1 కోయపల్లె
ఆ రోజు ఉదయమే ఎన్నో లారీలు పెద్ద పెద్ద శబ్దాలతో ఊళ్ళోకి వస్తున్నాయి. వాటి వెనకాలే బుల్డోజర్లు, ప్రొక్లేయన్లు కూడా వస్తున్నాయి. వాటి రాకతో దుమ్ము విపరీతంగా రేగుతోంది. ఆ దుమ్ము ఎన్ని లారీలు వస్తున్నాయో, ఎన్ని లారీలు పోతున్నాయో తెలియనంతగా కమ్మేసింది. ఆ మోటర్ల చప్పుడుకు అక్కడే పడుకున్న ఆ గ్రామ దేవత ఆత్మ దిగ్గున లేచి బిత్తరపోతూ మేల్కొంది. మొద్దు నిద్రపోతున్న తన మగతోడు "కొడ” చెట్టును కూడా గట్టిగా కుదిపి తట్టి లేపింది. ఆ "కొడ” ఆత్మ కూడా ముత్యాలమ్మ చెట్టు ఆత్మ మాదిరిగానే భయంతో నివ్వెరపోయింది. మేల్కొన్నదే మొదలు వెన్నులో వణుకు పుట్టింది. కళ్ళు బైర్లు కమ్మినాయి. కాళ్ళు, చేతులు సల్లబడి మొద్దుబారి కదలలేక బరువెక్కినాయి. కొంతసేపు ఏమి చూస్తు న్నామో అర్ధంగాక తాము ఎక్కడున్నామో, తమ చుట్టూ ఏమవుతోందో తెలియలేదు. కొంతసేపటికి ఆ అయోమయం నుంచి తేరుకొని అటువేపు చూసాయి.
అక్కడ ఆ మోటర్లు వచ్చి నిలిచాయి. అందరికంటే ముందుగా పోలీసులు, రెవెన్యూ అధికారులు జీపుల్లో వచ్చి దిగారు. వారిలో ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. అతను ప్రభుత్వ పెద్ద అధికారి కావచ్చు, వాకీటాకీలో "మీరు మీ ఇళ్లలోని అన్ని సరుకు, ధాన్యం, గింజలు, సరుకులు తదితర సామాన్లు సర్దుకొని, మూటగట్టుకుని, మీమీ ముల్లెలతో సహా సిద్ధంచేసుకోండి. ఇక్కడకు వచ్చిన లారీల్లో వాటిని...................
1 కోయపల్లె ఆ రోజు ఉదయమే ఎన్నో లారీలు పెద్ద పెద్ద శబ్దాలతో ఊళ్ళోకి వస్తున్నాయి. వాటి వెనకాలే బుల్డోజర్లు, ప్రొక్లేయన్లు కూడా వస్తున్నాయి. వాటి రాకతో దుమ్ము విపరీతంగా రేగుతోంది. ఆ దుమ్ము ఎన్ని లారీలు వస్తున్నాయో, ఎన్ని లారీలు పోతున్నాయో తెలియనంతగా కమ్మేసింది. ఆ మోటర్ల చప్పుడుకు అక్కడే పడుకున్న ఆ గ్రామ దేవత ఆత్మ దిగ్గున లేచి బిత్తరపోతూ మేల్కొంది. మొద్దు నిద్రపోతున్న తన మగతోడు "కొడ” చెట్టును కూడా గట్టిగా కుదిపి తట్టి లేపింది. ఆ "కొడ” ఆత్మ కూడా ముత్యాలమ్మ చెట్టు ఆత్మ మాదిరిగానే భయంతో నివ్వెరపోయింది. మేల్కొన్నదే మొదలు వెన్నులో వణుకు పుట్టింది. కళ్ళు బైర్లు కమ్మినాయి. కాళ్ళు, చేతులు సల్లబడి మొద్దుబారి కదలలేక బరువెక్కినాయి. కొంతసేపు ఏమి చూస్తు న్నామో అర్ధంగాక తాము ఎక్కడున్నామో, తమ చుట్టూ ఏమవుతోందో తెలియలేదు. కొంతసేపటికి ఆ అయోమయం నుంచి తేరుకొని అటువేపు చూసాయి. అక్కడ ఆ మోటర్లు వచ్చి నిలిచాయి. అందరికంటే ముందుగా పోలీసులు, రెవెన్యూ అధికారులు జీపుల్లో వచ్చి దిగారు. వారిలో ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. అతను ప్రభుత్వ పెద్ద అధికారి కావచ్చు, వాకీటాకీలో "మీరు మీ ఇళ్లలోని అన్ని సరుకు, ధాన్యం, గింజలు, సరుకులు తదితర సామాన్లు సర్దుకొని, మూటగట్టుకుని, మీమీ ముల్లెలతో సహా సిద్ధంచేసుకోండి. ఇక్కడకు వచ్చిన లారీల్లో వాటిని...................© 2017,www.logili.com All Rights Reserved.