతోంది. నేడు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. కవి పైడి తెరేశ్ మాటల్లో చెప్పాలంటే ‘కొట్టివేతలతో పనిలేకుండా కొత్త వాక్యాలు రాయడానికి, ఈ దేశ చరిత్ర మరీ అంత స్వచ్ఛమైనదేమీ కాదు'.
ఇప్పుడు కొట్టివేతలు అనివార్యం, కొత్త వాక్యాలు అవసరం. ఆ పనిని `పా రంజిత్ వెండితెర మీద దళిత ఈస్తటిక్స్లో విజయవంతంగా చేస్తుంటే చరణ్ పరిమి కథల్లో చేసేందుకు ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది.
అయితే ఎన్ని తప్పులని చెరిపేయాలి? ఎన్ని కొత్త వాక్యాలని రాయాలి? రోజుకో నిమిషానికొక వక్రీకరణ దేశ కంటెంట్ ఫ్యాక్టరీ నుంచి అధికారికంగా ఊడిపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రచయితలు, కవులు, బుద్ధిజీవులు ఎన్నింటినని ఎదుర్కోగలరు? పైగా వక్రీకరణ ఈనాటిది కాదు దాంతో పాతది.
దాన్ని పూర్వపక్షం చేసి నిజాలను వెలికితీయాలంటే 'ఈ దేశాన్ని మోస్తున్న మట్టిపొరల కింద పాతిపెట్టబడిన కోటానుకోట్ల సంతకాలను నిద్రలేపాలి'. అదంత సులువైన పని కూడా కాదు. ఈ పనికి పూనుకోవాలంటే మన దేశ అసలు సిసలు చరిత్ర, మూలాలు, ఆధిపత్య సంస్కృతి రాజకీయాలు' కొంతైనా తెలిసుండాలి..............
తెలుగు కథకు ఇప్పుడు అవసరమైన సంతకం ----------------- డా. వేంపల్లె షరీఫ్, కథా రచయిత చరణ్ రాసిన కథల మీద కన్నా అతను ఆ కథలు రాయడానికి ప్రేరేపించిన అంశాల చుట్టే నా మనసు పోతోంది. నేడు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. కవి పైడి తెరేశ్ మాటల్లో చెప్పాలంటే ‘కొట్టివేతలతో పనిలేకుండా కొత్త వాక్యాలు రాయడానికి, ఈ దేశ చరిత్ర మరీ అంత స్వచ్ఛమైనదేమీ కాదు'. ఇప్పుడు కొట్టివేతలు అనివార్యం, కొత్త వాక్యాలు అవసరం. ఆ పనిని `పా రంజిత్ వెండితెర మీద దళిత ఈస్తటిక్స్లో విజయవంతంగా చేస్తుంటే చరణ్ పరిమి కథల్లో చేసేందుకు ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది. అయితే ఎన్ని తప్పులని చెరిపేయాలి? ఎన్ని కొత్త వాక్యాలని రాయాలి? రోజుకో నిమిషానికొక వక్రీకరణ దేశ కంటెంట్ ఫ్యాక్టరీ నుంచి అధికారికంగా ఊడిపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రచయితలు, కవులు, బుద్ధిజీవులు ఎన్నింటినని ఎదుర్కోగలరు? పైగా వక్రీకరణ ఈనాటిది కాదు దాంతో పాతది. దాన్ని పూర్వపక్షం చేసి నిజాలను వెలికితీయాలంటే 'ఈ దేశాన్ని మోస్తున్న మట్టిపొరల కింద పాతిపెట్టబడిన కోటానుకోట్ల సంతకాలను నిద్రలేపాలి'. అదంత సులువైన పని కూడా కాదు. ఈ పనికి పూనుకోవాలంటే మన దేశ అసలు సిసలు చరిత్ర, మూలాలు, ఆధిపత్య సంస్కృతి రాజకీయాలు' కొంతైనా తెలిసుండాలి..............© 2017,www.logili.com All Rights Reserved.