గాజు పెంకు
ఇరవై ఏళ్ళు తనని బంధించిన జైలువైపాక్కమారు తిరిగి చూశాడు రంగనాథం. విడిపోతున్న ఆప్తమిత్రుడిలా ఓ నవ్వు నవ్వింది జైలు. దీర్ఘంగా నిట్టూరుస్తూ ముందుకు కదిలాడు రంగనాథం.
జేబులోని చిల్లరను మరొక్క మారు లెక్క పెట్టుకొన్నాడు. పదిహేను రూపాయలు. అన్నీ అర్ధరూపాయి బిళ్ళలు. మరీ బరువుగా తోచినట్టుంది. సగం నాణేలు గుప్పిటిలోకి తీసుకొని ప్రక్క జేబులోకి మార్చాడు. కాస్త తేలికయినట్లనిపించింది. లేని ఓపికను తెచ్చుకొంటూ రైల్వేస్టేషన్ వైపు నడక సాగించాడు.
‘విశాఖపట్టణానికి రైలెప్పుడు బాబూ?' టికెట్టు కలెక్టరు నడిగాడు
రంగనాథం.
'రాత్రి ఒంటి గంటకు.”
'టికెట్లిచ్చేది...?' వినమ్రంగా అడిగాడు.
'అదిగో... అక్కడ.'
అతను చూపించినవైపు వెళ్ళాడు.
బుకింగ్ ఆఫీసు మూసి ఉన్నారు. రైలు రావడానికి గంటో గంటన్నరో ముందు మాత్రమే టికెట్లు ఇస్తారట.' పక్కనున్న అతనెవరో అన్నాడు.
అంతవరకూ ఆశ్రయం కోసం చుట్టూ చూశాడు రంగనాథం. ఎక్కడా ఖాళీగా లేదు. ఊళ్ళోని వారందరూ అక్కడే సంసారం పెట్టినట్లు కిటకిటలాడుతూంది స్టేషన్..........................
గాజు పెంకు ఇరవై ఏళ్ళు తనని బంధించిన జైలువైపాక్కమారు తిరిగి చూశాడు రంగనాథం. విడిపోతున్న ఆప్తమిత్రుడిలా ఓ నవ్వు నవ్వింది జైలు. దీర్ఘంగా నిట్టూరుస్తూ ముందుకు కదిలాడు రంగనాథం. జేబులోని చిల్లరను మరొక్క మారు లెక్క పెట్టుకొన్నాడు. పదిహేను రూపాయలు. అన్నీ అర్ధరూపాయి బిళ్ళలు. మరీ బరువుగా తోచినట్టుంది. సగం నాణేలు గుప్పిటిలోకి తీసుకొని ప్రక్క జేబులోకి మార్చాడు. కాస్త తేలికయినట్లనిపించింది. లేని ఓపికను తెచ్చుకొంటూ రైల్వేస్టేషన్ వైపు నడక సాగించాడు. ‘విశాఖపట్టణానికి రైలెప్పుడు బాబూ?' టికెట్టు కలెక్టరు నడిగాడు రంగనాథం. 'రాత్రి ఒంటి గంటకు.” 'టికెట్లిచ్చేది...?' వినమ్రంగా అడిగాడు. 'అదిగో... అక్కడ.' అతను చూపించినవైపు వెళ్ళాడు. బుకింగ్ ఆఫీసు మూసి ఉన్నారు. రైలు రావడానికి గంటో గంటన్నరో ముందు మాత్రమే టికెట్లు ఇస్తారట.' పక్కనున్న అతనెవరో అన్నాడు. అంతవరకూ ఆశ్రయం కోసం చుట్టూ చూశాడు రంగనాథం. ఎక్కడా ఖాళీగా లేదు. ఊళ్ళోని వారందరూ అక్కడే సంసారం పెట్టినట్లు కిటకిటలాడుతూంది స్టేషన్..........................© 2017,www.logili.com All Rights Reserved.