నమో.. నమో.. నరేంద్రమోడీ అనే మాట ఆ నోట ఈ నోట ప్రతి నోటా పాటై పాడింది. దేశమంతటా, కులమత భేదాలు లేకుండా చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా యువతతో పాటు భారతదేశం యావత్తూ మోడీ జపంతో నిండిపోయింది. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒక సంవత్సరం పాటు దేశమంతా నలుమూలలా పర్యటన చేసి దాదాపు 400 పైగా బహిరంగసభల్లో మాట్లాడి జనాన్ని ఆకర్షించారు మోడీ. ప్రజల్లో ఉత్సాహాన్ని, నమ్మకాన్ని కలుగజేశారు. అవినీతిలేని అభివృద్ధి లక్ష్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని 2014 ఎన్నికలముందు రాజకీయనాయకులకు, ప్రభుత్వాలకు మాత్రమే తెలిపిన మోడీ అతితక్కువ సమయంలో ప్రజల దృష్టిని కూడా అమితంగా ఆకర్షించారు. అభిమానులు, వ్యతిరేకులు అందరూ రోజూ మోడీ గురించి మాట్లాడారు. ఎవరు ఈ మోడీ? ప్రజాకర్షణ ఆయనకేలా లభించింది? ఒక్కసారిగా అయన ప్రజల్లో నమ్మకాన్ని ఎలా చూరగొన్నారు? మోడీని అన్ని కోణాల నుంచి పరిశీలించి ఈ విషయాలన్నింటిని సంగ్రహంగా రాశారు శ్రీ లక్ష్మీ ప్రసాద్. మోడీ గురించి తెలుసుకోవాలన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా తెలియజేశారు.
ఒక పేద కుటుంబంలో జన్మించి, ఆర్థికంగా వెనుకబడిన తండ్రికి సంపాదనలో తన చిన్నతనంలోనే సహాయం చేసారు మోడీ.ఉదయంపూట రైల్వేస్టేషన్ లో టీ అమ్ముకుంటూ ప్రతి రోజూ చెరువు మధ్యలో ఉన్న గుడికి వెళ్లి తర్వాత చదువుకోవడానికి వెళ్ళడం నిత్యదినచర్య క్రమం మోడీకి. చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక చింతనలో గడపడం, ప్రకృతిని ప్రేమించడం ఆయనకు అలవాటు. గుడికి వెళ్ళడం, ఉపవాసం ఉండడం మతపరమైనవి కావని, ఆధ్యాత్మికమైనవని మోడీ నమ్మకం. ఆర్ఎస్ఎస్ తో పరిచయం ఆయన జీవితంలో మార్పు తీసుకుని వచ్చింది. మోడీలో ధైర్యం, పట్టుదల, తలపెట్టిన పనులన్నింటిని శ్రద్ధగా చేయడం ఆయన అభివృద్దికి కారణం. ఇలా మోడీ గురించి ఎన్నో విషయాలు మనకు ఈ పుస్తకం ద్వారా తెలుసుకునే అవకాశం వచ్చింది.
ఈ పుస్తకం ద్వారా నరేంద్ర మోడీని ప్రజలకు పరిచయం చేయడమే కాక, ఎలాంటి ప్రభుత్వం ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేసారు లక్ష్మీప్రసాద్ గారు. హిందీ, తెలుగు భాషల్లో జగమెరిగిన పండితుడు అయనప్పటికీ చాలా సరళమైన శైలిలో మోడీ గురించి ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకునే విధంగా రాయడం ప్రసంసనీయం, ముదావహం. శ్రీ లక్ష్మీప్రసాద్ గారి ఆశ, భావన, కోరిక నరేంద్ర మోడీని చదవండి, నరేంద్ర మోడీని అర్ధం చేసుకోండి, నరేంద్ర మోడీని అనుసరించండి అని.
- యార్లగడ్డ అక్ష్మిప్రసాద్
నమో.. నమో.. నరేంద్రమోడీ అనే మాట ఆ నోట ఈ నోట ప్రతి నోటా పాటై పాడింది. దేశమంతటా, కులమత భేదాలు లేకుండా చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా యువతతో పాటు భారతదేశం యావత్తూ మోడీ జపంతో నిండిపోయింది. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒక సంవత్సరం పాటు దేశమంతా నలుమూలలా పర్యటన చేసి దాదాపు 400 పైగా బహిరంగసభల్లో మాట్లాడి జనాన్ని ఆకర్షించారు మోడీ. ప్రజల్లో ఉత్సాహాన్ని, నమ్మకాన్ని కలుగజేశారు. అవినీతిలేని అభివృద్ధి లక్ష్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని 2014 ఎన్నికలముందు రాజకీయనాయకులకు, ప్రభుత్వాలకు మాత్రమే తెలిపిన మోడీ అతితక్కువ సమయంలో ప్రజల దృష్టిని కూడా అమితంగా ఆకర్షించారు. అభిమానులు, వ్యతిరేకులు అందరూ రోజూ మోడీ గురించి మాట్లాడారు. ఎవరు ఈ మోడీ? ప్రజాకర్షణ ఆయనకేలా లభించింది? ఒక్కసారిగా అయన ప్రజల్లో నమ్మకాన్ని ఎలా చూరగొన్నారు? మోడీని అన్ని కోణాల నుంచి పరిశీలించి ఈ విషయాలన్నింటిని సంగ్రహంగా రాశారు శ్రీ లక్ష్మీ ప్రసాద్. మోడీ గురించి తెలుసుకోవాలన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా తెలియజేశారు. ఒక పేద కుటుంబంలో జన్మించి, ఆర్థికంగా వెనుకబడిన తండ్రికి సంపాదనలో తన చిన్నతనంలోనే సహాయం చేసారు మోడీ.ఉదయంపూట రైల్వేస్టేషన్ లో టీ అమ్ముకుంటూ ప్రతి రోజూ చెరువు మధ్యలో ఉన్న గుడికి వెళ్లి తర్వాత చదువుకోవడానికి వెళ్ళడం నిత్యదినచర్య క్రమం మోడీకి. చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక చింతనలో గడపడం, ప్రకృతిని ప్రేమించడం ఆయనకు అలవాటు. గుడికి వెళ్ళడం, ఉపవాసం ఉండడం మతపరమైనవి కావని, ఆధ్యాత్మికమైనవని మోడీ నమ్మకం. ఆర్ఎస్ఎస్ తో పరిచయం ఆయన జీవితంలో మార్పు తీసుకుని వచ్చింది. మోడీలో ధైర్యం, పట్టుదల, తలపెట్టిన పనులన్నింటిని శ్రద్ధగా చేయడం ఆయన అభివృద్దికి కారణం. ఇలా మోడీ గురించి ఎన్నో విషయాలు మనకు ఈ పుస్తకం ద్వారా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఈ పుస్తకం ద్వారా నరేంద్ర మోడీని ప్రజలకు పరిచయం చేయడమే కాక, ఎలాంటి ప్రభుత్వం ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేసారు లక్ష్మీప్రసాద్ గారు. హిందీ, తెలుగు భాషల్లో జగమెరిగిన పండితుడు అయనప్పటికీ చాలా సరళమైన శైలిలో మోడీ గురించి ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకునే విధంగా రాయడం ప్రసంసనీయం, ముదావహం. శ్రీ లక్ష్మీప్రసాద్ గారి ఆశ, భావన, కోరిక నరేంద్ర మోడీని చదవండి, నరేంద్ర మోడీని అర్ధం చేసుకోండి, నరేంద్ర మోడీని అనుసరించండి అని. - యార్లగడ్డ అక్ష్మిప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.