సాహితీ సర్వజ్ఞుడు బాలగంగాధరుడు
"ఈ క్షోణిన్ నిను బోలు సత్కవులు లే నేటికాలంబునన్
దాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ
వక్షోజద్వయ గంధసార ఘుసృణ ద్వైరాజ్య భారంబు న
ధ్యక్షించున్ గవిసార్వభౌమ! భవదీయ ప్రౌఢ సాహిత్యముల్". (కాశీ.1.14)
సమకాలీన సాహిత్యరంగంలో నీతో సరితూగ గలిగిన సత్కవులు లేరు. దాక్షారామ చాళుక్య భీమవరవాసినులై భీమేశ్వరారాధకులైన దేవగంధర్వాప్సరో లీలావతులు వక్షోజములపై పూసుకొను మలయజ కుంకుమ పరిమళములు నీ ప్రౌఢ సాహిత్యంలో గుబాళిస్తాయని 'సకల విద్యానాథుడైన' శ్రీనాథుని గూర్చి రాజమహేంద్రవర రాజ్యప్రభువు వీరభద్రారెడ్డి అన్న వేమారెడ్డి ప్రశంస.
శ్రీనాథునికున్న జీవనరక్తి, శివభక్తి, నవ్యప్రయోగయుక్తి, బహుభాషాశక్తి, చాటు కవితానురక్తి, నాటి నుండి నేటివరకు తెనుగు కవులకు అబ్బలేదంటే అతిశయోక్తి గాదు.
హేమపాత్రాన్న స్వీకారము ఒకవైపు, పంచాక్షరీ మంత్రపారాయణము మరోవైపు
రత్నాంబర ధారణము ఒకవైపు, రుద్రాక్షమాలికా ధారణము మరోవైపు
కస్తూరికాలేప నైపథ్యము ఒకవైపు, సర్వాంగీణ విభూతి సముద్ధూళనము మరోవైపు
గంధర్వాప్సరో భామినీ సాన్నిధ్యము ఒకవైపు, సర్వేశ్వర ధ్యానసంయమనము మరోవైపు
ఆహా! ఏమి జీవితం. ఇంతటి జీవన వైవిధ్యాన్ని, వైరుధ్యాలను మరే తెలుగు కవులలోనూ చూడము. పోతన రచనలో భక్తితో రక్తి చెలిమి చేస్తే శ్రీనాథుని రచనలలో రక్తి భక్తితో చెలిమిచేసింది. తిక్కన కథాకావ్య ప్రక్రియను కొనసాగిస్తే శ్రీనాథుడు రసకావ్య ప్రయోగాన్ని చేసాడు. ఈ మార్గరసకావ్య ప్రయోగం శృంగార నైషధంలో పతాకస్థాయికి చేరింది. తెలుగునాట పర్యటించి తాను వీక్షించిన దృశ్యాలను చాటువులలో నిక్షేపించి ఆనాటి సామాజిక స్థితిగతులను మన కళ్ళకు గట్టినట్టు చూపించిన చిత్రకారుడు శ్రీనాథుడు......................
సాహితీ సర్వజ్ఞుడు బాలగంగాధరుడు "ఈ క్షోణిన్ నిను బోలు సత్కవులు లే నేటికాలంబునన్ దాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ వక్షోజద్వయ గంధసార ఘుసృణ ద్వైరాజ్య భారంబు నధ్యక్షించున్ గవిసార్వభౌమ! భవదీయ ప్రౌఢ సాహిత్యముల్". (కాశీ.1.14) సమకాలీన సాహిత్యరంగంలో నీతో సరితూగ గలిగిన సత్కవులు లేరు. దాక్షారామ చాళుక్య భీమవరవాసినులై భీమేశ్వరారాధకులైన దేవగంధర్వాప్సరో లీలావతులు వక్షోజములపై పూసుకొను మలయజ కుంకుమ పరిమళములు నీ ప్రౌఢ సాహిత్యంలో గుబాళిస్తాయని 'సకల విద్యానాథుడైన' శ్రీనాథుని గూర్చి రాజమహేంద్రవర రాజ్యప్రభువు వీరభద్రారెడ్డి అన్న వేమారెడ్డి ప్రశంస. శ్రీనాథునికున్న జీవనరక్తి, శివభక్తి, నవ్యప్రయోగయుక్తి, బహుభాషాశక్తి, చాటు కవితానురక్తి, నాటి నుండి నేటివరకు తెనుగు కవులకు అబ్బలేదంటే అతిశయోక్తి గాదు. హేమపాత్రాన్న స్వీకారము ఒకవైపు, పంచాక్షరీ మంత్రపారాయణము మరోవైపు రత్నాంబర ధారణము ఒకవైపు, రుద్రాక్షమాలికా ధారణము మరోవైపు కస్తూరికాలేప నైపథ్యము ఒకవైపు, సర్వాంగీణ విభూతి సముద్ధూళనము మరోవైపు గంధర్వాప్సరో భామినీ సాన్నిధ్యము ఒకవైపు, సర్వేశ్వర ధ్యానసంయమనము మరోవైపు ఆహా! ఏమి జీవితం. ఇంతటి జీవన వైవిధ్యాన్ని, వైరుధ్యాలను మరే తెలుగు కవులలోనూ చూడము. పోతన రచనలో భక్తితో రక్తి చెలిమి చేస్తే శ్రీనాథుని రచనలలో రక్తి భక్తితో చెలిమిచేసింది. తిక్కన కథాకావ్య ప్రక్రియను కొనసాగిస్తే శ్రీనాథుడు రసకావ్య ప్రయోగాన్ని చేసాడు. ఈ మార్గరసకావ్య ప్రయోగం శృంగార నైషధంలో పతాకస్థాయికి చేరింది. తెలుగునాట పర్యటించి తాను వీక్షించిన దృశ్యాలను చాటువులలో నిక్షేపించి ఆనాటి సామాజిక స్థితిగతులను మన కళ్ళకు గట్టినట్టు చూపించిన చిత్రకారుడు శ్రీనాథుడు......................© 2017,www.logili.com All Rights Reserved.