జ్ఞాన సిద్ధాంతం - మరొక సంతకం
'భౌతికవాదం కొన్ని ప్రాథమిక విషయాలు' రమేష్పట్నాయక్ విశ్లేషణా పరిచయమిది. చాలాకాలంగా రమేష్ పట్నాయక్ మార్పిజం, దానికి కొనసాగింపు అయిన తత్వశాస్త్రం పరిశీలనపై అధ్యయనం చేస్తున్నారు. సరళమైన వ్యక్తీకరణలో రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రగతిశీల శిబిరాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు, రాజకీయ తీవ్రతను పెంచడానికి మార్క్సిజం శాస్త్రీయ అధ్యయనపరునిగా రమేష్ పట్నాయక్ కృషి స్వాగతించదగినది.
మార్క్సిజం ఒక రాజకీయశాస్త్రం. మానవ మనుగడకు దారి చూపే వెలుగు. రెండు శతాబ్దాల మానవ ప్రపంచాన్ని, మానవీయంగా మార్చడానికి, అసమానతలు లేని నూత్న ప్రపంచాన్ని రూపొందించడానికి, మార్క్స్ చేసిన కృషి, ఇవాల్టి సమాజపు అవసరముగా కూడా వుంది. మార్క్సిజాన్ని అంచనా వేస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశీలనలు వచ్చాయి. పెట్టుబడిని తమ అధ్యయన పరంపరలో భాగం చేసుకున్నవారు, సకల మానవాళి పరాయీకృత శ్రమ నుండి, సకల అణచివేతల నుండి విముక్తి చేసే సృజనాత్మక ప్రపంచానికి ఒక దారి వేయడానికి ప్రయత్నం కొనసాగుతుంది.
మార్క్స్ తాత్విక దృక్పథానికి వర్తమాన కాలంలో ప్రాసంగికత మరింత పెరిగింది. ప్రపంచం మారుతున్న కాలం. మనుషులు కొత్త ఆరాట ప్రపంచంలో తమ భవిష్యత్ను వెతుక్కుంటున్న క్రమంలో గతకాలపు మార్క్స్ ఎట్లా ఈ కాలానికి అవసరమవుతాడు. మార్క్స్ జీవించిన కాలం దాటి ప్రపంచం చాలా ముందుకు పోయింది. కోట్లాదిమంది ప్రజలు తమయిన జీవితాన్ని రూపొందించుకోవడానికి, ఇంకాస్త మెరుగయిన, సౌకర్యవంతమైన జీవన ప్రణాళిక కోసం సౌందర్యాత్మక జీవనం కోసం నిన్నటికంటే ఇవాళ బాగుంటుందని రేపు తేజోవంతమవుతుందని ఆశిస్తున్నారు. మానవుడు కోరుకున్న ప్రపంచం సాధ్యమయిందా? లేదా సాధ్యమవుతుందా? సకల అణచివేతల నుండి, తేజోమయ ప్రపంచం రూపొందడానికి మార్క్స్ చూపిన దారి, ఆ వెలుగులో మార్క్స్...................
జ్ఞాన సిద్ధాంతం - మరొక సంతకం 'భౌతికవాదం కొన్ని ప్రాథమిక విషయాలు' రమేష్పట్నాయక్ విశ్లేషణా పరిచయమిది. చాలాకాలంగా రమేష్ పట్నాయక్ మార్పిజం, దానికి కొనసాగింపు అయిన తత్వశాస్త్రం పరిశీలనపై అధ్యయనం చేస్తున్నారు. సరళమైన వ్యక్తీకరణలో రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రగతిశీల శిబిరాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు, రాజకీయ తీవ్రతను పెంచడానికి మార్క్సిజం శాస్త్రీయ అధ్యయనపరునిగా రమేష్ పట్నాయక్ కృషి స్వాగతించదగినది. మార్క్సిజం ఒక రాజకీయశాస్త్రం. మానవ మనుగడకు దారి చూపే వెలుగు. రెండు శతాబ్దాల మానవ ప్రపంచాన్ని, మానవీయంగా మార్చడానికి, అసమానతలు లేని నూత్న ప్రపంచాన్ని రూపొందించడానికి, మార్క్స్ చేసిన కృషి, ఇవాల్టి సమాజపు అవసరముగా కూడా వుంది. మార్క్సిజాన్ని అంచనా వేస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశీలనలు వచ్చాయి. పెట్టుబడిని తమ అధ్యయన పరంపరలో భాగం చేసుకున్నవారు, సకల మానవాళి పరాయీకృత శ్రమ నుండి, సకల అణచివేతల నుండి విముక్తి చేసే సృజనాత్మక ప్రపంచానికి ఒక దారి వేయడానికి ప్రయత్నం కొనసాగుతుంది. మార్క్స్ తాత్విక దృక్పథానికి వర్తమాన కాలంలో ప్రాసంగికత మరింత పెరిగింది. ప్రపంచం మారుతున్న కాలం. మనుషులు కొత్త ఆరాట ప్రపంచంలో తమ భవిష్యత్ను వెతుక్కుంటున్న క్రమంలో గతకాలపు మార్క్స్ ఎట్లా ఈ కాలానికి అవసరమవుతాడు. మార్క్స్ జీవించిన కాలం దాటి ప్రపంచం చాలా ముందుకు పోయింది. కోట్లాదిమంది ప్రజలు తమయిన జీవితాన్ని రూపొందించుకోవడానికి, ఇంకాస్త మెరుగయిన, సౌకర్యవంతమైన జీవన ప్రణాళిక కోసం సౌందర్యాత్మక జీవనం కోసం నిన్నటికంటే ఇవాళ బాగుంటుందని రేపు తేజోవంతమవుతుందని ఆశిస్తున్నారు. మానవుడు కోరుకున్న ప్రపంచం సాధ్యమయిందా? లేదా సాధ్యమవుతుందా? సకల అణచివేతల నుండి, తేజోమయ ప్రపంచం రూపొందడానికి మార్క్స్ చూపిన దారి, ఆ వెలుగులో మార్క్స్...................© 2017,www.logili.com All Rights Reserved.