గగ్గి తిప్ప
- వివేక్ లంకమల
ఒకవైపు తండ్రి, మరోవైపు పదేళ్ల శ్రమ, పట్టుదల ఒక రూపుకొస్తున్న సందర్భం. ఎటూ తేల్చుకోలేక సతమతమైపోతున్నాడు. పుట్టినప్పుడు వారసుడొచ్చాడని మురిసిపోయిన తండ్రి, మీ వాడికి మంచి తెలివుందని బడిలో టీచర్లు చెబుతుంటే లోలోపల సంతోషపడ్డ తండ్రి, ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే అమెరికాకు పయనమవుతుంటే ఊర్లో అందరికీ చెప్పుకుని సంబరపడ్డ తండ్రి. బిడ్డ తొందరగా బయల్దేరి వస్తే మట్టిలోనో, బూడిదగానో కలిసిపోడానికి ఫ్రీజర్ బాక్సులో శాశ్వతంగా నిద్రపోయి ఎదురుచూస్తున్నాడు. ఆయన చివరిశ్వాస విడిచి ఒకరోజు గడిచింది అప్పటికే.
ఎక్కడో కడప జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువు నేర్చిన పల్లెటూరి పిల్లోడు రాష్ట్రాలు, దేశాలు దాటి ఇంతదూరమొచ్చి తెలివితో, అంతకుమించిన శ్రమతో ఒరాకిల్, ఎస్ఏపీ వంటి కంపెనీలకు ధీటుగా సొంతంగా ఒక సాఫ్ట్వేర్ అనలిటిక్స్ టూల్ తయారు చెయ్యడం, పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడిప్పుడే డెమోకు పిలవబోతున్న సందర్భం అది.
పిడికిలి బిగించి, నుదిటిని అనుస్తున్నట్టు పెట్టుకున్న ముంజేయి మనసులోని సందిగ్ధతని తెలుపుతోంది. అవేమీ పట్టనట్టు భార్య, కొడుకు బ్యాగుల్లో బట్టలు సర్దుతున్నారు. వాళ్లూ అలాగే ఉన్నారు ముభావంగా..................
గగ్గి తిప్ప - వివేక్ లంకమల ఒకవైపు తండ్రి, మరోవైపు పదేళ్ల శ్రమ, పట్టుదల ఒక రూపుకొస్తున్న సందర్భం. ఎటూ తేల్చుకోలేక సతమతమైపోతున్నాడు. పుట్టినప్పుడు వారసుడొచ్చాడని మురిసిపోయిన తండ్రి, మీ వాడికి మంచి తెలివుందని బడిలో టీచర్లు చెబుతుంటే లోలోపల సంతోషపడ్డ తండ్రి, ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే అమెరికాకు పయనమవుతుంటే ఊర్లో అందరికీ చెప్పుకుని సంబరపడ్డ తండ్రి. బిడ్డ తొందరగా బయల్దేరి వస్తే మట్టిలోనో, బూడిదగానో కలిసిపోడానికి ఫ్రీజర్ బాక్సులో శాశ్వతంగా నిద్రపోయి ఎదురుచూస్తున్నాడు. ఆయన చివరిశ్వాస విడిచి ఒకరోజు గడిచింది అప్పటికే. ఎక్కడో కడప జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువు నేర్చిన పల్లెటూరి పిల్లోడు రాష్ట్రాలు, దేశాలు దాటి ఇంతదూరమొచ్చి తెలివితో, అంతకుమించిన శ్రమతో ఒరాకిల్, ఎస్ఏపీ వంటి కంపెనీలకు ధీటుగా సొంతంగా ఒక సాఫ్ట్వేర్ అనలిటిక్స్ టూల్ తయారు చెయ్యడం, పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడిప్పుడే డెమోకు పిలవబోతున్న సందర్భం అది. పిడికిలి బిగించి, నుదిటిని అనుస్తున్నట్టు పెట్టుకున్న ముంజేయి మనసులోని సందిగ్ధతని తెలుపుతోంది. అవేమీ పట్టనట్టు భార్య, కొడుకు బ్యాగుల్లో బట్టలు సర్దుతున్నారు. వాళ్లూ అలాగే ఉన్నారు ముభావంగా..................© 2017,www.logili.com All Rights Reserved.