సామాజిక ఔన్నత్యానికి గీటురాయి
సంపద, నాగరికతలు కావు :
అందులో కనిపించే మానవతా విలువలు -
అని చాటిన సంచలనాత్మక ఫ్రెంచి నవల
'పాపియాన్' కు తెలుగు అనువాదం.
'పాపియాన్' పేరుతో ఫ్రెంచి భాషలో హెన్రీ షారియర్ రచించిన ఈ ఆత్మకధ మానవతా విలువలను ఎన్నో కోణాలనుంచి ఆవిష్కరించింది. యావజ్జీవ ప్రవాస శిక్షకు గురైన ఈ రచయిత, ప్రాణం కంటే స్వేచ్చకు ప్రాధాన్యత ఇవ్వడం ఇందులో కధాంశం. ఈ పునాది మీద, విభిన్న సమాజాలను, సంస్కృతులను, వ్యక్తులనూ, ప్రవృత్తులను, రచయిత అద్బుతంగా చిత్రీకరించ గలిగాడు. సంపద, నాగరికతలు సామాజిక ఔన్నత్యానికి కొలబద్దలు కావనీ, అందులో మానవత్వాని కిచ్చే విలువ దాని స్థాయిని నిర్ణయిస్తుందని ప్రకటించాడు. శిక్షాస్మృతిలో దాగుండే కుళ్ళిపోయిన భాగాలను, కారాగారాల్లో సాగే కిరాతకత్వాలను ఎత్తిచూపి, దారితప్పిన మనిషిని మానసిక పరివర్తన ద్వారా సరిదిద్దగలమే తప్ప అణిచివేత ద్వారా సాధ్యపడదని నిరూపించాడు. శిక్షను అమలుపరిచే విధానంలో ప్రపంచవ్యాప్తంగా సంస్కరణలకు దోహదం చేసిన నవల ఇది.
సామాజిక ఔన్నత్యానికి గీటురాయి సంపద, నాగరికతలు కావు : అందులో కనిపించే మానవతా విలువలు - అని చాటిన సంచలనాత్మక ఫ్రెంచి నవల 'పాపియాన్' కు తెలుగు అనువాదం. 'పాపియాన్' పేరుతో ఫ్రెంచి భాషలో హెన్రీ షారియర్ రచించిన ఈ ఆత్మకధ మానవతా విలువలను ఎన్నో కోణాలనుంచి ఆవిష్కరించింది. యావజ్జీవ ప్రవాస శిక్షకు గురైన ఈ రచయిత, ప్రాణం కంటే స్వేచ్చకు ప్రాధాన్యత ఇవ్వడం ఇందులో కధాంశం. ఈ పునాది మీద, విభిన్న సమాజాలను, సంస్కృతులను, వ్యక్తులనూ, ప్రవృత్తులను, రచయిత అద్బుతంగా చిత్రీకరించ గలిగాడు. సంపద, నాగరికతలు సామాజిక ఔన్నత్యానికి కొలబద్దలు కావనీ, అందులో మానవత్వాని కిచ్చే విలువ దాని స్థాయిని నిర్ణయిస్తుందని ప్రకటించాడు. శిక్షాస్మృతిలో దాగుండే కుళ్ళిపోయిన భాగాలను, కారాగారాల్లో సాగే కిరాతకత్వాలను ఎత్తిచూపి, దారితప్పిన మనిషిని మానసిక పరివర్తన ద్వారా సరిదిద్దగలమే తప్ప అణిచివేత ద్వారా సాధ్యపడదని నిరూపించాడు. శిక్షను అమలుపరిచే విధానంలో ప్రపంచవ్యాప్తంగా సంస్కరణలకు దోహదం చేసిన నవల ఇది.© 2017,www.logili.com All Rights Reserved.