సింగన్న చతురత
-------- బూర్లె నాగేశ్వరరావు
చంద్రగిరి ఆనుకొని పెద్ద కీకారణ్యం ఉండేది. నగరంలో ఎంతోమంది ఆ అడవిని ఆసరాగా చేసుకొని జీవిస్తుండేవారు. అదే నగరంలో సింగన్న అనే వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి జంతువులను వేటాడి తెచ్చి నగరంలో అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. సింగన్న లేచింది మొదలు అడవిలోనే ఉండటం వలన అడవిలో ఉండే జంతువులు, క్రూరమృగాలు, పక్షుల అరుపులు వినీ వినీ వాటి అరుపులను అనుకరించేవాడు సరదాగా. రానురాను ధ్వని అనుకరణ విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు.
అచ్చం పులి గాండ్రించగలడు. సింహం లాగా గర్జించగలడు. ఆ గర్జనలు విని జింకలు, దుప్పులు, కుందేళ్ళ వంటివి భయంతో పరుగులు తీసేవి. అలా వాటి ఉనికిని పసిగట్టి వేటాడటం సింగన్నకు సులువయ్యేది. అతని ధ్వని అనుకరణ ఒక్కొక్కసారి ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడేది. ఎప్పటిలాగే ఒకరోజు వేటకు వెళ్ళిన సింగన్న చెట్టు పైకి ఎక్కి కనుచూపుమేరలో ఏవైనా జంతువులు ఉన్నాయేమో అని పరికించి చూశాడు. ఏవీ కనిపించలేదు. కానీ అల్లంత దూరాన కొందరు సైనికులు ఒక స్త్రీని బంధించి తీసుకెళుతుండటం అతని కంటబడింది. ఆమె కేకలు పెడుతూ గింజుకుంటోంది. ఆమెను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? తెలుసుకోవాలనిపించింది........................
సింగన్న చతురత -------- బూర్లె నాగేశ్వరరావు చంద్రగిరి ఆనుకొని పెద్ద కీకారణ్యం ఉండేది. నగరంలో ఎంతోమంది ఆ అడవిని ఆసరాగా చేసుకొని జీవిస్తుండేవారు. అదే నగరంలో సింగన్న అనే వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి జంతువులను వేటాడి తెచ్చి నగరంలో అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. సింగన్న లేచింది మొదలు అడవిలోనే ఉండటం వలన అడవిలో ఉండే జంతువులు, క్రూరమృగాలు, పక్షుల అరుపులు వినీ వినీ వాటి అరుపులను అనుకరించేవాడు సరదాగా. రానురాను ధ్వని అనుకరణ విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. అచ్చం పులి గాండ్రించగలడు. సింహం లాగా గర్జించగలడు. ఆ గర్జనలు విని జింకలు, దుప్పులు, కుందేళ్ళ వంటివి భయంతో పరుగులు తీసేవి. అలా వాటి ఉనికిని పసిగట్టి వేటాడటం సింగన్నకు సులువయ్యేది. అతని ధ్వని అనుకరణ ఒక్కొక్కసారి ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడేది. ఎప్పటిలాగే ఒకరోజు వేటకు వెళ్ళిన సింగన్న చెట్టు పైకి ఎక్కి కనుచూపుమేరలో ఏవైనా జంతువులు ఉన్నాయేమో అని పరికించి చూశాడు. ఏవీ కనిపించలేదు. కానీ అల్లంత దూరాన కొందరు సైనికులు ఒక స్త్రీని బంధించి తీసుకెళుతుండటం అతని కంటబడింది. ఆమె కేకలు పెడుతూ గింజుకుంటోంది. ఆమెను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? తెలుసుకోవాలనిపించింది........................© 2017,www.logili.com All Rights Reserved.