భారత రాష్ట్రపతి నుండి 'పద్మశ్రీ', 'పద్మభూషణ్' సత్కారాలను పొందిన | విద్యా వేత్త.
1972 ఆంద్రోద్యమంలోనూ, 1975 అత్యవసర పరిస్థితి కాలంలోనూ విద్యార్థి నాయకుడుగా ఆంతరంగిక భద్రతా చట్టం కింద నిర్బంధానికి గురైన డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మూడు దశాబ్దాలుగా విద్యార్థుల విశేష ఆదరాభిమానాలను చూరగొన్న అధ్యాపకుడు. -
హిందీ, తెలుగు భాషలు రెండింటిలోనూ డాక్టరేట్లు పొందిన నిత్య పరిశోధకుడు. 65కు పైగా ప్రసిద్ధ గ్రంథాలను రచించి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను 'తమస్' | అనువాదానికి, 'ద్రౌపది' నవలకు సృజనాత్మక రచనకు పొంది, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి.నా.రె. చేత 'హిందీ తెలుగు భాషల స్వర్ణ సేతువు' అని ప్రశంసలు పొందిన రచయిత.
అమెరికా, బ్రిటన్, జపాన్, హాంకాంగ్, బెల్జియం, మారిషస్, మలేషియా, థాయ్ లాండ్, కెనడా, స్పెయిన్, రష్యా, ఉక్రెయిన్, ఈజిప్ట్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, శ్రీలంక, ఫ్రాన్సు మొదలైన దేశాల్లో పర్యటించి వందలాది సమావేశాల్లో సభారంజకంగా ప్రసంగించి విద్వజ్జనుల మన్ననలందుకున్న వక్త.
రాజ్యసభ సభ్యునిగా ఉన్నా, రచనా వ్యాసంగం మాననివాడు. రాజ్యసభ పదవీ విరమణ అనంతరం కూడా అధ్యాపక వృత్తిని ఎంచుకున్న బోధనారంగ ప్రేమికుడు.
పార్లమెంటరీ అధికార భాషా సంఘ ఉపాధ్యక్షుడుగా, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడుగా, ఆంధప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్‌గా, విశ్వహిందీ సదస్సు నిర్వాహకుడుగా, హిందీ భాష అమలుకు కంకణం కట్టుకుని హిందీ ప్రాంతీయులకు అబ్బురపాటు కలిగించిన జాతీయవాది. |
తెలుగుకు ప్రాచీన భాష హోదా కోసం కృషి చేసేందుకు ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ సభ్యుడుగా, ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వాహక సంఘ అధ్యక్షుడుగా, పలువురు ప్రసిద్ధుల రచనలు తెలుగులో అనువదించిన రచయితగా తెలుగు భాషను ప్రేమించే తెలుగు బిడ్డ.
వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలకు హిందీ సలహా సంఘ సభ్యునిగా, ప్రధానమంత్రి అధ్యక్షతన గల కేంద్రీయ హిందీ సమితిలో సభ్యునిగా జాతీయ భాష హిందీకి సేవలందిస్తున్న భాషా సేవకుడు.
కెనడాలో భారత సాంస్కృతిక రాయబారిగా పనిచేసిన యార్లగడ్డ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం మరియు ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమి ల అధ్యక్షుడుగా క్యాబినెట్ మంత్రి హోదాలో పనిచేస్తున్నారు.