తన కవిత్వం గురించి కేదార్‌నాథ్ సింగ్
నేను ఎందుకు రాస్తున్నాను, ఎలా రాస్తున్నాను అనే ప్రశ్నలకు నా దగర సూటిగా సమాధానం లేదు. రాయడమనే యాత్ర నేను మాట్లాడడంతోనే
ప్రారంభమయిందని నాకు తెలుసు. నేను మాట్లాడుతున్నాను- అందుకే రాస్తున్నాను.
మనిషి చరిత్రలో రాయడం మాట్లాడడాన్ని అనుసరిస్తుంది. ఇదే సాహిత్యానికీ వర్తిస్తుంది. నేను రాస్తూ వున్నప్పుడు నేను మాట్లాడుతున్నట్టే నాకన్పిస్తుంటుంది. ఈ మాట్లాడడం మాటిమాటికీ నాకొక అనుభూతిని యిస్తుంది. నాకూ, కాగితం పై జారుతున్న పదాలకూ మధ్య వేరెవరో ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి ఆ మధ్యనున్నదే నాకూ, నా పదాలకు మధ్య సంబంధాన్ని నిర్ణయిస్తుంది. గమనిస్తే, ఇది పదాలతో కలసిమెలసి
ప్రవహిస్తుంది. పదం బయటకు వస్తుంది. అంతకు ముందు బయట నుండి 'దేన్నో తనతో పాటు తీసుకొని నా లోపలికి వెళుతుంది.
కాగితం మీద జరుగుతున్నదంతా, బయటి లోపలి ప్రపంచాల మౌన | సంవాదం. కొన్నిసార్లు వాగ్వివాదం, కొన్నిసార్లు ఎడముఖం పెడముఖం, కొన్నిసార్లు చీలిక. ఈ ఒత్తిడిని పదం మౌనంగా సహిస్తుంది. పట్టణ కేంద్రిత ఆధునిక సృజనాత్మకత, గ్రామాధారిత చైతన్యాల మధ్య ఒక విధమైన ఘర్షణను గమనించాను. ఈ ఘర్షణ మన దైనందిన జీవన వాస్తవికత. దీనివైపు మన దృష్టి తక్కువ పోతుంది. నా రచనల్లో ఈ రెంటినీ సమాహితం చేస్తున్నాను. ఇందులో నేను ఎంతవరకూ సఫలీకృతం అయ్యానో చెప్పలేను | గానీ, అది నా రచనా ప్రక్రియ అంతర్భాగమని చెప్పగలను.............
తన కవిత్వం గురించి కేదార్‌నాథ్ సింగ్ నేను ఎందుకు రాస్తున్నాను, ఎలా రాస్తున్నాను అనే ప్రశ్నలకు నా దగర సూటిగా సమాధానం లేదు. రాయడమనే యాత్ర నేను మాట్లాడడంతోనే ప్రారంభమయిందని నాకు తెలుసు. నేను మాట్లాడుతున్నాను- అందుకే రాస్తున్నాను. మనిషి చరిత్రలో రాయడం మాట్లాడడాన్ని అనుసరిస్తుంది. ఇదే సాహిత్యానికీ వర్తిస్తుంది. నేను రాస్తూ వున్నప్పుడు నేను మాట్లాడుతున్నట్టే నాకన్పిస్తుంటుంది. ఈ మాట్లాడడం మాటిమాటికీ నాకొక అనుభూతిని యిస్తుంది. నాకూ, కాగితం పై జారుతున్న పదాలకూ మధ్య వేరెవరో ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి ఆ మధ్యనున్నదే నాకూ, నా పదాలకు మధ్య సంబంధాన్ని నిర్ణయిస్తుంది. గమనిస్తే, ఇది పదాలతో కలసిమెలసి ప్రవహిస్తుంది. పదం బయటకు వస్తుంది. అంతకు ముందు బయట నుండి 'దేన్నో తనతో పాటు తీసుకొని నా లోపలికి వెళుతుంది. కాగితం మీద జరుగుతున్నదంతా, బయటి లోపలి ప్రపంచాల మౌన | సంవాదం. కొన్నిసార్లు వాగ్వివాదం, కొన్నిసార్లు ఎడముఖం పెడముఖం, కొన్నిసార్లు చీలిక. ఈ ఒత్తిడిని పదం మౌనంగా సహిస్తుంది. పట్టణ కేంద్రిత ఆధునిక సృజనాత్మకత, గ్రామాధారిత చైతన్యాల మధ్య ఒక విధమైన ఘర్షణను గమనించాను. ఈ ఘర్షణ మన దైనందిన జీవన వాస్తవికత. దీనివైపు మన దృష్టి తక్కువ పోతుంది. నా రచనల్లో ఈ రెంటినీ సమాహితం చేస్తున్నాను. ఇందులో నేను ఎంతవరకూ సఫలీకృతం అయ్యానో చెప్పలేను | గానీ, అది నా రచనా ప్రక్రియ అంతర్భాగమని చెప్పగలను.............© 2017,www.logili.com All Rights Reserved.