షాంగ్రీలా
రుద్రప్రయాగ...
ప్రధాన రహదారిలో నడుస్తున్నాను...
నా మెడలో కెమెరా వేలాడుతోంది....
అడపాతడపా ఒకరిద్దరు తప్ప రోడ్డు మీద జనం లేరు...
ఖాళీగా గుర్రపుబళ్ళు నడుస్తున్నాయి-
విపరీతమైన చలి....
భుజం మీది స్కార్ఫ్ తీసి తలకు చుట్టుకున్నాను....
ఎదురుగా వస్తున్న ఓ వ్యక్తినిచూసి ఉలిక్కిపడ్డాను.
అతను ఆజానుబాహుడు.... పచ్చని శరీరచ్ఛాయ.... నడివయసుదాటిన వ్యక్తి అని నుదుట దగ్గర గీతలు, మెడవద్ద బిగిసడలిన చర్మం, సగంపైగా నెరిసిన జుట్టూ, చెప్తున్నాయి. కాని దృఢమైన శరీరం... మొనదేలిన ముక్కు చీలినగడ్డం ఖచ్చితంగా నేపాలి కాని టిబటన్ కానీ కాదు. బూడిద రంగులో వింతైన చర్మపు దుస్తులు ధరించాడు. చూడగానే ఏ దేశపు పౌరుడో అంచనా వేయడం దుర్లభంగా వుంది- చేతులనిండా, ముఖంనిండా తెల్లగా పాలిపోయినట్లు చీరుకుపోయి పుళ్ళు పడిన చర్మం... బహుశా "ఐస్-బైట్" వల్ల గావొచ్చు.
చాలా కాలంగా ప్రయాణించి యిక నడవలేనట్లు బలహీనంగా తూలుతున్నాడు- సింహాసనాలూ, రాజుల కాలంనాటి క్షత్ర గాత్రులైన సైనికాధికారిలా అగపడ్డాడు. అతని చూపులు నడుస్తున్న మార్గంమీద లేవు- ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడే వర్చస్సు....
అప్రయత్నంగా అతని మార్గంలో ఆగిపోయి నమస్కరించాను.
అగంతకుడు తొట్రుపాటుగా ఆగి కళ్ళెత్తిచూశాడు.
అతని పెదవులపై చిరునవ్వు బలహీనంగా మెరిసింది. అంతే! మరుక్షణం కూలిపోతున్న మహావృక్షంలా..............
షాంగ్రీలా రుద్రప్రయాగ... ప్రధాన రహదారిలో నడుస్తున్నాను... నా మెడలో కెమెరా వేలాడుతోంది.... అడపాతడపా ఒకరిద్దరు తప్ప రోడ్డు మీద జనం లేరు... ఖాళీగా గుర్రపుబళ్ళు నడుస్తున్నాయి- విపరీతమైన చలి.... భుజం మీది స్కార్ఫ్ తీసి తలకు చుట్టుకున్నాను.... ఎదురుగా వస్తున్న ఓ వ్యక్తినిచూసి ఉలిక్కిపడ్డాను. అతను ఆజానుబాహుడు.... పచ్చని శరీరచ్ఛాయ.... నడివయసుదాటిన వ్యక్తి అని నుదుట దగ్గర గీతలు, మెడవద్ద బిగిసడలిన చర్మం, సగంపైగా నెరిసిన జుట్టూ, చెప్తున్నాయి. కాని దృఢమైన శరీరం... మొనదేలిన ముక్కు చీలినగడ్డం ఖచ్చితంగా నేపాలి కాని టిబటన్ కానీ కాదు. బూడిద రంగులో వింతైన చర్మపు దుస్తులు ధరించాడు. చూడగానే ఏ దేశపు పౌరుడో అంచనా వేయడం దుర్లభంగా వుంది- చేతులనిండా, ముఖంనిండా తెల్లగా పాలిపోయినట్లు చీరుకుపోయి పుళ్ళు పడిన చర్మం... బహుశా "ఐస్-బైట్" వల్ల గావొచ్చు. చాలా కాలంగా ప్రయాణించి యిక నడవలేనట్లు బలహీనంగా తూలుతున్నాడు- సింహాసనాలూ, రాజుల కాలంనాటి క్షత్ర గాత్రులైన సైనికాధికారిలా అగపడ్డాడు. అతని చూపులు నడుస్తున్న మార్గంమీద లేవు- ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడే వర్చస్సు.... అప్రయత్నంగా అతని మార్గంలో ఆగిపోయి నమస్కరించాను. అగంతకుడు తొట్రుపాటుగా ఆగి కళ్ళెత్తిచూశాడు. అతని పెదవులపై చిరునవ్వు బలహీనంగా మెరిసింది. అంతే! మరుక్షణం కూలిపోతున్న మహావృక్షంలా..............© 2017,www.logili.com All Rights Reserved.