కాగితం విసనకర్ర
అది ఆగష్టు 1876 చివరి శనివారం. శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రొటెస్టెంట్ అనాథ శరణాలయాన్ని సందర్శించే రోజు. ఎలిజా లండన్ అనే సాదాసీదా చిన్నమ్మాయి తన తండ్రిని చూడడానికి చెల్లెలు ఇడాతో కలిసి వేచి ఉంది. చూట్టానికి వయసుకి చిన్నదైనా ఆరిందాలా ఉంది. తన ఎనిమిదేళ్ళ జీవితంలో చాలా విషయాలు జరిగాయి. పెద్ద కుటుంబంలో పుట్టింది. ఆమె తల్లి పదకొండు మంది పిల్లలకు జన్మనిచ్చి క్షయ వ్యాధితో చనిపోయింది.
ఆమె తల్లి చనిపోయేసరికి ఎనిమిది మంది పిల్లలు మాత్రమే జీవించి ఉన్నారు. తండ్రి ఆరడుగుల ఎత్తూ, విశాలమైన భుజాలు, గడ్డం ఉన్నప్పటికీ, అతనికిది మోయలేనంత భారం. అతను తన చిన్నకొడుకు చార్లెస్ ను మాత్రం కాలిఫోర్నియాకు తీసుకెళ్ళి, లోవాలోని తన బంధువుల వద్ద పెద్ద పిల్లలను ఉంచాలనుకున్నాడు. పిల్లాడి ఛాతి మీద తగిలిన దెబ్బ కూడా, ఊరు మారితే కోలుకోవచ్చని డాక్టర్ చెప్పాడు. ఎలిజాను, ఇడాను కూడా తీసుకెళ్ళక తప్పింది కాదు. వాళ్ళ మంకుపట్టు, ఏడుపూ కారణం. అలా విడిచి వెళ్ళడానికి అతనికి మనసొప్పలేదు.
జాన్ లండన్ అంత తెలివైనవాడు కాదు. చార్లెస్ ను కాలిఫోర్నియాకు మార్చమనడానికి కారణం, అక్కడ వేడి పొడి వాతావరణం దక్షిణాదిన ఉండడం. చార్లెస్ ను అక్కడ చేర్చిన వారంలో చనిపోయాడు....................
కాగితం విసనకర్ర అది ఆగష్టు 1876 చివరి శనివారం. శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రొటెస్టెంట్ అనాథ శరణాలయాన్ని సందర్శించే రోజు. ఎలిజా లండన్ అనే సాదాసీదా చిన్నమ్మాయి తన తండ్రిని చూడడానికి చెల్లెలు ఇడాతో కలిసి వేచి ఉంది. చూట్టానికి వయసుకి చిన్నదైనా ఆరిందాలా ఉంది. తన ఎనిమిదేళ్ళ జీవితంలో చాలా విషయాలు జరిగాయి. పెద్ద కుటుంబంలో పుట్టింది. ఆమె తల్లి పదకొండు మంది పిల్లలకు జన్మనిచ్చి క్షయ వ్యాధితో చనిపోయింది. ఆమె తల్లి చనిపోయేసరికి ఎనిమిది మంది పిల్లలు మాత్రమే జీవించి ఉన్నారు. తండ్రి ఆరడుగుల ఎత్తూ, విశాలమైన భుజాలు, గడ్డం ఉన్నప్పటికీ, అతనికిది మోయలేనంత భారం. అతను తన చిన్నకొడుకు చార్లెస్ ను మాత్రం కాలిఫోర్నియాకు తీసుకెళ్ళి, లోవాలోని తన బంధువుల వద్ద పెద్ద పిల్లలను ఉంచాలనుకున్నాడు. పిల్లాడి ఛాతి మీద తగిలిన దెబ్బ కూడా, ఊరు మారితే కోలుకోవచ్చని డాక్టర్ చెప్పాడు. ఎలిజాను, ఇడాను కూడా తీసుకెళ్ళక తప్పింది కాదు. వాళ్ళ మంకుపట్టు, ఏడుపూ కారణం. అలా విడిచి వెళ్ళడానికి అతనికి మనసొప్పలేదు. జాన్ లండన్ అంత తెలివైనవాడు కాదు. చార్లెస్ ను కాలిఫోర్నియాకు మార్చమనడానికి కారణం, అక్కడ వేడి పొడి వాతావరణం దక్షిణాదిన ఉండడం. చార్లెస్ ను అక్కడ చేర్చిన వారంలో చనిపోయాడు....................© 2017,www.logili.com All Rights Reserved.