"నేను 'యజ్ఞం' లో వివరించిన కథాస్థలమిది. పంచాయితీ జరిగిన మండపం ఇది. జనం కూడిన ఖాళీ స్థలం అదిగో, ఇంకా ఖాళీస్థలంగానే ఉంది..." ఊహించని వివరం అందించారు కారాగారు. ఒళ్లు జలదరించింది.
మండపంలో కూర్చున్న శ్రీ రాములునాయుడు, కుడి ఎడమల లక్షుoనాయుడు, సూర్యంగారు, కొందరటూ కొందరిటూ పంచాయితీ సభ్యులు, మునసబు కారణాలు, మండపం మెట్ల దిగువన అప్పల్రాముడు, అతనికి దగ్గర్లో బంధుబలగం, వాళ్లందరికీ వెనగ్గా సీతారావుడు, వాళ్లింటి ఆడంగులు, మండపంలో గోపన్న, మండపం మెట్ల మీదా ముందు అరుగుల మీదా చూరు పంచల నీడల్లోనూ కూర్చున్న మిగతా ఊరి జనం - ఒక్కసారిగా కాలం యాభై ఏళ్లు వెనక్కి నడిచి వాళ్లంతా సజీవంగా కళ్లముందు నిలచినట్టు అనిపించింది. గగుర్పాటు!
"యజ్ఞం కథకు ఈ ఊరి పరిణామాలే నాకు ప్రేరణ. ఈ ఊరే దానికి భూమిక. ఊరి మొగలో ఓ మూడంతస్థుల మేడ చూపించాను గదా, అలాంటిదే శ్రీ రాములునాయుడు గారి నివాసం. ఆయన కల్పితపాత్ర గాదు. అసలు ఏవీ ఊహా జనితలూ గాదు. అసలు ఏవీ ఊహా జనితాలు గాదు. అన్నీ నాకు తెలిసిన వివరాలే!" - దాసరి అమరేంద్ర