ఒక కళాకారుడి అగమ్యాలు, అగోచరాలు
ఒక కళాకారుడిగా బతకాలని నిర్ణయించుకున్న తరువాత సాధారణ ప్రజల్లా జీవించే హక్కుని ఆ వ్యక్తి కోల్పోతాడు.
(ఫ్రెంచ్ రచయిత గై డి మొపాసకి రాసిన ఒక ఉత్తరంలో గుస్తావ్ ఫ్లోబేర్) మీరు ఒక కథ చదువుతారు. ఒక బొమ్మ చూస్తారు. ఒక పాట వింటారు. ఇవన్నీ ఎవరో ఒక కళాకారుడి సృష్టి అని మీకు తెలుసు. అవకాశం వస్తే ఆ కళాకారుణ్ణి కూడా చూడచ్చు మీరు. కానీ ఆ కళాకారుడి లోపల ఎప్పుడైనా చూశారా? అతని మస్తిష్కంలో, అతని మనసులో ఏముంటుందో, ఏం జరుగుతుంటుందో చూశారా ఎప్పుడైనా? రండి. అలాంటి ఒక అవకాశానికి మీకు ఆహ్వానం పలుకుతున్నాను... కేరాఫ్ బావర్చి పుస్తకంలోకి.
చరణ్ పరిమి బొమ్మలేస్తాడు. ఫొటోగ్రాఫర్. డిజైనర్. సినిమాలకు పని చేశాడు. బొమ్మలు, ఫొటోలు తండ్రి అందించిన ఆస్థి. సినిమాలు, కథలు స్వార్జితం. ఇవన్నీ ఇతని లోపలే ఉన్నాయి. మనకి బయటికి కనపడేది కేవలం అతను. అప్పుడప్పుడు అతని బొమ్మ, అతని కథ. ఇదిగో ఇప్పుడు ఈ పుస్తకరూపంలో పన్నెండు కథలను ఒకేసారి చూసే అవకాశం కల్పించాడు. ఈ కథల్లోకి వెళ్లి గమనిస్తే అక్కడ మళ్లీ అతను కనిపిస్తాడు.
ఫ్లోబేర్ మాటలని మళ్లీ చూడండి. కళాకారుడు సాధారణ ప్రజల్లా జీవించే హక్కు కోల్పోతాంటున్నాడు. ఎవరా సాధారణ ప్రజలు కళాకారుడికి ఆ ప్రజలలో కలవలేని లేదా కలవనివ్వని ఆ ప్రత్యేక లక్షణం ఏముంటుంది? అది ప్రత్యేక లక్షణమా లేక మిగిలిన ప్రజలకి విరుద్ధమైన, ఆమోదయోగ్యం కాని లక్షణమా? Different or odd? ఇది అర్ధం కావాలన్నా మీరు ఈ పుస్తకంలోకి వెళ్లాలి. అక్కడ.............
ఒక కళాకారుడి అగమ్యాలు, అగోచరాలు ఒక కళాకారుడిగా బతకాలని నిర్ణయించుకున్న తరువాత సాధారణ ప్రజల్లా జీవించే హక్కుని ఆ వ్యక్తి కోల్పోతాడు. (ఫ్రెంచ్ రచయిత గై డి మొపాసకి రాసిన ఒక ఉత్తరంలో గుస్తావ్ ఫ్లోబేర్) మీరు ఒక కథ చదువుతారు. ఒక బొమ్మ చూస్తారు. ఒక పాట వింటారు. ఇవన్నీ ఎవరో ఒక కళాకారుడి సృష్టి అని మీకు తెలుసు. అవకాశం వస్తే ఆ కళాకారుణ్ణి కూడా చూడచ్చు మీరు. కానీ ఆ కళాకారుడి లోపల ఎప్పుడైనా చూశారా? అతని మస్తిష్కంలో, అతని మనసులో ఏముంటుందో, ఏం జరుగుతుంటుందో చూశారా ఎప్పుడైనా? రండి. అలాంటి ఒక అవకాశానికి మీకు ఆహ్వానం పలుకుతున్నాను... కేరాఫ్ బావర్చి పుస్తకంలోకి. చరణ్ పరిమి బొమ్మలేస్తాడు. ఫొటోగ్రాఫర్. డిజైనర్. సినిమాలకు పని చేశాడు. బొమ్మలు, ఫొటోలు తండ్రి అందించిన ఆస్థి. సినిమాలు, కథలు స్వార్జితం. ఇవన్నీ ఇతని లోపలే ఉన్నాయి. మనకి బయటికి కనపడేది కేవలం అతను. అప్పుడప్పుడు అతని బొమ్మ, అతని కథ. ఇదిగో ఇప్పుడు ఈ పుస్తకరూపంలో పన్నెండు కథలను ఒకేసారి చూసే అవకాశం కల్పించాడు. ఈ కథల్లోకి వెళ్లి గమనిస్తే అక్కడ మళ్లీ అతను కనిపిస్తాడు. ఫ్లోబేర్ మాటలని మళ్లీ చూడండి. కళాకారుడు సాధారణ ప్రజల్లా జీవించే హక్కు కోల్పోతాంటున్నాడు. ఎవరా సాధారణ ప్రజలు కళాకారుడికి ఆ ప్రజలలో కలవలేని లేదా కలవనివ్వని ఆ ప్రత్యేక లక్షణం ఏముంటుంది? అది ప్రత్యేక లక్షణమా లేక మిగిలిన ప్రజలకి విరుద్ధమైన, ఆమోదయోగ్యం కాని లక్షణమా? Different or odd? ఇది అర్ధం కావాలన్నా మీరు ఈ పుస్తకంలోకి వెళ్లాలి. అక్కడ.............© 2017,www.logili.com All Rights Reserved.