అది శీతాకాలం. చిన్న బస్తాను కాళ్ళ కింద తొక్కిపెట్టి పూరో బటానీ గింజలు ఓపిగ్గా ఒలుస్తోంది. బటానీలను చేతి వేళ్ళ సందులో గట్టిగా నొక్కి తొక్కలు తీస్తోంది. గుప్పిట పట్టే గింజలను ఒలవాలని ఆమె ప్రయత్నం. ఇంతలో తెల్ల పురుగు ఒకటి ఆమె బొటన వేలుమీద పాకసాగింది. ఏదో బురద గుంటలో కాలేసినట్లుగా, పూరోకు ఒక్కసారిగా అసహ్యం వేసింది. దాన్ని చూస్తూనే చీదర పుట్టింది. చేతిని గట్టిగా విదిలించి పురుగుని దూరంగా విసిరికొట్టింది. తన చేతులను మోకాళ్ళ మధ్య పెట్టుకొని భయకంపంతో గట్టిగా నొక్కుకుంది. బటానీ పొట్టు, పొట్టు తీసిన గింజలు పూరో ఎదురుగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
భయంతో పూరో చేతులను గుండెపై ఆన్చి ఆ పురుగు గురించే ఆలోచించసాగింది. తన శరీరం నిలువెల్లా బటానీ పొలుసు మాదిరిగా ఆమెకు అనిపించసాగింది. పొట్టు లోపల శుభ్రమైన బటానీ గింజల స్థానంలో ఒక గలీజు పురుగు పాకుతున్న భావన కలిగి ఆమె ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించింది. పూరోకు తన శరీరంపైనే ఒక విధమైన రోత పుట్టింది. తన కడుపులో పాకుతున్న ఆ పురుగును విసిరికొట్టాలని ఆమెకు అనిపించింది. గుచ్చుకున్న ముల్లును గోళ్ళతో తీసిపారేసినట్లు... పల్లేరు ముళ్ళను పీకిపారేసినట్లు...కళ్ళలో అంటుకుపోయిన పుసిని తీసేసినట్లు... ఒంటికి పట్టుకున్న జలగను లాగిపారేసినట్లుగా... ఆ పురుగును బయటపడేయాలని ఆమె అనుకొంది.
పూరో ఎదురుగా ఉన్న గోడను తదేకంగా చూడసాగింది. గడిచిన రోజులన్నీ ఒక్కొక్కటిగా ఆమె కళ్ళ ముందు కదలాడుతున్నాయి.
పూరోది గుజరాత్ (పాకిస్తాన్) జిల్లాలోని ఛత్తోవానీ గ్రామం. ఆమె సాహుకారు కుటుంబంలో పుట్టింది. వారు పేరుకే తప్ప నిజంగా డబ్బున్న సాహుకార్లు కాదు.............
అది శీతాకాలం. చిన్న బస్తాను కాళ్ళ కింద తొక్కిపెట్టి పూరో బటానీ గింజలు ఓపిగ్గా ఒలుస్తోంది. బటానీలను చేతి వేళ్ళ సందులో గట్టిగా నొక్కి తొక్కలు తీస్తోంది. గుప్పిట పట్టే గింజలను ఒలవాలని ఆమె ప్రయత్నం. ఇంతలో తెల్ల పురుగు ఒకటి ఆమె బొటన వేలుమీద పాకసాగింది. ఏదో బురద గుంటలో కాలేసినట్లుగా, పూరోకు ఒక్కసారిగా అసహ్యం వేసింది. దాన్ని చూస్తూనే చీదర పుట్టింది. చేతిని గట్టిగా విదిలించి పురుగుని దూరంగా విసిరికొట్టింది. తన చేతులను మోకాళ్ళ మధ్య పెట్టుకొని భయకంపంతో గట్టిగా నొక్కుకుంది. బటానీ పొట్టు, పొట్టు తీసిన గింజలు పూరో ఎదురుగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. భయంతో పూరో చేతులను గుండెపై ఆన్చి ఆ పురుగు గురించే ఆలోచించసాగింది. తన శరీరం నిలువెల్లా బటానీ పొలుసు మాదిరిగా ఆమెకు అనిపించసాగింది. పొట్టు లోపల శుభ్రమైన బటానీ గింజల స్థానంలో ఒక గలీజు పురుగు పాకుతున్న భావన కలిగి ఆమె ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించింది. పూరోకు తన శరీరంపైనే ఒక విధమైన రోత పుట్టింది. తన కడుపులో పాకుతున్న ఆ పురుగును విసిరికొట్టాలని ఆమెకు అనిపించింది. గుచ్చుకున్న ముల్లును గోళ్ళతో తీసిపారేసినట్లు... పల్లేరు ముళ్ళను పీకిపారేసినట్లు...కళ్ళలో అంటుకుపోయిన పుసిని తీసేసినట్లు... ఒంటికి పట్టుకున్న జలగను లాగిపారేసినట్లుగా... ఆ పురుగును బయటపడేయాలని ఆమె అనుకొంది. పూరో ఎదురుగా ఉన్న గోడను తదేకంగా చూడసాగింది. గడిచిన రోజులన్నీ ఒక్కొక్కటిగా ఆమె కళ్ళ ముందు కదలాడుతున్నాయి. పూరోది గుజరాత్ (పాకిస్తాన్) జిల్లాలోని ఛత్తోవానీ గ్రామం. ఆమె సాహుకారు కుటుంబంలో పుట్టింది. వారు పేరుకే తప్ప నిజంగా డబ్బున్న సాహుకార్లు కాదు.............© 2017,www.logili.com All Rights Reserved.