“నేను ఇంకా పది రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తట్టుంది పిల్లా...” "ఇంకా పది రోజులా ఎందుకు బావ!! రెండు రోజులల్ల నువ్వు వస్తవని ఎంత ఆశపడ్డ తెలుసా!! ఈ నెల జీతం రాంగనే నీకిష్టమైన నారింజ రంగు చీర కొనుక్కొని, నువ్వు వచ్చే రోజు ఆ చీర కట్టుకొని, మన చెట్టుకి పూసిన మల్లెపూలు పెట్టుకుని నీకు ఎదురొద్దామనుకున్నా. పో.. బావ! అంత చెడగొట్టినవ్.”
రావాలనిపించే ముచ్చట్లు చెప్పి, పో! అంటవేంది పిల్లా...
అనిపిస్తే వస్తవా ఏంది నువ్వు. నాకంటే నీకు ఆ పనే ఎక్కువైంది... నువ్వు మనిషిని ఊరించి ఊరించి సంపుతవే పిల్లా...
నేనేమంటిని ఇప్పుడు...
నారింజ రంగు చీర అంటివి, మల్లెపూలు అంటివి...ఇగ నాకు ఎట్లుంటది. Jap...
ఎందుకు బావ నీకు నారింజ రంగు చీర అంటే అంత ఇష్టం... మన మొదటిరాత్రి కూడా నారింజ రంగు చీరనే కట్టుకోవాలని పట్టుపట్టి మరి కట్టుకోమన్నవ్. నాకాడ లేకుంటే బాబాయిని అప్పటికప్పుడు పట్నం పంపించి మరి తెప్పించి నేనే జాకెట్ కుట్టుకొని కట్టుకున్న తెలుసా... నీకోసమని...
అంతకష్టపడ్డందుకు ఎంత ముద్దుగున్నవే ఆ రోజు. నిండు పున్నమినాడు పూసే తెల్లపువ్వులెక్క.................
“నేను ఇంకా పది రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తట్టుంది పిల్లా...” "ఇంకా పది రోజులా ఎందుకు బావ!! రెండు రోజులల్ల నువ్వు వస్తవని ఎంత ఆశపడ్డ తెలుసా!! ఈ నెల జీతం రాంగనే నీకిష్టమైన నారింజ రంగు చీర కొనుక్కొని, నువ్వు వచ్చే రోజు ఆ చీర కట్టుకొని, మన చెట్టుకి పూసిన మల్లెపూలు పెట్టుకుని నీకు ఎదురొద్దామనుకున్నా. పో.. బావ! అంత చెడగొట్టినవ్.” రావాలనిపించే ముచ్చట్లు చెప్పి, పో! అంటవేంది పిల్లా... అనిపిస్తే వస్తవా ఏంది నువ్వు. నాకంటే నీకు ఆ పనే ఎక్కువైంది... నువ్వు మనిషిని ఊరించి ఊరించి సంపుతవే పిల్లా... నేనేమంటిని ఇప్పుడు... నారింజ రంగు చీర అంటివి, మల్లెపూలు అంటివి...ఇగ నాకు ఎట్లుంటది. Jap... ఎందుకు బావ నీకు నారింజ రంగు చీర అంటే అంత ఇష్టం... మన మొదటిరాత్రి కూడా నారింజ రంగు చీరనే కట్టుకోవాలని పట్టుపట్టి మరి కట్టుకోమన్నవ్. నాకాడ లేకుంటే బాబాయిని అప్పటికప్పుడు పట్నం పంపించి మరి తెప్పించి నేనే జాకెట్ కుట్టుకొని కట్టుకున్న తెలుసా... నీకోసమని... అంతకష్టపడ్డందుకు ఎంత ముద్దుగున్నవే ఆ రోజు. నిండు పున్నమినాడు పూసే తెల్లపువ్వులెక్క.................© 2017,www.logili.com All Rights Reserved.