కులం మీద తన పార్టీ అభిప్రాయమే కాకుండా దాని ఎత్తుగడలు, వూహ్యాలు రూపొందటంలో తన రచనల ద్వారా అను ఎంతగానో దోహదం చేసింది. సామాజిక శాస్త్రంలో అకడెమిక్ శిక్షణ ద్వారా కంటే ప్రజలతో కలిసి పని చెయ్యటంలో ఏర్పడిన అవగాహనను దీంట్లో ఆమె ఉపయోగించుకుంది. ఈ రచనల ప్రాముఖ్యత ఎనలేనిది.
చైనాలో విప్లవాత్మక పరిణామాల స్ఫూర్తితో 1967 నక్సల్బరీ పోరాటం తరువాత ఏర్పడిన పార్లమెంటరీయేతర వామపక్షం గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాలను మొదలు పెట్టింది. దాంతో అనివార్యంగా కులం సమస్య ఎదురయ్యింది. అయితే 1967 నక్సల్బరీ పోరాటంలోనూ, ఆ తరువాత సిపిఐ (ఎంఎల్) ఏర్పడేటప్పుడు సైద్ధాంతిక చర్చలో కులం ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఆదివాసీలు, దళితులలో బలం పెరుగుతున్న నేపథ్యంలో దళిత్ అనుకూల, ఆదివాసీ అనుకూల ఉద్యమంగా అది గుర్తింపు పొందసాగింది.
1960ల నుంచి పెరుగుతున్న కుల అత్యాచారాలు, తమ కేడర్లో పెరుగుతున్న దళితుల సంఖ్య నేపధ్యంలో అంతకు ముందుకంటే తీవ్రంగా కులం సమస్యను పట్టించుకోవలసిన అవసరం పార్టీకి ఏర్పడింది.
ప్రత్యేకించి కుల ఆత్యచారాలు మరీ తీవ్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్‌లో స్పష్టమైన దళిత అనుకూల విధానాన్ని కొన్ని ఎంఎల్ బృందాలు అవలంబించి పైకులాల ఆధిపత్యాన్ని నిరోధించటంలోనూ, దళితుల హక్కులను చాటడంలోను, సమాజంలో పాతుకు పోయి ఉన్నపై కులాల ఆధిపత్య సాంస్కృతిక చిహ్నాలను చాలావరకు తల్లకిందులు చెయ్యటంలోను ప్రగతిని సాధించాయి. అయినప్పటికీ, కులవ్యతిరేక ఉద్యమంపై సైద్ధాంతిక దృక్పథం స్పష్టంగా నిర్వచించకుండానే ఉండి పోయింది.
1980ల నుంచి ఇది మారటం మొదలయ్యింది. వివిధ బృందాలు సైద్ధాంతికి లో కుల సమస్య గురించి స్పష్టత కోసం ప్రయత్నిస్తూ తమ కుల - వర్గ లక్రమాలను రూపొందించసాగాయి. పారీలో చోటు చేసుకున్న చర్చలు, వాదనలు.
కులం మీద తన పార్టీ అభిప్రాయమే కాకుండా దాని ఎత్తుగడలు, వూహ్యాలు రూపొందటంలో తన రచనల ద్వారా అను ఎంతగానో దోహదం చేసింది. సామాజిక శాస్త్రంలో అకడెమిక్ శిక్షణ ద్వారా కంటే ప్రజలతో కలిసి పని చెయ్యటంలో ఏర్పడిన అవగాహనను దీంట్లో ఆమె ఉపయోగించుకుంది. ఈ రచనల ప్రాముఖ్యత ఎనలేనిది. చైనాలో విప్లవాత్మక పరిణామాల స్ఫూర్తితో 1967 నక్సల్బరీ పోరాటం తరువాత ఏర్పడిన పార్లమెంటరీయేతర వామపక్షం గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాలను మొదలు పెట్టింది. దాంతో అనివార్యంగా కులం సమస్య ఎదురయ్యింది. అయితే 1967 నక్సల్బరీ పోరాటంలోనూ, ఆ తరువాత సిపిఐ (ఎంఎల్) ఏర్పడేటప్పుడు సైద్ధాంతిక చర్చలో కులం ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఆదివాసీలు, దళితులలో బలం పెరుగుతున్న నేపథ్యంలో దళిత్ అనుకూల, ఆదివాసీ అనుకూల ఉద్యమంగా అది గుర్తింపు పొందసాగింది. 1960ల నుంచి పెరుగుతున్న కుల అత్యాచారాలు, తమ కేడర్లో పెరుగుతున్న దళితుల సంఖ్య నేపధ్యంలో అంతకు ముందుకంటే తీవ్రంగా కులం సమస్యను పట్టించుకోవలసిన అవసరం పార్టీకి ఏర్పడింది. ప్రత్యేకించి కుల ఆత్యచారాలు మరీ తీవ్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్‌లో స్పష్టమైన దళిత అనుకూల విధానాన్ని కొన్ని ఎంఎల్ బృందాలు అవలంబించి పైకులాల ఆధిపత్యాన్ని నిరోధించటంలోనూ, దళితుల హక్కులను చాటడంలోను, సమాజంలో పాతుకు పోయి ఉన్నపై కులాల ఆధిపత్య సాంస్కృతిక చిహ్నాలను చాలావరకు తల్లకిందులు చెయ్యటంలోను ప్రగతిని సాధించాయి. అయినప్పటికీ, కులవ్యతిరేక ఉద్యమంపై సైద్ధాంతిక దృక్పథం స్పష్టంగా నిర్వచించకుండానే ఉండి పోయింది. 1980ల నుంచి ఇది మారటం మొదలయ్యింది. వివిధ బృందాలు సైద్ధాంతికి లో కుల సమస్య గురించి స్పష్టత కోసం ప్రయత్నిస్తూ తమ కుల - వర్గ లక్రమాలను రూపొందించసాగాయి. పారీలో చోటు చేసుకున్న చర్చలు, వాదనలు.© 2017,www.logili.com All Rights Reserved.